సీతాయణం చిత్రం తొలిపాట విడుదల
సీతాయణం’ లో పెళ్ళి పాటగా వాల్మీకి సంస్కృత రామాయణ శ్లోకం
కన్నడ సుప్రీం హీరో శశి కుమార్ తనయుడు అక్షిత్ శశికుమార్ ని హీరోగా పరిచయం చేస్తూ తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న “సీతాయణం” చిత్రంలోని తొలిపాట ‘సీతాయణం ఆంథమ్’ ను కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర విజయదశమి సందర్భంగా విడుదల చేశారు.
ఇటీవల లహరి మ్యూజిక్ యూట్యూబ్ వేదిక పై విడుదలైన ఈ లిరికల్ వీడియో, గతకొన్ని దశాభ్ధాలుగా హిందూ పెళ్ళి పత్రికలో కనిపించే ‘’శ్రీ రామ పత్ని‘’ అని సాగుతుంది. ఇప్పటి వరకు ఏ విధమైన ఆడియో ప్లాట్ ఫామ్ పై లేని ఈ వాల్మీకి సంస్కృత రామాయణ శ్లోకం ఇకపై పెళ్ళి పాటగా వినిపించనుంది.
ప్రభాకర్ ఆరిపాక దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనహిత భూషణ్ కధానాయిక. కలర్ క్లౌడ్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై రోహన్ భరద్వాజ్ సమర్పణలో శ్రీమతి లలిత రాజ్యలక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
పాటను విడుదల చేసిన అనంతరం రియల్ స్టార్ ఉపేంద్ర మాట్లాడుతూ, “లవ్ ,క్రైమ్ , థ్రిల్లర్ నేపధ్యంగా వస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది, కొత్త కాన్సెప్ట్ లను ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఇది కనెక్ట్ అవుతుంది. ఇప్పటి వరకు ధ్వని రూపంలో లేని ఓ గొప్ప శ్లోకాన్ని పెళ్ళి ఆంథమ్ గా తెలుగు , కన్నడ , తమిళంలో విడుదల చేయడం ప్రక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుంది. శశికుమార్ లాగే అక్షిత్ కూడా మంచి హీరో గా ఎదుగుతాడు, ఒక కొత్త నటుడ్ని పరిచయం చేస్తూ ఇప్పటి వరకు మూడు భాషలలో చిత్రం రాలేదు, ఆ అదృష్టం అక్షిత్ దే. చిత్రం విడుదలై మంచి విజయాన్ని సాధించాలని, దర్శక నిర్మాతలకు మంచి పేరు రావాలని ఆకాంక్షిస్తున్నా” అన్నారు.
ఈ సంధర్భంగా దర్శక నిర్మాతలు ప్రభాకర్ ఆరిపాక , లలిత రాజ్యలక్ష్మి మాట్లాడుతూ, ” ఒక గొప్ప శ్లోకాన్ని తెలుగు , కన్నడ , తమిళం ప్రేక్షకులకి మా చిత్రంలో పాట ద్వారా అందించడం చాలా సంతోషంగా ఉంది. సంగీత దర్శకుడు పద్మనాభ్ భరద్వాజ్ ఈ పాటకి అద్భుతమైన స్వరాలు అందించారు. అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాం. అతిత్వరలో సీతాయణం టీజర్ ను, ట్రైలర్ ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం” అని చెప్పారు.
తారాగణం: అజయ్ ఘోష్, మధునంధన్, విధ్యులేఖ రామన్, బిత్తిరి సత్తి, కృష్ణ భగవాన్, గుండు సుదర్శన్, అనంత్, జభర్ధస్ట్ అప్పారావు, టి యన్ ఆర్, మధుమణి, మేఘనా గౌడ తదితరులు.
రచన & దర్శకత్వం: ప్రభాకర్ ఆరిపాక
కెమెరా: దుర్గాప్రసాద్ కొల్లి
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
సాహిత్యం: చంద్రబోస్, అనంత్ శ్రీరామ్
ఫైట్స్: రియల్ సతీష్
కొరియోగ్రఫీ: అనీష్
సంగీతం: పద్మనాభ్ భరద్వాజ్
నిర్మాత: లలిత రాజ్యలక్ష్మి