Reading Time: < 1 min

విరాజి మూవీ టైటిల్ వీడియో విడుదల

ఈరోజు ప్రసాద్ ల్యాబ్స్ లో మహర్షి కొండ్ల సమర్పణలో వరుణ్ సందేశ్ హీరోగా M3 మీడియా ప్రొడక్షన్ మరియు మహా మూవీస్ సహా సమర్పణ లో, మహేంద్ర నాథ్ కొండ్ల నిర్మాతగా విరాజి సినిమా టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోను చేశారు.

ఈ కార్యక్రమంలో హీరో వరుణ్ సందేశ్, హాస్య నటుడు రఘు కారుమంచి, నటి ప్రమోదిని మరియు ఇతర నటులతో పాటు డైరెక్టర్ ఆధ్యంత్ హర్ష, సంగీత దర్శకుడు Ebenezer paul ( Ebby) పాల్గొన్నారు.

వరుణ్ సందేశ్ మాట్లాడుతూ నేను ఇప్పటివరకూ చేసిన క్యారెక్టర్స్ కి భిన్నంగా, కొత్త లుక్ లో మీకు కనిపించబోతున్నాను. ప్రతిరోజు షూట్ లో మేకప్, మరియు కాస్ట్యూమ్స్ కే గంట పైగా సమయం పట్టేది. నాకీ సినిమా నెవర్ బిఫోర్ ఎక్సపీరియెన్స్ ని ఇచ్చింది. కొత్త కాన్సెప్ట్ తో, కొత్త లుక్ లో, కొత్త దర్శకులతో చేసిన ఈ సినిమా మీకు బాగా నచ్చుతుంది అని నమ్ముతున్నాను . అని చెప్పారు.

డైరెక్టర్ మాట్లాడుతూ ఈ సినిమా కి విరాజి అనే టైటిల్ ఎందుకు పెట్టామో సినిమా చూశాక మీకు అర్థమౌతుంది. ఇప్పటికే ఈ టైటిల్ అర్థమేంటి అని అందరూ అడుగుతున్నారు, ఈ కథ సినిమా గా ఈరోజు నేను తీయగలిగాను అంటే మా ప్రొడక్షన్ హెడ్ ( ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్) సుకుమార్ కిన్నెర గారు కారణం, ఆయన ఈ కథని అంతగా నమ్మి ప్రొడ్యూసర్ కి కన్విన్స్ చేసి, తరువాత హీరో వరుణ్ సందేశ్ గారు కూడా కథను మెచ్చి సినిమా చేసేందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. విరాజి గురించి తర్వాత చేయబోయే ప్రమోషనల్ ఈవెంట్స్ లో మాట్లాడతా.. అని చెప్పారు.

రఘు కారుమంచి మాట్లాడుతూ ఈ సినిమా కోసం మా డైరెక్టర్ నాకు చాలా హింస పెట్టాడు. అందుకేనేమో నా క్యారెక్టర్ అంతలా పండింది. ఈ సినిమాతో యంగ్ డైరెక్టర్ హర్ష నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా మీకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది అని నమ్ముతున్నాను. అని చెప్పాడు