సురేష్ బాబు రెండు చిత్రాల ప్రకటన
రామానాయుడు పూర్వ విద్యార్థులతో రెండు చిత్రాలు నిర్మించనున్న ప్రొడ్యూసర్ సురేష్ బాబు
చిత్ర నిర్మాత సురేష్ బాబు గారు రెండు సరికొత్త చిత్రాలను ప్రకటించారు. ఈ రెండు చిత్ర దర్శకులు రామానాయుడు ఫిల్మ్ స్కూల్ పూర్వ విద్యార్థులు సతీష్ త్రిపుర మరియు అశ్విన్ గంగరాజు కావటం విశేషం.
సతీష్ త్రిపుర చిత్రం ఒక ఉత్కంఠ భరితమైన క్రైమ్ థ్రిల్లర్ కాగా, అశ్విన్ గంగరాజు చిత్రం ఒక ప్రముఖ వ్యాపారవేత్త హత్య చుట్టూ అల్లుకున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కావటం విశేషం. రామానాయుడు ఫిల్మ్ స్కూల్ పూర్వ విద్యార్థులను తెలుగు చిత్ర పరిశ్రమలోనికి తీసుకురావటంలో ఇదో మైలు రాయిగా అభివర్ణించవచ్చు. ఆయా చిత్రాల నటీనటులు, టెక్నీషియన్ల వివరాలను త్వరలో వెల్లడిస్తారు.