Reading Time: 5 mins

శ్రీదేవి సోడా సెంటర్ చిత్రం ప్రి రిలీజ్ ఈవెంట్

70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై సుధీర్ బాబు, ఆనంది జంటగా పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి లు  సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న చిత్రం “శ్రీదేవి సోడా సెంటర్”. 

ఈ మధ్యనే  సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా సినిమా ట్రైలర్ విడుదలైంది. యాక్షన్, ఎమోషన్, సెంటిమెంట్, రొమాన్స్.. ఇలా అన్నీ సమపాళ్లలో శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్ లో కనిపిస్తున్నాయి. సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, బ్రిడ్జ్ ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత లక్ష్మణ్ “శ్రీదేవి సోడా సెంటర్” హక్కులను ఫాన్సీ ప్రైస్ కు సొంతం చేసుకొన్నారు.

 

ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 27న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల చేస్తున్న సందర్భంగా ఈ చిత్రం ప్రి రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం హైదరాబాద్ లోని “N” కన్వెన్షన్ లో సినీ అతిరథుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ, ఇంద్రగంటి మోహన్ కృష్ణ, అనిల్ రావిపూడి, అజయ్ భూపతి, బుచ్చిబాబు, శ్రీరామ్ ఆదిత్య, హర్షవర్ధన్, సుధీర్,రమణ తేజ, నిర్మాతలు అదిశేషగిరి రావు, రాజ్ కందుకూరి, విష్ణు, హీరో కార్తికేయ తదితరులు పాల్గొని చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలియ జేశారు. శ్రీదేవి సోడా సెంటర్”  మొదటి బిగ్ టికెట్ ను హీరో సుధీర్ బాబు తల్లిదండ్రులు విడుదల చేయగా అనిల్ రావిపూడి, కార్తికేయలు ఫస్ట్ టికెట్స్ ను కొనుగోలు చేశారు.

అనంతరం

దర్శక,నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ… వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో కథలతో ముందుకెళ్లే హీరో సుధీర్ బాబు, కొత్త కథలకు ప్రాధాన్యత నిచ్చే 70mm ప్రొడక్షన్ నిర్మాతలు . పలాస 1978 లాంటి డిఫరెంట్ ఆలోచనలతో కథలు రాసుకొని సినిమా చేసే దర్శకుడు కరుణ.తెలుగు సంగీతానికే నిర్వచనం చెప్పిన సంగీత దర్శకుడు మణిశర్మ గారి మ్యూజిక్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ ఇలా వీరందరూ కలసి చేస్తున్న ఈ సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని అన్నారు.

 నిర్మాత అది శేషగిరిరావు మాట్లాడుతూ… సుధీర్, కరుణ కుమార్,70 mm నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి, లు ఎంతో ప్రిస్టేజిస్ గా తీసుకొని చేస్తున్న ఈ సినిమాకు స్వర బ్రహ్మ మణిశర్మ గారి సంగీతం అందించడం  మరో విశేషం. ప్రస్తుతం పెద్ద పెద్ద నిర్మాతలు భయపడి వారి సినిమాలను ఓటిటి లలో విడుదల చేస్తుంటే ఈ చిత్ర నిర్మాతలు ఎంతో ధైర్యం చేసి ఈ సినిమాను మేము థియేటర్స్ లొనే విడుదల చేస్తామని చెప్పడం ఒక మంచి శుభ సూచికం వారికి నా  అభినందన లు.థియేటర్స్ లో విడుదల చేయడానికి లక్ష్మణ్ కూడా ఎంతో కష్టపడ్డాడు. ఈ నెల 27 న వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.

 దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ మాట్లాడుతూ.. రిస్కు తీసుకోవడానికి అస్సలు భయపడని వ్యక్తులు అంటే నాకు చాలా ఇష్టం. చాలా విభిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తాడు సుధీర్ అందుకే తనంటే నాకు చాలా ఇష్టం. తనతో నేను రెండు సినిమాలు చేశాను.ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేస్తాడు.తను భవిష్యత్తులో మరిన్ని విభిన్నమైన సినిమాలు తీయాలి. అలాగే చరిత్రలో మనకు తెలియని విషయాలను “పలాస 1978” చిత్రం ద్వారా తెలిపాడు దర్శకుడు కరుణ కుమార్.వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న “శ్రీదేవి సోడా సెంటర్”ను విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి లు ఎంతో ప్యాసినెట్ గా నిర్మించారు.ఈ నెల 27 న వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న నని అన్నారు.


 దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. 70 mm లో  భలే మంచి రోజు, యాత్ర, ఆనందో బ్రహ్మ, ఇప్పుడు శ్రీదేవి సోడా సెంటర్ ఇలా వచ్చే ప్రతి ఫిలిం డీఫ్రెంట్ గా మంచి అప్రోచ్ తో వస్తున్న నిర్మాతలకు నా అభినందనలు. ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే  సినిమా ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. దర్శకుడు కరుణ కుమార్ తీసిన పలాస 1978 చూశాను చాలా బాగుంది.ఈ సినిమాను ట్రైలర్ కూడా  కూడా చాలా రస్టిక్ గా,ఇంటెన్స్ గా చాలా బాగుంది. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు ఈ సినిమాకు సంగీత అందించడం చాలా గొప్ప విశేషం. సుధీర్ బాబు గారు ఆల్ రౌండర్ అని చెప్తాను. తను బ్యాడ్మింటన్, క్రికెటర్, ఫైటర్, డాన్సర్ ఇలాప్రతిదాంట్లో హార్డ్ వర్క్ తో తనను తాను ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. తనకు సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బ్యాగ్రౌండ్ ఉండి కూడా తన ఇండివిడ్యువల్ గా తనేంటో ప్రూవ్ చేసుకోవడానికి ప్రతి సినిమాను మొదటి సినిమాగా భావిస్తూ ఎంతో కష్టపడుతూ డిఫ్రెంట్ కథలతో తానేంటో ప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.సుధీర్ గారికి ఈ సినిమా ఒక పెద్ద సక్సెస్ ఫుల్ సినిమా అవ్వాలని కోరుతున్నాను. ఈ సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ అందరికీ నా అభినందనలు. ఈ పాండమిక్ సిచ్చువేషన్ తర్వాత వస్తున్న సినిమాలతో థియేటర్లు కలకలలాడుతూ కలెక్షన్స్ తో దద్దరిల్లి పోవాలి అని మనస్పూర్తిగా కోరుతున్నాను అన్నారు.


 చిత్ర దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ.. సుధీర్ గారు మెగాస్టార్ చిరంజీవి గారిని ఒక మాట అడగ్గానే మమ్మల్ని పిలిచి ఎంతో ఆప్యాయంగా మాట్లాడి మందులోడా ఓరి మాయలోడా సాంగ్ ను రిలీజ్ చేశారు.వారికి మా చిత్ర యూనిట్ తరుపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసు కుంటున్నాము.ఈరోజు నేను ఈ వేదిక మీద నిలబడ్డానికి పలాస సినిమానే కారణం ఆ సినిమా అవకాశం ఇచ్చిన అట్లూరి వరప్రసాద్ గారికి నా ధన్యవాదాలు. ఆ ప్రాజెక్టుని బ్యాక్ ఉండి నడిపించిన అప్పారావు, తమ్మారెడ్డి గార్లకు నా కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాను.ప్యాండమిక్ టైం లో నేను తీసిన సినిమా చూసి నన్ను పిలిచి మాట్లాడి అభినందించారు. సుధీర్ బాబు.12 సినిమాలు చేసిన హీరో అయ్యి ఉండి కూడా నేను చెప్పిన కథ నచ్చి  నాకు ఈ అవకాశం ఇచ్చారు. వారికి నా కృతజ్ఞతలు. సుధీర్ బాబు ద్వారా 70 mm నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి లు నా కథని విని ఈ సినిమాను ప్రిస్టేజిస్ గా తీసుకొని చేయడానికి ముందుకు రావడమే గాక  వరల్డ్ క్లాస్ కెమెరామెన్ శ్యాం ప్రసాద్, పుష్ప, రంగస్థలం సినిమాలకు చేసిన ఆర్ట్ డైరెక్టర్స్ రామకృష్ణ -మౌనిక , నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, చిన్నప్పటి నుండి సంగీత దర్శకుడు మణిశర్మ గారి పాటలు వింటూ పెరిగిన నాకు ఆయన ఈ సినిమాకు సంగీతం అందించడం చాలా సంతోషంగా ఉంది. మొదటగా ఆయన దగ్గరకు వెళ్ళాలంటే భయమేసింది. అటువంటిది ఆయన నన్ను తమ్ముడిలా ఆదరించి నాలో ఉన్న భయాన్ని పోగొట్టి ఈ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. మంచి డైరెక్షన్ టీంను ఇలా పెద్ద టాప్ క్లాస్ టెక్నీషియన్ని మాకు అందించారు నిర్మాతలు. ప్రతి సీన్ కూడా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా తీశాము. నిర్మాతలు 24 గంటలు మా వెంట ఉంటూ మాకెంతో సపోర్ట్ చేస్తూ ఇప్పటివరకు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అద్భుతంగా నిర్మించారు. అలాగే నిమ్మకాయల ప్రసాద్ గారు నాకెంతో సపోర్టు ఇచ్చారు. నా స్నేహితుడు నాగేంద్ర కాశి ఇంత మంచి కథను నాకు అందించాడు.అందరి సపోర్ట్ తో అనుకున్న టైంకి సినిమాను పూర్తి చేశాము. ఆగస్టు 27వ తేదీన వస్తున్న మా సినిమా ఓటిటి లో చూసే సినిమా కాదు అందరూ ఫ్యామిలీ తో వచ్చి థియేటర్స్ లో మాత్రమే చూడవలసిన సినిమా ఇది అందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.

 చిత్ర నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి లు మాట్లాడుతూ.. ముందుగా మెగాస్టార్ చిరంజీవి కి మా చిత్ర యూనిట్ తరుపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసు కుంటున్నాము.మా సినిమాకు ఎంకరేజ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించి మాకు సపోర్ట్ గా నిలిచిన చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ గార్లకు కృతజ్ఞతలు.మేము మొదటి సారి పలాస 1978 సినిమా చూశాము ఆ సినిమా మాకెంతో కిక్ నిచ్చింది ఈ డైరెక్టర్ తో సినిమా చేయాలని అప్పుడే నిర్ణయించు కున్నాను అనుకున్నట్టుగానే సుధీర్ గారి ద్వారా ఈ కథ మా దగ్గరకు వచ్చింది దాంతో మేము ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాము.  మేము సినిమా మొదలు పెట్టిన దగ్గర నుండి మాకు చాలా అడ్డంకులు ఎదుర్కొన్నాము. అందరూ కూడా మీరు రాంగ్ టైంలో షూటింగ్ స్టార్ట్ చేశారు ఎదో అపశకునం జరుగుతుంది ఆలోచించుకొని షూట్ చెయ్యమని చెప్పారు అయినా మేము వెనుకడుగు వేయకుండా షూటింగ్ ప్రారంభించాము.అపశకునం అనుకున్న మాకు మొదటిసారి మేము ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేయగానే బిజినెస్ స్టార్ట్ అయ్యింది.ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయగానే తెలుగు తమిళ్, మలయాళం కన్నడ, హిందీలో కూడా బిజినెస్ అయిపోయింది దీనికంతా కారణం మా దగ్గర ఉన్న బెస్ట్ టెక్నీషియన్స్ ఉండడం వలనే ఇది సాధ్యమైంది. ఈ సినిమా తర్వాత దర్శకుడికి చాల ప్రాజెక్ట్స్ వస్తాయి. సినిమా చాలా బాగా వచ్చింది అమెరికా లో 120 థియేటర్స్ లో, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్ ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 27 న వస్తున్న “శ్రీదేవి సోడా సెంటర్” అందరినీ తప్పక ఎంటర్టైన్మెంట్ చేస్తుంది.ప్రేక్షకులందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ థియేటర్స్ వచ్చి మా సినిమాను ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.


 హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. మా సినిమాను ఆశీర్వదించాలని కి వచ్చిన పెద్దలకు ,ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. మొదటగా చిరంజీవి గారికి థాంక్స్ చెప్పాలి. అడిగిన వెంటనే మందులోడా సాంగును రిలీజ్ చేశారు. మా సమ్మోహనం మూవీ కూడా ఆయాన సపోర్టుతోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేశాము.ఆ సినిమా మంచి విజయం సాధించింది.ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ కూడా గురువు గారు మెగాస్టార్ తో స్టార్ట్ చేశాము. ఆయన నాకు గ్రేట్ సపోర్టరే కాక నాకు ఆయనది లక్కీ హ్యాండ్ కూడా..అలాగే ప్రభాస్ గారు మా సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఇంటికి పిలిచి ఎంతో ఆప్యాయంగా నన్ను అక్కున చేర్చుకున్నారు. మంచితనానికి మరో పేరే ప్రభాస్. మహేష్ బాబు గారిని నేను ఎంతో అభిమానిస్తాను. నేను ఆయనకు థాంక్స్ చెప్పి దూరం చేసుకోలేను. మహేష్ ఒక ఫంక్షన్ లో మాట్లాడుతూ సుధీర్ కు కరెక్ట్ సినిమా పడితే ఒక నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాడు అన్నాడు. ఆయన అన్న సినిమా ఇదే అవుతుంది అనుకుంటున్నాను నేను. దర్శకుడు పలాస చిత్రాన్ని చాలా బాగా తెరకెక్కించాడు. పలాస కంటే  శ్రీదేవి సోడా సెంటర్ ఇంకా చాలా బాగుంటుంది. ఇందులోసూరిబాబు రోల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు కి సూరిబాబు, శ్రీదేవి జ్ఞాపకాలు మాత్రం అలాగే ఉంటాయి.వాళ్ల కోసం మళ్ళీ ఈ సినిమా చూడ్డానికి థియేటర్ కు వస్తారు ఈ సినిమా అంత బాగా ఉంటుంది. నిర్మాతల విషయానికి వస్తే కృష్ణ గారు మహేష్ బాబు గార్లు నా పక్కన ఉంటే నాకు ఎంత ధైర్యం ఉంటుందో ఈ చిత్ర నిర్మాతలు నా పక్కనుంటే నాకు అంత ధైర్యం ఉంటుంది.ఈ నిర్మాతలు ఇంకా చాలా పెద్ద సినిమాలు చేస్తారనే నమ్మకం ఉంది..గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న కథ ఇది. గోదావరి భాషలో చెప్పాలంటే ఇది మంచి పులస లాంటి సినిమా ఇప్పుడు సీజన్ కూడా పులస సీజనే..అదే సీజన్లో ఈ సినిమా వస్తోంది. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.నేను రొటీన్ సినిమాలు చెయ్యను డిఫరెంట్ గా ఉండే కథల్ని సెలెక్ట్ చేసుకుని చేస్తాను. ఎందుకు చెప్పానో ఈ నెల 27న రిలీజ్  అయిన తర్వాత మీకు తెలుస్తుంది. ఈ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.

 నటీనటులు :
సుధీర్ బాబు, ఆనంది , ప‌వెల్ న‌వ‌గీత‌మ్‌,న‌రేష్‌, ర‌ఘుబాబు, అజ‌య్‌, స‌త్యం రాజేష్, హ‌ర్హ వ‌ర్ద‌న్‌, స‌ప్త‌గిరి, క‌ళ్యణి రాజు, రొహిణి, స్నేహ గుప్త త‌దిత‌రులు

 టెక్నికల్ టీం:
ర‌చ‌న‌-దర్శకత్వం: కరుణ కుమార్
నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
బ్యానర్: 70mm ఎంటర్టైన్మెంట్స్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: శ్యామ్ దత్ సైనుద్దీన్
సంగీతం: మణిశర్మ
క‌థ‌.. నాగేంద్ర కాషా
కొరియొగ్రాఫ‌ర్స్‌.. ప్రేమ్ ర‌క్షిత్‌, విజ‌య్ బిన్ని, య‌శ్వంత్‌
యాక్ష‌న్‌.. డ్రాగ‌న్ ప్ర‌కాష్‌, కె ఎన్ ఆర్ (నిఖిల్‌) , రియ‌ల్ స‌తీష్
లిరిక్స్‌.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి, క‌ళ్యాణ చ‌క్ర‌వ‌ర్తి, కాస‌ర్ల శ్యామ్‌