వారసుడు మూవీ లిరికల్ సాంగ్ విడుదల
దళపతి విజయ్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు వారసుడు నుండి ఇట్స్ ఫర్ యు అమ్మా ది సోల్ ఆఫ్ వారసుడు విడుదల
దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ల భారీ అంచనాల చిత్రం వారసుడు/వారిసు తెలుగు, తమిళంలో సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌లో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయిక నటిస్తోంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌తో దూసుకుపోతోంది. చార్ట్‌బస్టర్ నంబర్ రంజితమే ఇప్పటివరకు 100 మిలియన్ల వ్యూస్ సాధించింది. రెండవ పాట థీ దళపతి కూడా మ్యూజికల్ చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉంది. తాజాగా ఇట్స్ ఫర్ యూ అమ్మ అనే మూడో సింగిల్‌ని చిత్ర బృందం విడుదల చేసింది.
ఈ పాట వారసుడు సోల్, కథకు కీలకమైన అమ్మ సెంటిమెంట్‌ను తెలియజేస్తోంది. సరస్వతీపుత్ర రామ జోగయ్య శాస్త్రి రాసిన మ్యాజికల్ పదాలకు లెజెండరీ సింగర్ కెఎస్ చిత్ర స్వీట్, సోల్ ఫుల్ వాయిస్ ని అందించింది. థమన్ అందమైన ట్యూన్, సోల్ స్ట్రిగింగ్ మ్యూజిక్ తో పాటని అద్భుతంగా స్వరపరిచారు.
ముగ్గురూ కలిసి తల్లి గురించి ఒక అందమైన రెండిషన్ అందజేశారు. ఈ పాట వెంటనే శ్రోతల హృదయాల్లోకి వెళ్లి తల్లి గురించిన జ్ఞాపకాలను నెమరువేస్తోంది. తెలుగులో అమ్మ గురించి కొన్ని క్లాసిక్ సాంగ్స్ వున్నాయి. ఈ పాట కూడా ఆ వరుసలో చేరుతుంది. ఇది సినిమా గురించి మంచి వైబ్ ఇవ్వడమే కాకుండా చరిత్రలో నిలిచిపోతుంది.
ఈ పాటతో వారసుడు వంశీ పైడిపల్లి స్టైల్‌లో పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని మేకర్స్ తెలియజేశారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు సంక్రాంతికి అద్భుతంగా ఆడటం ఆనవాయితీగా వస్తోంది. ఈ సాంగ్ రిలీజ్ తర్వాత సినిమాకు మరో పాజిటివ్ వైబ్ తోడైయింది.
ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, షామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం. అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు.
ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్ సాల్మన్ కథ అందించారు. కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడిగా, కెఎల్ ప్రవీణ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత ఈ చిత్రానికి సహ నిర్మాతలు. సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్లుగా పని చేస్తున్నారు.
తారాగణం:
విజయ్, రష్మికా మందన్న, శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జయసుధ, శామ్, యోగిబాబు,
సంగీత, సంయుక్త తదితరులు
సాంకేతిక విభాగం:
దర్శకత్వం: వంశీ పైడిపల్లి
కథ, స్క్రీన్ ప్లే: వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సాల్మన్
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి
బ్యానర్: శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా
సహ నిర్మాతలు: శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత
సంగీతం: ఎస్ థమన్
డీవోపీ: కార్తీక్ పళని
ఎడిటింగ్: కెఎల్ ప్రవీణ్