Reading Time: 2 mins
హర్ష కుమార్, తులిక సింగ్ హీరో హీరోయిన్లు గా మధునారాయణ్ ముఖ్య పాత్రలో గ్లిట్టర్ ఫిల్మ్ అకాడమీ మరియు ఏ.జి ఎంటర్టైన్మెంట్   బ్యానర్స్ లో దీపక్ బల్దేవ్ దర్శకత్వం లో  ప్రకాష్ ఠాకూర్ సమర్పిస్తున్న చిత్రం “లాస్ట్ సీన్ ” ఈ చిత్రం ట్రైలర్ ని హైదరాబాద్ ప్రసాద్ లాబ్ లో ప్రముఖ సీనియర్ డైరెక్టర్ కోదండ రామిరెడ్డి గారి చేతులమీదుగా విడుదల అయింది ఈ కార్యక్రమంలో మరో సీనియర్ డైరెక్టర్ సాగర్ మరియు యుంగ్ డైరెక్టర్స్ నీలకంఠ రవికుమార్ చౌదరి మరియు చిత్ర యూనిట్ తో పాటు గ్లిటర్ ఫిల్మ్ అకాడమీ లో శిక్షణ పొందిన స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు తదితరులు హాజరయ్యారు.
 
ఈ సందర్భంగా ముఖ్య అతిధి కోదండ రామిరెడ్డి మాట్లాడుతూ…
 
దీపక్ నాకు చాలా ఏళ్ల నుండి తెలుసు అతను కష్టపడి ఇదొకటి సాధించాలి అని తపన ఉండే కుర్రాడు”లాస్ట్ సీన్” మూవీ గురించి వినగానే మంచి విహయం ఉంది దీపక్ లో కథ మంచిది ఎన్నుకునే ఉంటాడు అనిపించింది, ఈ ట్రైలర్ చూసాక నా గెస్ కరెక్ట్ అనిపించింది. ఈ చిత్రం దీపక్ కి మంచి పేరు తీసుకురావాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను.అని చెప్పారు
 
డైరెక్టర్ సాగర్ మాట్లాడుతూ…ట్రైలర్ చాలబాగుంది దీపక్ డైరెక్టర్ గా సక్సస్ అవ్వాలని కోరుకుంటున్నాను.
 
డైరెక్టర్ నీలకంఠ మాట్లాడుతూ..
 
“లాస్ట్ సీన్” ట్రైలర్ చూడగానే దీపక్ టేలెంట్ ట్రైలర్ లో చూసాను లాస్ట్ సీన్ టీం కి అల్ ధి బెస్ట్ తెలిపారు
 
రవికుమార్ చౌదరి మాట్లాడుతూ దీపక్ గారికి వల్ల టీం కి శుభాకంక్షాలు తెలిపారు. హీరో హర్ష కుమార్ మాట్లాడుతూ…
 
నాకు లాస్ట్ సీన్ మూవీ లో లీడ్ రోల్ ఇచ్చి నా మీద నమ్మకం ఉంచిన నా గురువు దైవం అయిన దీపక్ సార్ కి నా పాదాబి వందనం నాకు సపోర్ట్ చేసిన డి. ఓ.పి. గారికి డైరెక్షన్ టీం అందరికి ధన్యవాదములు తెలిపారు
 
 హీరోయిన్ తులిక సింగ్ మాట్లాడుతూ…
 
నేను గ్లిటర్ ఫిల్మ్ అకాడమీ లో జాయిన్ అయినపుడు నేను ఇంత త్వరగా హీరోయిన్ అవుతాను అనుకోలేదు నేను “లాస్ట్ సీన్” మూవీ లో మెయిన్ లీడ్ చేయడం ఇప్పటికి నమ్మలేకపొతున్నాను. ఇంతటి అవకాశం ఇచ్చిన మా గురువులు ఈ సినిమా దర్శకుడు మా దీపక్ సార్ గారికి పదాభి వందనం ఈ చిత్రం చాలా సంతోషాన్ని నా లైఫ్ కి ధైర్యాన్ని ఇచ్చింది అని చెప్పారు
 
దర్శకుడు దీపక్ భల్దేవ్ ఠాకూర్ మాట్లాడుతూ…ఇక్కడికి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీడియా మిత్రులకు, పెద్దలు ప్రముఖ సీనియర్ డైరెక్టర్ కోదండ రామిరెడ్డి గారికి మరో సీనియర్ డైరెక్టర్ సాగర్ మరియు యుంగ్ డైరెక్టర్స్ నీలకంఠ రవికుమార్ చౌదరి మరియు చిత్ర యూనిట్ తో పాటు గ్లిటర్ ఫిల్మ్ అకాడమీ లో శిక్షణ పొందిన స్టూడెంట్స్ మరియు వాళ్ళ తల్లిదండ్రులకు అందరికి థాంక్యూ.”లాస్ట్ సీన్” ఈ చిత్రం నాకు చాలా జ్ఞాపకాలను ఇచ్చింది.నేను ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్, ఊటీ , లలో షూటింగ్ జరుపుకుంది.నేను రాసుకున్న కథకు ఎక్కడ తగ్గకుండా ఔట్ ఫుట్ కోసం ఇక్కడ కంప్రమేజ్ కాలేదు నేను అనుకున్న దానికంటే మంచి ఔట్ ఫుట్ రావడానికి కారణం అయిన మా డి. ఓ.పి. మరియు కో డైరెక్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అలానే నా సినిమా లో అందరూ మా గ్లిటర్ ఫిల్మ్ అకాడమీ లోని స్టూడెంట్స్ తో తెరకెకించడం జరిగింది. అందరూ వాళ్ళ నాకు సొంత సినిమాల కష్టపడి మంచి ఔట్ ఫుట్ వచ్చేలా చేశారు అందరికి పెరు పేరున ధన్యవాదములు. తెలిపారు
 
ఈ చిత్రానికి సంగీతం: సంజీవ్ కుమార్ కెమెరామెన్: జవహర్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్: రఘు కులకర్ణి, కాస్ట్యూమ్స్ డిజైనర్: రీటా బవాలి, మాటలు: రామం గోయల్, కో ప్రొడ్యూసర్: అజయ్ గౌతమ్,  పి.ఆర్.ఓ: కడలి మీడియా, కథ,కధనం మరియు దర్శకత్వం: దీపక్ బల్దేవ్ ఠాకూర్