శరణ్ కుమార్ హీరో లుక్ పోస్టర్ విడుదల
శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌లో శరణ్ కుమార్ కొత్త చిత్రం.. హీరో లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించిన సూపర్‌స్టార్ కృష్ణ
సూపర్‌స్టార్ కృష్ణ, విజయనిర్మల ఫ్యామిలీ నుంచి శరణ్ కుమార్ హీరోగా పరిచయం అవుతున్న సినిమాలో హీరో లుక్ పోస్టర్‌ను ఆదివారం సూపర్‌స్టార్ కృష్ణ విడుదల చేశారు. శివ కేశన కుర్తి దర్శకత్వంలో శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.3గా ఎం.సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మహేశ్ పుట్టినరోజు(ఆగస్ట్9) సందర్భంగా ఈ సినిమాలో హీరో లుక్‌ను సూపర్‌స్టార్ కృష్ణ రిలీజ్ చేశారు. హీరో తలకి చిన్నగాయమైనట్లు బ్యాండేజ్ వేసుకుని నిలడి ఉంటే పోస్టర్‌లో జనాలు, రెండు వాహనాలు వెళ్లడం ఇవన్నీ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి.
ఈ సందర్భంగా…
సూపర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ ‘‘శరణ్ హీరోగా చేస్తోన్న సినిమా హీరో లుక్ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇది తనకు హీరోగా పర్‌ఫెక్ట్ ల్యాండింగ్ అవుతుంది. శరణ్ యాక్టర్‌గా చాలా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
నిర్మాత ఎం.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘శరణ్‌కుమార్ హీరోగా చేస్తున్న ఈ సినిమా హీరో లుక్ పోస్టర్‌ను మహేశ్‌గారి పుట్టినరోజు సందర్భంగా సూపర్‌స్టార్ కృష్ణగారు విడుదల చేయడం ఆనందంగా ఉంది. సూపర్‌స్టార్ ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇస్తోన్న శరణ్‌కు ఈ సినిమా కచ్చితంగా మంచి బ్రేక్ ఇస్తుంది. అలాగే నరేశ్‌గారు, జయసుధగారు, సుధీర్‌బాబుగారు మా టీమ్‌ను ప్రత్యేకంగా అభినందించడం హ్యపీగా ఉంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలను తెలియజేస్తాం’’ అన్నారు.
నటీనటులు:
శరణ్ కుమార్
సాంకేతిక వర్గం:
బ్యానర్: శ్రీ వెన్నెల క్రియేషన్స్
సమర్పణ: బేబీ లలిత
నిర్మాత: ఎం.సుధాకర్ రెడ్డి
దర్శకత్వం: శివ కేశన కుర్తి
సినిమాటోగ్రఫీ: చైతన్య కందుల
మ్యూజిక్: భీమ్స్ సిసిరోలియో
ఆర్ట్: కె.వి.రమణ
ఎడిటర్: సెల్వ కుమార్