సాఫ్ట్వేర్ సుధీర్ మూవీ విలేకరుల సమావేశం
కామెడీతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సాఫ్ట్వేర్ సుధీర్’
– హీరో సుడిగాలి సుధీర్
‘జబర్దస్త్, ఢీ, పోవే పోరా’ వంటి సూపర్‌హిట్ టెలివిజన్ షోస్ ద్వారా ఎంతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ హీరోగా, ‘రాజుగారి గది’ ఫేమ్ ధన్య బాలకృష్ణ హీరోయిన్గా శేఖర ఆర్ట్స్ క్రియేషన్స్ బేనర్‌పై ప్రొడక్షన్ నెం: 1గా ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘సాఫ్ట్వేర్ సుధీర్’. ఈ సినిమా ద్వారా రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రజా గాయకుడు గద్దర్, ప్రముఖ నటి ఇంద్రజ, షాయాజీ షిండే, పోసాని కృష్ణ మురళి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. డాక్టర్ ఎన్. శివ ప్రసాద్ నటించిన చివరి చిత్రం కావడం విశేషం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్ 10 మిలియన్ వ్యూస్‌కి పైగా సాధించి ట్రెండింగ్‌లో నిలిచిందంటే ఈ చిత్రం పట్ల ఆడియన్స్‌లో ఎంతటి అటెన్షన్ ఉందో అర్థమవుతోంది. వుతున్న సందర్భంగా హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో జరిగిన విలేకరుల సమావేశంలో…
దర్శకుడు రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల మాట్లాడుతూ – ”ఈ సినిమా ఒక ట్రెండీ కంటెంట్‌తో సాఫ్ట్ వేర్ బ్యాక్ డ్రాప్లో కామెడీతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండే మూవీ. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సినిమా ఔట్పుట్ చాలా బాగా వచ్చింది. ముఖ్యంగా సుధీర్ ఫ్యాన్స్‌కి ఈ సినిమా ఒక ఫీస్ట్‌లా ఉంటుంది. టీజర్‌కి 10 మిలియన్ వ్యూస్ రావడంతో సినిమా సక్సెస్ పట్ల నాకు, మా టీమ్‌కు కాన్ఫిడెన్స్ పెరిగింది. మా ప్రొడ్యూసర్ శేఖర్ రాజుగారు కథ నచ్చి నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. మేం వైజాగ్‌లో అంటే.. అలా కాదండీ మలేషియాలో అయితే బాగుంటుంది అని అక్కడ పాట చిత్రీకరించారు. నా మొదటి సినిమాకే అంత గొప్ప ప్రొడ్యూసర్ దొరికినందుకు హ్యాపీగా ఉంది. మంచి కామెడీ టైమింగ్ ఉన్న హీరో కావాలని సుధీర్‌ని, పెర్ఫామెన్స్కి మంచి అవకాశం ఉన్న క్యారెక్టర్ కావడంతో ధన్య బాలకృష్ణ ని సెలెక్ట్ చేయడం జరిగింది. సుధీర్‌గారు, ధన్య బాలకృష్ణచాలా బాగా నటించారు. అలాగే మా చిత్రంలో ప్రజా గాయకుడు గద్దర్ ఒక పాట పాడి అందులో నటించడం జరిగింది. ఇటీవల మనకు దూరం అయిన మాజీ ఎంపి, నటుడు డా. శివప్రసాద్‌గారు ఒక పాత్రలో నటించారు. అలాగే ఈ సినిమాలో మా ప్రొడ్యూసర్ శేఖర్ రాజుగారు ఒక రోల్ చేయడం జరిగింది. ఈ చిత్రంతో తప్పకుండా సక్సెస్ సాధిస్తామని నమ్మకంతో ఉన్నాం” అన్నారు.
హీరోయిన్ ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ – ”నేను ఇండస్ట్రీకి వచ్చి దాదాపు ఆరు సంవత్సరాలు అయింది. సుధీర్‌కి ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా ఒప్పుకున్నాను. సుధీర్ అభిమానులు కేవలం ఆయన్ని ఫాలో చేయడం కాదు, ఆయన్ను ప్రేమిస్తారని షూటింగ్ మొదలు పెట్టిన రోజే తెలుసుకున్నాను. రేపు సినిమా హిట్ అయితే దానికి కేవలం ఆయన ఫ్యాన్స్ కారణం. రాజశేఖర్ రెడ్డి ప్రాపర్ కమర్షియల్ డైరెక్టర్. ఆయన రైటింగ్‌లో కమర్షియాలిటీ ఉంది. అలాగే సోషల్ అవేర్నెస్ కూడా ఉంది. ఇంకో రెండుమూడేళ్లలో పెద్ద హీరోలతో తప్పకుండా వర్క్ చేస్తాడు. శేఖర్ రాజుగారికి తొలి సినిమా అయినా ఆర్టిస్టుల విషయంలో కానీ, టెక్నిషియన్స్ యాస్పెక్ట్‌లో కానీ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఆయన కూడా పెద్ద పెద్ద సినిమాలు నిర్మించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
చిత్ర నిర్మాత కె. శేఖర్ రాజు మాట్లాడుతూ – ”మా శేఖర ఆర్ట్స్ క్రియేషన్స్‌లో ఫస్ట్ మూవీ. రాజశేఖర్ చెప్పిన స్టోరీ నచ్చి ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ఒప్పుకున్నాను. అలాగే సుధీర్‌గారిని మా బేనర్లో హీరోగా పరిచయం చేయడం సంతోషంగా ఉంది. మొదటి సినిమా అయినా పూర్తి సహకారం అందించిన ఆర్టిస్టులు, టెక్నిషియన్స్‌కి ధన్యవాదాలు. సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది” అన్నారు.
హీరో సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ – ”నేను పదేళ్ల క్రిందట హైదరాబాద్ వచ్చి ఫిలిం ఛాంబర్ ముందుగా వెళ్తూ.. మనల్ని లోపలికి రానిస్తారా లేదా? అనుకున్నాను. అలాంటిది ఇవ్వాళ నా ఫస్ట్ సినిమా ప్రెస్‌మీట్ ఇక్కడ జరగడానికి ఆ దేవుడి ఆశీస్సులు, మా అమ్మానాన్నల ఆశీర్వాదమే కారణం అనుకుంటున్నాను. మార్చిలో రాజశేఖర్‌గారు నాదగ్గరికి వచ్చి స్టోరీ లైన్ చెప్పారు. చాలా బాగుంది సర్. టెక్నీషియన్స్ ఎవరు? అని అడిగాను. వెంటనే రామ్ ప్రసాద్‌గారు కెమెరా, గౌతం రాజు ఎడిటర్, రామ్ లక్ష్మణ్ ఫైట్స్, భీమ్స్ మ్యూజిక్, అని చెప్పారు. అంత పెద్ద టెక్నీషియన్స్ నా సినిమాకు ఎందుకు వర్క్ చేస్తారు అనుకున్నాను. కానీ సెకండ్ మీటింగ్‌లో ప్రొడ్యూసర్‌గారితో వచ్చి అడ్వాన్స్ ఇచ్చి మార్చి 20 షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. మార్చి 20 నా లక్కీ డే. ఆరోజు నా రెండు సినిమాలు షూటింగ్ స్టార్ట్ అయింది. మొదటి రోజు షూటింగ్ కి వెళ్ళగానే అల్యూమినియం ఫ్యాక్టరీలో పెద్ద సెట్ వేసి ప్రొడ్యూసర్‌గారు అక్కడే కూర్చొని అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటున్నారు. నా లైఫ్‌లో నేను ఇంకో సినిమా ఇంత పెద్ద టెక్నిషియన్స్‌తో చేస్తానో! లేదో తెలీదు. మొదటి సినిమాకే ఇంత పెద్ద టెక్నిషియన్స్‌ని ఇచ్చిన మా దర్శక, నిర్మాతలకు థాంక్స్. మా నాన్న, బి.ఎ. రాజుగారు సన్నిహితులు. ఆయన నా సినిమాకి వర్క్ చేయడం చాలా హ్యాపీ. సినిమా ఔట్పుట్ చాలా బాగా వచ్చింది. ధన్య బాలకృష్ణగారితో షూటింగ్ ఫన్నీగా జరిగింది. ఇప్పటివరకూ నన్ను ఎలా సపోర్ట్ చేశారో, వెండి తెరపై కూడా అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. కామెడీతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉండడం ఈ సినిమా ప్రత్యేకత. అలాగే ఈ సినిమాలో డాన్సులు, ఫైట్స్ చేశాం. ఎలా ఉన్నాయో మీరే స్క్రీన్ మీద చూసి చెప్పాలి. అలాగే నా పేరు మీదే టైటిల్ ఉండడం కూడా హ్యాపీ. నాకు ఇష్టమైన ఇద్దరు వ్యక్తులు రజినీకాంత్‌గారు, పవన్ కల్యాణ్‌గారు. ఈ సినిమాలో వారిద్దర్నీ ఇమిటేట్ చేయడం జరిగింది. డిసెంబర్ ఫస్ట్ వీక్ రిలీజ్ అనుకుంటున్నాం. మీ మీడియా సపోర్ట్ మాకు ఎప్పటిలాగే ఉండాలని కోరుకుంటున్నాను” అన్నారు.
సుడిగాలి సుధీర్, ధన్య బాలకృష్ణ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రజా గాయకుడు గద్దర్ ఓ పాటలో నటిస్తున్నారు. సీనియర్ నటి ఇంద్రజ, పోసాని కృష్ణమురళి, నాజర్, షాయాజీ షిండే, డా. ఎన్. శివప్రసాద్, పృథ్వీ, సంజయ్ స్వరూప్, రవికాలే, విద్యుల్లేఖ, టార్జాన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్: గౌతంరాజు, సినిమాటోగ్రఫీ: సి.రామ్‌ప్రసాద్, ఆర్ట్: నారాయణరావు, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, నందు, స్టంట్ జాషువ, అంజి, డాన్స్: అనీష్ మాస్టర్, పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలె, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: భిక్షపతి తుమ్మల, పాటలు: గద్దర్, సురేష్ ఉపాధ్యాయ, నిర్మాత: కె.శేఖర్‌రాజు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల.