Reading Time: < 1 min

సైలెన్స్ ప్లీజ్ చిత్రం ప్రి-రిలీజ్ వేడుక

డాక్టర్ కొణిజేటి రోశయ్య ముఖ్య అతిధిగా ‘సైలెన్స్ ప్లీజ్’ ప్రి-రిలీజ్  వేడుక
     

బెంగళూర్ లోని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని జీవితంలో జరిగిన ఓ సంఘటన స్ఫూర్తిగా తీసుకుని కన్నడలో రూపొంది ఘన విజయం సాధించిన థ్రిల్లర్ ‘నిశ్శబ్ద-2’.

ఈ చిత్రాన్ని తెలుగులో ‘సైలెన్స్ ప్లీజ్’ పేరుతో విడుదల చేస్తున్నారు.

ఈ చిత్రంలో రూపేష్ శెట్టి, ఆరాధ్య శెట్టి హీరోహీరోయిన్లు. దేవరాజ్ కుమార్ దర్శకత్వం వహించారు. 

వల్లూరిపల్లి రమేష్ సమర్పణలో భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్నారు.మార్చ్ 8న, అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రి-రిలీజ్ వేడుకలో మాజీ గవర్నర్-మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ కొణిజేటి రోశయ్య ముఖ్య అతిధిగా పాల్గొని ట్రైలర్ రిలీజ్ చేసి, రామసత్యనారాయణను అభినందించారు.  విశిష్ట అతిధులుగా హాజరైన ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ చైర్మన్ టంగుటూరు రామకృష్ణ, విశ్రాంత న్యాయమూర్తి నెరేళ్ల మాల్యాద్రి, రోటరీ జోనల్ ఛైర్మన్ కొత్త వెంకటేశ్వరావు, లయన్ విజయ్ కుమార్, బి.ఎన్. రెడ్డి ఈ చిత్రంలోని పాటలను వరుసగా విడుదల చేసి, చిత్ర విజయాన్ని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకులు దేవరాజ్ కుమార్, ఈ చిత్రాన్ని వివిధ జిల్లాల్లో పంపిణీ చేస్తున్న   డిస్ట్రిబ్యూటర్స్ గౌరి శంకర్, కాశీ, మురళి, గ్రాఫిక్స్ చందు పాల్గొన్నారు. భారత్ ఆర్ట్స్ అకాడమీ రమణారావు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.   

చిత్ర నిర్మాత-భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ‘స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగే ఈ చిత్రం తెలుగులోనూ ఘన విజయం సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ కు కృతజ్ఞతలు తెలిపారు.   

అవినాష్, పెట్రోల్ ప్రసన్న ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి.. కెమెరా: వీనస్ మూర్తి, మ్యూజిక్: సతీష్ ఆర్యన్, సమర్పణ: వల్లూరిపల్లి రమేష్, నిర్మాత: తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, దర్శకత్వం: దేవరాజ్ కుమార్!!