Reading Time: < 1 min
వీరశాస్త అయ్యప్ప కటాక్షం ఆడియో విడుదల
 
 
 ‘100 క్రోర్స్ అకాడమీ-వరాంగి మూవీస్’ సంయుక్తంగా రుద్రాభట్ల వేణుగోపాల్ దర్సకత్వంలో తెరకెక్కిస్తున్నభక్తి రస ప్రధాన చిత్రం ‘వీరశాస్త అయ్యప్ప కటాక్షం’. 
 
ప్రముఖ రచయిత, ఆధ్యాత్మికవేత్త వి.ఎస్.పి.తెన్నేటి ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు సమకూర్చడంతో పాటు టి.ఎస్.బద్రీష్ రామ్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఏ.జ్యోతి, రమాప్రభ, ఆకెళ్ళ, చలపతి, మాస్టర్ హరీంద్ర, అశోక్ కుమార్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం పాటలు ప్రసాద్ లాబ్స్ లో  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విడుదలయ్యాయి.
 
ప్రముఖ ఆడియో కంపెనీ లహరి మ్యూజిక్ ద్వారా ఈ చిత్రం పాటలు మార్కెట్ లోనూ, యు ట్యూబ్ లోనూ  లభ్యం కానున్నాయి. ప్రముఖ సంగీత దర్శకులు వి.ఎస్.ఎల్. జయకుమార్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఇది ఆయనకు తమిళ, తెలుగు భాషల్లో కలిపి 45వ చిత్రం. శంకర్ మహదేవన్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మనో వంటి సుప్రసిద్ధులు ఈ చిత్రంలోని పాటలకు గాత్రమందించారు.  ప్రముఖ నిర్మాతలు సి.కళ్యాణ్, లగడపాటి శ్రీధర్, రాజ్ కందుకూరి అతిధులుగా విచ్చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.  సుమన్ తెలుగులో హీరోగా నటించిన నూరవ చిత్రం ‘అయ్యప్ప కటాక్షం’ అసాధారణ విజయం అందుకోవాలని అభిలషించారు. అయ్యప్ప కరుణాకటాక్షాలతోనే ఈ చిత్రాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగామని, శంకర్ మహదేవన్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మనో వంటి దిగ్గజాలతో వి.ఎస్.ఎల్.జయకుమార్ అందించిన ఆడియో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, అయ్యప్ప ఆశీస్సులతో సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని దర్సకనిర్మాతలు వి.ఎస్.పి.తెన్నేటి-టి.ఎస్.బద్రీష్ రామ్, రుద్రాభట్ల వేణుగోపాల్ అన్నారు. భక్తితోపాటు మానసిక శక్తిని సవ్య దిశలో పెంచే సానుకూల దృక్పధాన్ని పెంచే విధంగా ‘అయ్యప్ప కటాక్షం’ చిత్రం రూపొందిందని తెలిపారు. ఈ చిత్రానికి ఎడిటర్: క్రాంతి, కెమెరా: వేణు మురళీధర్ వడ్నాల, సంగీతం: వి.ఎస్.ఎల్.జయకుమార్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-పాటలు: వి.ఎస్.పి.తెన్నేటి, నిర్మాతలు: వి.ఎస్.పి.తెన్నేటి- టి.ఎస్.బద్రీష్ రామ్, దర్శకత్వం: రుద్రాభట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి)!!