Reading Time: 2 mins

వైదేహి చిత్రం ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

ఎన్‌.శంక‌ర్ చేతుల‌మీదుగా.. ఏవీఎస్ వార‌సుడి `వైదేహి` ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

యాక్టివ్  స్టూడియోస్ బ్యాన‌ర్ పై ఎ.జి.ఆర్‌.కౌశిక్ స‌మ‌ర్పిస్తున్న చిత్రం వైదేహి. ఎ.జ‌న‌ని ప్ర‌దీప్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎ.రాఘ‌వేంద్ర‌ప్ర‌దీప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సీనియ‌ర్ న‌టుడు క‌మెడియ‌న్, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ కీ.శే.ఎవిఎస్‌  కుమారుడు ఎ.రాఘ‌వేంద్ర‌ప్ర‌దీప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం వైదేహి. ఈ చిత్ర ట్రైల‌ర్ లాంచ్ జ‌న‌వ‌రి 2న ఆయ‌న‌ పుట్టిన రోజు సంద‌ర్భంగా రామానాయుడు స్టూడియోలో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఎన్‌.శంక‌ర్ గారి చేతుల మీద‌గా ట్రైల‌ర్ లాంచ్ మ‌రియు సీనియ‌ర్ పాత్రికేయులు రామారావుగారితో కేక్‌ను క‌ట్ చేయించారు.

విలేక‌రుల స‌మావేశంలో రామారావుగారు  మాట్లాడుతూ … ఆయ‌న‌తో నాకు చాలా అనుబంధం ఉంది. జ‌ర్న‌లిస్ట్ గా ప్ర‌యాణం మొద‌లుపెట్టిన ఆయ‌న బాపుర‌మ‌ణ‌లంటే చాలా ఇష్టం. హైద‌రాబాద్‌లో ఒక ఇల్లుని నిర్మించి ఆ ఇంటికి బాపుర‌మ‌ణ‌ల పేరును పెట్టారు. ఆయ‌న కుమారుడు ద‌ర్శ‌కుడుగా రావ‌డం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయ‌నకి మంచి పేరు రావాల‌ని ఇంకా ఎంతో అభివృద్ధి చెందాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.ఎన్‌.శంక‌ర్ మాట్లాడుతూ… ఎవిఎస్‌గారు నాకు మంచి మిత్రులు చాలా మందితో మంచి అనుబంధం ఉన్నా నాతో ఒక ప్ర‌త్యేక‌మైన అనుబంధం ఉంది. అంద‌రితో చ‌క్క‌గా క‌లిసిపోతారు. ఆయ‌న‌కు ఉన్న సినిమా, సాహిత్యం అన్నీ ఓ ప‌ట్టుప‌ట్టారు. తెలుగు ఇండ‌స్ట్రీలో ఎవిఎస్‌గారు లేని లోటు తెలుస్తుంది. ఆయ‌న మంచిత‌నం, ఆయ‌న స్నేహం మ‌ర‌పురానికి ఎప్పుడూ గుర్తుకువ‌స్తూనే ఉంటాయి. 90శాతం ఇలాంటి హార‌ర్ చిత్రాలు స‌క్సెస్ కాకుండా లేవు. ప్ర‌దీప్ తొలి అడుగే ఇలాంటి జోన‌ర్‌తో వ‌స్తున్నాడంటే క‌చ్చితంగా స‌క్సెస్ సాధిస్తారు. ట్రైల‌ర్ చూశా చాలా బావుంది. అందులోని క్యూరియాసిటీగాని యాక్ట‌ర్స్ పెర్ఫార్మెన్స్‌గాని చాలా బాగా వ‌చ్చాయి. ఈ చిత్రంలో న‌టించిన టీమ్ అంద‌రికీ ఆల్ ద బెస్ట్ అని అన్నారు.

హీరో మ‌హేష్ మాట్లాడుతూ…స్క్రీన్‌మీద న‌న్ను నేను చూసుకోవ‌డం మొద‌టిసారి. చాలా ఆనందంగా ఉంది. ప్ర‌దీప్ అన్న నాకు ఈ అవ‌కాశం ఇచ్చినందుకు చాలా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు. ప్ర‌ణ‌తి మాట్లాడుతూ… వైదేహి నాకు చాలా స్పెష‌ల్ చిత్రం నాకు పింకీ ఈ చిత్రంలో చాలా స్పెష‌ల్. వైదేహి అంద‌రూ త‌ప్ప‌క చూడండి చాలా హార‌ర్ చిత్రం. నాకు హార‌ర్ చిత్రాలంటే చాలా ఇష్టం. నేనెప్పుడూ అనుకోలేదు. నాకు మొద‌టి సినిమానే హార‌ర్ చిత్రం వ‌స్తుంద‌ని అని అన్నారు.అఖిల మాట్లాడుతూ…  నాకు ఈ అవ‌కాశం క‌ల్పించిన ప్ర‌దీప్ గారికి నా కృత‌జ్ఞ‌త‌లు. ఈ చిత్రంలో ప‌ని చేసిన టీమ్ అంద‌రికీ ఆల్ ద బెస్ట్ అని అన్నారు.

ద‌ర్శ‌కుడు ప్ర‌దీప్ మాట్లాడుతూ… నాన్న‌గారి పుట్టిన‌రోజు థియేట్రిక‌ల్  ట్రైల‌ర్ లాంచ్ అవుతుంద‌ని ముందుగా నేను అనుకోలేదు. స‌డెన్ అలా కుదిరింది.  నేను స్టోరీ సెలెక్ట్ చేసుకుని స‌ఫ‌ర్ అవుతున్న టైంలో. నా వెంటే వుండి న‌న్ను వెను త‌ట్టి న‌డిపింది నా స్నేహితుడు ముందుగా ఆయ‌న‌కు నా కృత‌జ్ఞ‌త‌లు.  ఇందులో న‌టించిన న‌టీన‌టులంద‌రినీ నేను చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టాను. కాని ఎవ్వ‌రూ కూడా విసుగులేకుండా ఒక ఫ్యామిలీ మెంబ‌ర్స్‌లాగా బాగా క‌లిసిపోయి అంద‌రూ ప‌ని చేశారు. ముఖ్యంగా డిఒపి  చాలా బాగా కుదిరింది. మీ అంద‌రి న‌వ్వే నా ఎన‌ర్జీ. ఎన్‌. శంక‌ర్‌గారు నాన్న‌గారికి చాలా ద‌గ్గ‌ర ఎంత ద‌గ్గ‌రంటే ఏదైనా క‌ష్టం వ‌చ్చిందంటే మా ఫ్యామిలీ క‌న్నా ముందే ఆయ‌న‌తో షేర్ చేసుకునేవారు నాన్న‌గారు. నాకు తండ్రి త‌ర్వా త తండ్రి లాంటి వారు. అంద‌రికీ నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.

ఇంకా ఈ చిత్రంలో న‌టించిన న‌టీన‌టులు మ‌హేష్‌, ప్ర‌ణతి, సందీప్‌, అఖిల‌, లావ‌ణ్య‌, ప్ర‌వీణ్‌, వెంక‌టేష్‌, ఎ.వి.హాసిని, ఎ. రాఘ‌వేంద్ర‌ప్ర‌దీప్‌, శ్రీ‌హ‌ర్ష‌, క్రిష్ణ‌, తేజ‌, ర‌మేష్‌, చంద్ర‌కాంత్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రంలో డిఓపి.దేవేంద్ర‌సూరి, మ్యూజిక్‌షారూక్‌, ఎడిటింగ్ఃఫ్లిక్కో ఆర్ట్స్‌, కోడైరెక్ట‌ర్ః ప‌ర‌వాస్తు దేవేంద్ర‌సూరి, ప్ర‌డ్యూస‌ర్ ఎ.జ‌న‌ని ప్ర‌దీప్‌, పిఆర్ ఓః ప‌వ‌న్ స్టోరీ, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం, డైలాగ్స్  ఎ.రాఘవేంద్ర‌ప్ర‌దీప్‌.