వర్కవుట్ అయ్యింది వెబ్ సిరీస్ ప్రారంభం
‘వర్కవుట్ అయ్యింది’ పేరుతో ఓ వెబ్ సిరీస్ ప్రారంభమైంది. మా ఆయి పతాకంపై బి.శివకుమార్ దర్శకత్వంలో రూపేష్ కుమార్ చౌదరి ఈ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. డిసెంబర్ 17న ఈ సిరీస్ షూటింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని పలు లొకేషన్స్‌లో ఈ సిరీస్ షూటింగ్ జరపనున్నారు.
రూపేష్‌కుమార్ చౌదరి, మీనాకుమారి, శశిధర్, సూర్య, ఫన్ బకెట్ ఫణి, ఫన్ బకెట్ భార్గవి, ఇషాని, ఫణీంద్ర, మోడబుల్ గై, రాహుల్ కొసరాజు నటిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో ప్రముఖ డాన్స్‌మాస్టర్ అనీ లామా కీలక ప్రాతలో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: బి.వి.రవికిరణ్, ఎడిటింగ్: శ్యామ్ వాడవల్లి, మాటలు: డా.చల్లా భాగ్యలక్ష్మి, కో-డైరెక్టర్: అనిల్‌కుమార్ బి., నిర్మాత: రూపేష్‌కుమార్ చౌదరి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బి.శివకుమార్.