Reading Time: 2 mins

శర్వా36 సినిమా ప్రారంభం

శర్వానంద్, యూవీ క్రియేషన్స్ ఫోర్త్ కొలాబరేషన్ అభిలాష్ కంకర దర్శకత్వంలో శర్వా36 అనౌన్స్ మెంట్ సినిమా గ్రాండ్ గా ప్రారంభం

ప్రస్తుతం తన 35వ చిత్రం మనమే చేస్తున్న హీరో శర్వానంద్, నెక్స్ట్ యువి క్రియేషన్స్ నిర్మించబోతున్న ఎక్సయిటింగ్ ఫిల్మ్ కోసం సూపర్ హిట్ వెబ్ సిరీస్ లూజర్ ఫేమ్ దర్శకుడు అభిలాష్ కంకరతో జతకట్టనున్నారు. అభిలాష్ కంకర మా నాన్న సూపర్‌హీరో తో డెబ్యు చేస్తున్నారు. శర్వా36 అతని సెకండ్ డైరెక్షన్ వెంచర్. విక్రమ్ సమర్పణలో వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా, మహానుభావుడు..మూడు పెద్ద బ్లాక్‌బస్టర్‌లను అందించిన శర్వానంద్‌కి యూవీ క్రియేషన్స్ లక్కీస్ట్ ప్రొడక్షన్ హౌస్.

శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా, ఆసక్తికరమైన పోస్టర్ ద్వారా ఈ కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. పోస్టర్ డస్టీ రోడ్ పై రేసులో బైక్ రైడర్‌లను చూపిస్తోంది. రేసులో తన ప్రత్యర్థులను అధిగమించేందుకు ఎత్తుగా ఎగురుతున్న రైడర్ జాకెట్‌పై S 36ని మనం చూడవచ్చు. పోస్టర్ సూచించినట్లుగా, ఇది స్పోర్ట్స్ బేస్డ్ మూవీగా ఉండబోతోంది, ఇందులో హీరో బైక్ రైడర్‌గా కనిపిస్తారు.

సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైయింది. ముహూర్తపు సన్నివేశానికి చిత్ర సమర్పకులు విక్రమ్, హీరో హీరోయిన్స్ పై క్లాప్ కొట్టారు. హీరో శర్వానంద్, దర్శకుడికి స్క్రిప్ట్ అందించారు.

Sharwa36 మూడు తరాల కుటుంబానికి సంబంధించిన అద్భుతమైన కథ, 90,20వ దశకం ప్రారంభంలో మోటోక్రాస్ రేసింగ్ నేపధ్యంతో పాటు లవ్, డ్రీమ్స్ ప్రధానాంశాలుగా వుంటుంది.

మొదటిసారిగా, శర్వానంద్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో చిత్రాన్ని చేస్తున్నారు. అతని క్యారెక్టరైజేషన్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ సినిమాలో శర్వానంద్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన సాంకేతిక నిపుణులను కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. ట్రెండీ ట్యూన్‌లకు పేరుపొందిన జిబ్రాన్ సంగీతం అందించగా, జె యువరాజ్ డీవోపీగా పని చేస్తున్నారు. రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, అనిల్ కుమార్ పి ఎడిటర్. ఎ పన్నర్ సెల్వం ఆర్ట్ డైరెక్టర్ కాగా, ఎన్ సందీప్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.

ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

తారాగణం :

శర్వానంద్, మాళవిక నాయర్

సాంకేతిక విభాగం :

రచన, దర్శకత్వం: అభిలాష్ కంకర
నిర్మాతలు: వంశీ, ప్రమోద్
బ్యానర్: యువి క్రియేషన్స్
సంగీతం: జిబ్రాన్
డీవోపీ: జె యువరాజ్
ఎడిటర్: అనిల్ కుమార్ పి