Reading Time: < 1 min

సినిమాటోగ్రఫర్‌ మనోహార్ ఇంట‌ర్వ్యూ

జాతిరత్నాలు  సినిమాటోగ్రఫర్‌ మనోహార్ ఇంట‌ర్వ్యూ. 
 
నవీన్‌ పొలిశెట్టి, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో కేవీ అనుదీప్‌ డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం ‘జాతిరత్నాలు’. స్వప్న సినిమాస్‌ పతాకంపై నాగ్‌ అశ్విన్‌ నిర్మించారు.  ఈ నెల 11న విడుదలైన ఈ సినిమాకు  ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.  ఈ సందర్భంగా.. సినిమాటోగ్రఫర్‌ మనోహార్ మీడియాతో మాట్లాడారు.
 
సినిమాటోగ్రఫర్‌ మనోహార్‌ మాట్లాడుతూ–‘‘మాది నెల్లూరు. నా పేరు మనోహార్‌. స్క్రీన్‌ పై సిద్ధం మనోహార్‌ అని ఉంటుంది.  నాగి అన్న కార్పొరేట్‌ వీడియోస్, వెడ్డింగ్‌ వీడియోస్‌ను డైరెక్ట్‌ చేసే ప్రాసెస్‌లో ఉన్న సమయంలో అప్పుడు మేం చాలా వర్క్‌ నేర్చుకున్నాం. ఆ టైమ్‌లో ఎవడే సుబ్రహ్మాణ్యం సినిమా స్టార్ట్‌ అయ్యింది. ఆ తర్వాత డైరెక్షన్‌ ట్రయల్స్‌ చేశాను. ఆ టైమ్‌లో నాగి అన్న, స్వప్న అక్క డైరెక్షన్‌లోకి వెళితే సినిమాటోగ్రఫీ చేయలేవు అని చెప్పి నాకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. మహానటి సినిమాకు అసిస్టెంట్‌గా చేశాను. అమ్మదివెన పాటు ఓ చిన్న సినిమాకు పని చేశాను. ఆ నెక్ట్స్‌ జాతిరత్నాలు సినిమాకు సినిమాటోగ్రఫర్‌ గా చేశాను. ఈ సినిమా పెద్ద హిట్‌గా నిలిచింది. ఆడియన్స్‌ సపోర్ట్‌ వల్లే ఇది సాధ్యమైంది. వైజయంతీ వారితో నాది తొమ్మిది సంవత్సరాల జర్నీ. ఈ సినిమాకు కొన్ని రీ షూట్స్ కూడా  చేశాం. ఎవడే సుబ్రహ్మాణ్యం, మహానటి సినిమాల కన్నా ఈ సినిమాకు నాగి అన్న ఎక్కువ కష్టపడ్డారు. ఆయ‌న  లేకపోతే ఈ సినిమా లేదు. సమర్‌గారి వల్ల ఫిల్మ్‌ మేకింగ్‌పై నాకు మరింత ఇంట్రెస్ట్‌ కలిగింది. కోర్టు సీన్స్‌ను నాగ్‌అశ్విన్‌గారు, దత్‌గారు దగ్గర ఉండి పర్వవేక్షించారు. నాగ్‌గారు ఎప్పుడు లొకేషన్‌లోనే ఉండేవారు.లాక్‌డౌన్‌లో కమిటైన ప్రాజెక్ట్స్‌ రెండు ఉన్నాయి. కెమెరామన్స్‌లో నాకు పీసీశ్రీరామ్‌గారు ఇష్టం.
 
ఆయన స్టోరీస్‌ చదివి ఇన్‌స్పైర్‌ అయ్యాను.