సాంబా రాసుకోరా గబ్బర్ సింగ్ ఘన చరిత్ర
కొన్ని సినిమాలు ఫ్యాన్సే కాదు హీరోలుకు కలకాలం చెప్పుకునేలా ఉంటాయి. అయితే అలాంటి సినిమా ఎంతో అద్బుతమై ఉంటుంది. కానీ ఓ రీమేక్ సినిమా మహాద్బుతమై, అందులో డైలాగులు జనాల్లోకి వెళ్లిపోయి ఫలానా సినిమా ముందు ఆ తర్వాత అనే స్దాయికి వెళ్లటం మాత్రం అరుదే. అయితే పవన్ కళ్యాణ్ కెరీర్ లో అలాంటివి అలవోకగా పలకరిస్తూనే ఉన్నాయి. అలాంటి సినిమానే గబ్బర్ సింగ్.పవన్ కళ్యాణ్ కెరీర్ లో 25 సంవత్సరపు మైలు రాయిని టచ్ చేస్తున్న ఈ సందర్బంగా ఈ సినిమాని ఓ సారి గుర్తు చేసుకుందాం.
పవన్ కెరీర్ లో ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచిన ఖుషి సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి అభిమానులు ఎక్సపెక్ట్ చేసిన సినిమా అయితే రాలేదు. ఒక్క హిట్ కోసం అటు పవన్ కళ్యాణ్ , ఇటు ఫాన్స్ పదేళ్లు ఎదురుచూసారు. పదేళ్ళ విరామం తర్వాత గబ్బర్ సింగ్ సినిమా రూపంలో ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేస్తూ చరిత్ర సృష్టించింది. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ డైలాగ్స్, భారీ యాక్షన్ సీన్స్, పవన్ మేనరిజం ప్రతీది పండగ చేసుకునేలా డిజైన్ చేసారు. దాంతో ఇది కదా పవన్ కళ్యాణ్ సినిమా అంటే అని ప్రేక్షకులు కాలర్ ఎగరేసారు. నాక్కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది. అరె ఓ సాంబ రాసుకోరా.. నేను చెప్పిన ఒకటే నా ఫ్యాన్స్ చెప్పిన ఒకటే, నేను ట్రెండ్ ఫాలో అవను ట్రెండ్ సెట్ చేస్తా, కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు ఇలా ప్రతి ఒక్క డైలాగ్ ఫ్యాన్స్ ను రిపీట్ గా మళ్లీ మళ్లీ థియేటర్ల వైపు రప్పించాయి.
కథగా పెద్దగా చెప్పుకోవటానికి ఏమీ ఉండదు. పెద్ద వాడిని కొట్టి పేదవాడికి పెట్టే పోలీస్ రాబిన్ హుడ్ క్యారక్టరైజేషన్. తల్లి తండ్రులు పెట్టిన పేరు వెంకటరత్నం. కానీ తనంతట తాను గబ్బరసింగ్ అని పెట్టుకుని,అదే చెప్పుకుని తిరుగుతూంటాడు.ఈ గబ్బర్ సింగ్ కు విలన్ సిద్దప్పతో గొడవ. టగ్ ఆఫ్ వార్. మరో ప్రక్క హీరోయిన్ తో వన్ సైడ్ లవ్. డిస్ జాయింట్ ఫ్యామిలీ..ఇవన్ని కలిస్తే చక్కటి యాక్షన్ ఫ్యామిలీ డ్రామా. హరీష్ శంకర్ డైలాగులు.
వాస్తవానికి దబాంగ్ చూసినవాళ్లు ఈ సినిమా చూస్తే ఆశ్చర్యపోతారు. సోల్ తప్ప మిగతాదంతా మార్చేసారు. కీలకమైన సీన్స్ తప్ప ఏవీ రిపీట్ కావు. ఒరిజనల్ లో ఉన్న సీన్స్ తీసుకున్నా కంటెక్ట్స్ మారిపోతుంది. హీరోని గుర్రం మీద ఇంట్రడ్యూస్ చేయటం ద్గగర నుంచి, హీరో కటౌట్ ని రిక్షా మీద తీసుకెళ్లటం దాకా సగటు అభిమానిని సంతృప్తిపరచటమే లక్ష్యంగా సాగుతుంది. మిగతావాళ్లు చేస్తే అతిగా అనిపించేదేమో. కానీ అలాంటి పాత్రను పవన్ ఓన్ చేయకోవటంతో టన్నుల కొద్ది ఎంటర్నైన్మెంట్ తెరపై ప్రవహించింది. సినిమా ఎక్కడా ఆగదు. బ్రేక్ ల్లేని బండి తెరపై పరుగెడుతున్నట్లే ఉంటుంది. అంత్యాక్షరి ఎపిసోడ్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. తెరపై అంతకు ముందు ఎవరూ చూడని కొత్త తరహా ఫన్. బ్రహ్మానందం కటౌట్ సీన్, సాంబా రాసుకో సీన్స్ తో అలీ అదరకొట్టారు. ఒకటీ అరా సీన్స్ లో కనిపించినా ధర్టీ ఇయిర్స్ ఫృధ్వీ, జయప్రకాష్ రెడ్డి గుర్తుండిపోతారు. రావు రమేష్ కూడా చాలా చిన్న పాత్ర కానీ ఆ డైలాగులు మాత్రం మర్చిపోలేం. ఇలా ప్రతీ పాత్రను పండించటానికి డైరక్టర్ తెరపై సినీ వ్యవసాయం గట్టిగానే చేసారు. అతనికి తెర వెనక, ముందు సాయం చేసారు. దేవిశ్రీప్రసాద్ పాటలు అయితే ఇప్పటికి ఎక్కడో చోట మ్రోగుతూనే ఉన్నాయి. గబ్బర్ సింగ్ హిట్ లో సగం క్రెడిట్ అతనిదే.
షాక్ , మిరపకాయ్ లాంటి కేవలం రెండు సినిమాలు డైరెక్ట్ చేసిన హరీష్ శంకర్ కి పవన్ కళ్యాణ్ పిలిచి మరి ఆఫర్ ఇచ్చాడేంటి అని ఆశ్చర్యపోయిన వాళ్లకు ఈ సక్సెస్ షాక్. ఓ డైరెక్టర్ గా కాకుండా ఒక ఫ్యాన్ తన అభిమాన హీరోని ఎలా చూడాలి అనుకుంటున్నాడో అలా సినిమాను తెరకెక్కించాడు హరీష్. ఈ సినిమా పవర్ స్టార్ ఇండస్ట్రీ హిట్ కొడితే ఎలా ఉంటుందో రుచి చూపించింది. ఆ తర్వాత పవర్ స్టార్ కెరీర్లో ఎన్ని సినిమాలు వచ్చినా గబ్బర్ సింగ్ సినిమా ప్రేక్షకులకి ఎప్పుడూ స్పెషలే.
Songs Jukebox: