Reading Time: < 1 min

వెల్‌కం జింద‌గీ చిత్రం టీజర్ విడుద‌ల‌
 

పిల్ల‌ర్ 9 ప్రొడ‌క్ష‌న్స్` బ్యానర్ పై    శ్రీ‌నివాస క‌ళ్యాణ్ – ఖుష్బూ పోద్దార్ ల‌ను హీరో-హీరోయిన్‌లుగా ప‌రిచ‌యం చేస్తూ శాలు – ల‌క్ష్మ‌ణ్ ద‌ర్శ‌క‌త్వ లో రూపొందుతున్న  చిత్రం  `వెల్‌కం జిందగీ`.  చుట్టూ ఉన్న‌ ప‌దిమందికి సాయ‌ప‌డితే ఆ సాయం వారి జీవితాల్లో వెలుగులు నింపితే ఆ ఆనంద‌మే వేరు! అనేది కాన్సెప్ట్‌. సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర ప‌నులు సాగుతున్నాయి.

తాజాగా ఈ సినిమా టిజర్  ని ప్రముఖ  దర్శకులు వి. వి వినాయక్ ప్రేమికుల దినొత్సవం సందర్బంగా విడుదల  చేశారు. 

అనంతరం వి.వి.వినాయక్ మాట్లాడుతూ ” టీజర్ బాగుంది. టీజర్ చూశాక సినిమాలో మంచి కంటెంట్ ఉందనిపిస్తుంది. టీమ్ కి నా శుభాకాంక్షలు. ఈ సినిమా బాగా ఆడాలని ఆశిస్తున్నా ” అన్నారు.

ద‌ర్శ‌కులు శాలు- ల‌క్ష్మ‌ణ్‌ మాట్లాడుతూ -“ముందుగా మా టీజర్ ని విడుదల చేసి మమ్మల్ని ప్రోత్సహించిన సెన్సేషనల్ డైరెక్టర్ వినాయక్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.  మ‌నం చేసే చిన్న సాయం ఇత‌రుల జీవితాల్లో ఎలాంటి ఆనందాన్ని, వెలుగును నింపుతుందో చెబుతూ సాయం ప్రాముఖ్య‌త‌ను వివ‌రించే చిత్ర‌మే ఇది. ఫ్యామిలీ డ్రామాతో పాటు ప్రేమ‌క‌థ ఆక‌ట్టుకుంటుంది. ఇదో ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌. కొత్త‌వారే అయినా నాయ‌కానాయిక‌లు చ‌క్క‌గా న‌టించారు. మ‌ధుమ‌ణి, క‌మ‌ల్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లు పోషించారు. వారి న‌ట‌న సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. జ‌బ‌ర్ధ‌స్త్ ఫేం కొమురం హీరో స్నేహితుడుగా న‌టించాడు. త‌న కామెడీ ప్రేక్ష‌కుల్ని క‌డుపుబ్బా న‌వ్విస్తుంది. సినిమాటోగ్రాఫ‌ర్ శ్రీ‌సాయి ప్ర‌తి ఫ్రేమ్‌ను అందంగా తెర‌కెక్కించారు. 5 విభిన్న‌మైన‌ పాట‌లున్నాయి. గౌత‌మ్ ర‌విరామ్ సంగీతం అద్భుతంగా కుదిరింది. ప్ర‌స్తుతంనిర్మాణానంత‌ర ప‌నులు చివ‌రి ద‌శ‌లో ఉన్నాయి. ” అని తెలిపారు.

ఈ చిత్రానికి క‌థ‌-క‌థ‌నం -ద‌ర్శ‌కత్వం :  శాలు- ల‌క్ష్మ‌ణ్