సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్’ శాస్వతంగా నిలిచిపోతుంది : మెగాస్టార్ చిరంజీవి
అంగరంగ వైభవంగా జరిగిన ఆహా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్’
ఆహా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్వహించిన’ సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ (SIFF) ఇనాగరల్ ఎడిషన్ సినిమాటోగ్రఫీ, R &B మంత్రి శ్రీ కోమట్రెడ్డి వెంకట్ రెడ్డి, ఆహా కో ఫౌండర్ శ్రీ అల్లు అరవింద్, మైహోమ్ కన్స్ట్రక్షన్స్ అండ్ మేరు స్కూల్స్ డైరెక్టర్ శ్రీమతి మేఘన జూపల్లి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ శ్రీ టిజి విశ్వ ప్రసాద్, అజిత్ ఠాకూర్, ఆహా సిఇఒ శ్రీ రవికాంత్ సబ్నవిస్, డైరెక్టర్ వంశీ పైడిపల్లి వంటి ప్రముఖులచే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టానికి, ప్రాంతీయ కథా కథనాలు, సినిమాని సెలబ్రేట్ చేసుకునే అద్భుతమైన వేడుకకు నాంది పలికింది.
ఆకట్టుకునే సంభాషణలు, ప్యానెల్ చర్చలతో వేడుక కొనసాగింది. ప్రముఖ సినీ విమర్శకుడు, పాత్రికేయుడు మయాంక్ శేఖర్, లెజెండరీ అల్లు అరవింద్, తెలుగు సినిమాకి సంబధించిన ఆకర్షణీయమైన సంభాషణలు జరిపారు. మోడరేటర్ వాణీ రాణే తెలుగు సినిమాపై జెన్ జీ దృక్పథంపై యంగ్ సెన్సేషన్స్ సంతోష్ శోభన్, ఆనంద్ దేవరకొండ, శ్రీ గౌరీ ప్రియలతో చర్చకు నాయకత్వం వహించి,భవిష్యత్తు సినిమా ద్రుష్టి కోణాన్ని చర్చించారు. మిరాజాపూర్ ఫేమ్ సుపర్ణ్ వర్మ , నిర్మాత అనిల్ తడానీ నేతృత్వంలోని సినిమా ఫార్ములా విజయంపై ఆసక్తికరమైన చర్చ కూడా జరిగింది.
‘కల్కి’ ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ స్వప్న దత్తో, ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ నేతృత్వంలో సాగిన ఫైర్‌సైడ్ చాట్ హైలైట్ గా నిలిచింది . ఈ సంభాషణ ఈ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తించింది. న్యూ ఏజ్ డైరెక్టర్స్ సాయి రాజేష్ , శైలేష్ కొలను ప్రేమ మాలినితో ఇన్ సైట్ ఫుల్ సంభాషణ జరిపారు.
సాయంత్రం ఈ వేడుక మరింత ఆకర్షణీయంగా సాగింది. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులచే స్టార్-స్టడెడ్ రెడ్ కార్పెట్ ఈవెంట్ అద్భుతంగా మారింది. పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మురళీ మోహన్, ఇటీవల పద్మ విభూషణ్ అవార్డ్ అందుకున్న చిరంజీవి గారిని సత్కరించారు. మెగాస్టార్ ప్రజెన్స్ ఈ వేడుకకు గొప్ప వైభవాన్ని జోడించింది. దర్శకులు బాబీ, హీరో సందీప్ కిషన్, దామోదర్ ప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ వేడుకలో పాల్గొని వారి దృక్పథాన్ని వ్యక్తం చేశారు.
లక్ష్మి మంచు, నవదీప్ అద్భుతంగా హోస్ట్ చేసిన ఈవెనింగ్ గాలా ఆహ్లాదకరంగా సాగింది. తర్వాత ఈవెంట్లో, మూడు విభాగాల్లో విజేతల ప్రకటించారు: జనవరి 1 2020 మధ్య నిర్మించిన షార్ట్ ఫిల్మ్ (3 నుండి 15 నిమిషాలు), స్ప్రైట్ షార్ట్ షార్ట్ (3 నిమిషాలలోపు), మ్యూజిక్ వీడియోలు 60 నిమిషాలలోపు లాంగ్ ఫార్మాట్ ఫిల్మ్ ఈ కేటగిరీలో వున్నాయి. మెగాస్టార్‌కి తేజ సజ్జా ఇచ్చిన ట్రిబ్యూట్ సాయంత్రం హైలైట్లలో ఒకటి గా నిలిచింది. అతని అసాధారణ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. సాయంత్రం వినోదానికి జోడిస్తూ ఫరియా అబ్దుల్లా, చాందినీ చౌదరి చేసిన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకున్నాయి.
ఈ వేడుకలో పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఆహా ఏర్పాటు చేసిన ఈ వేడుకకు రావడం చాలా ఆహ్లాదకరంగా వుంది. ఈ వేడుకలో నాకు చిరు సత్కారం జరగడం కూడా చాలా ఆనందంగా వుంది. నాకు పద్మ విభూషణ్ అవార్డ్ వచ్చిన ఉదయాన్నే మొట్టమొదటిగా మా ఇంటికి వచ్చి పుష్ప గుచ్చం ఇచ్చి చాలా ఆనందం పొందిన వ్యక్తి మురళీ మోహన్ గారు. ఆ రోజు మొదలుకొని ఐదారు రోజులు వరకూ ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ ఇంటికి వచ్చి అభినందించారు, సన్మానించారు, ఆనందపడ్డారు. ఐదారు రోజులు పాటు ఒక సంబరంలా వేడుక జరిగిందనే ఆనందం నాకు వుంది. ప్రతి కళాకారుడికి సామాజిక భాద్యత వుంటుంది. ప్రేక్షకులు మనకు పంచిన ప్రేమకు బదులుగా మనం ఏం తిరిగి ఇస్తున్నామని లోచిస్తే ప్రతి ఒక్కరూ కూడా ఒక ప్రజా సేవకుడు అవుతారు. సమయానికి రక్తం దొరకక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని పత్రికల్లో చదివినప్పుడు మనసు కలిచివేసింది. సమయానికి రక్త ఇచ్చినట్లయితే ఒక ప్రాణం నిలబెట్టినవారం అవుతాం కదా అనే ఆలోచనతో బ్లడ్ బ్యాంక్ పెట్టడం జరిగింది. నా అభిమానుల మీద నమ్మకంతోనే అది పెట్టాను. ఈ రోజుకీ నిరంతరంగా అది కొనసాగుతుందంటే కనుక అభిమానులు వలనే సాధ్యపడుతుంది. ఈ సందర్భంగా వారందరికీ నా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. రాజకీయాల నుంచి మళ్ళీ సినిమాలోకి వచ్చిన సమయంలో అదే ఆదరణ ప్రేమ ఉటుందా ? అనే ఆలోచన వుండేది. నా సినిమాలో డైలాగ్ ఒకటివుంది. ‘ఎన్నాళ్ళైనా అదే పౌరుషం, అదే రక్తం’. ఇదే డైలాగ్ నేను తిరిగి సినిమా ల్లోకి వచ్చినపుడు ప్రేక్షకులు నాకు చెప్పినట్లునిపించింది.’అదే ఆదరణ, అదే ప్రేమ, అదే అభిమానం, అదే గుండెల్లో మీ చోటు” అన్నట్టుగా అనిపించింది. 150 సినిమా నుంచి ఈ క్షణం వరకూ అదే ఎనర్జీ పొందుతున్నాను. ప్రేక్షకుల స్పందన, అభిమానమే ఎనలేని ఉత్సాహన్ని ఇస్తున్నాయి. ఓపిక వున్నంతం వరకూ, మీరు ఆదరించేవరకూ సినిమాల్లోనే వుంటాను. ఇలాంటి ఫిల్మ్ ఫెస్టివల్ ఆవశ్యకత ఎంతైనా వుంది. యువ ప్రతిభని ప్రోత్సహిస్తే వారు మరింత ఉత్సాహంతో పని చేస్తారు. అలాంటి అవకాశం ఈ వేదిక ఇచ్చింది. ఇక్కడ షార్ట్ ఫిల్మ్స్ ని ప్రజెంట్ చేస్తున్న వారంతా సూపర్ సక్సెస్ అవ్వాలని, ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ఆహా వారి మనసులో శాశ్వతంగా నిలిచిపోతుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.” అన్నారు.
ఆహా కో ఫౌండర్, నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఆహాతో మేము ఎల్లప్పుడూ కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తున్నాం. సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ (SIFF) పరిశ్రమలో కొత్త ప్రతిభని పెంపొందించడానికి మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. SIFF దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ నుండి విభిన్న ప్రతిభ, ఆవిష్కరణ, సాంస్కృతిక గొప్పతనాన్ని అందిస్తుంది. జ్యోతి ప్రజ్వలన వేడుక ఐక్యత, సహకారానికి ప్రతీక, ఇది మరపురాని వేడుకకు వేదికగా నిలిచింది. ఈ గౌరవప్రదమైన సమావేశంలో భాగం కావడం ఆనందంగా వుంది. ఈ ఫెస్టివల్ తో, మేము అన్ని దక్షిణ భారత భాషలకు మా పరిధిని విస్తరింపజేస్తూ, నెక్స్ట్ జనరేషన్ ఫిల్మ్ మేకర్స్ ని గుర్తించి, ఆదరించే ప్రయాణాన్ని ప్రారంభించాము” అన్నారు
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ: SIFF తొలి ఎడిషన్ ఒక మరపురాని సందర్భం. ఇది దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలోని ప్రముఖులను ఒకచోట చేర్చి, ప్రాంతీయ కథా సాహిత్యం, సినిమా నైపుణ్యం యొక్క వేడుకకు వేదికగా నిలిచింది. ఆకర్షణీయమైన ప్యానెల్ చర్చల నుండి అద్భుతమైన ప్రదర్శనల వరకు,.. ఈ వేడుక దక్షిణ భారత సినిమా వైవిధ్యాన్ని ప్రదర్శించింది. SIFF అనేది కేవలం ఒక ఈవెంట్ మాత్రమే కాదని, సహకారం, ఆవిష్కరణలను పెంపొందించే వేదిక. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగమైనందుకు ఆనందంగా వుంది” అన్నారు.
ఆహా సిఈవో రవికాంత్ సబ్నవిస్ మాట్లాడుతూ: సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ (SIFF) ప్రాంతీయ సినిమా ల్యాండ్‌స్కేప్‌లో ఒక కొత్త శకానికి నాంది పలుకుతోంది, కథాకథనం ,సినిమా నైపుణ్యం యొక్క వేడుకలో గౌరవనీయులైన వ్యక్తులు, ప్రతిభావంతులను ఒకచోట చేర్చింది. ఆహా సిఈవోగా, పండుగ ప్రారంభ ఎడిషన్‌ను ఇంత గొప్పగా, ఉత్సాహంగా ఆవిష్కరించడం నాకు గర్వంగా ఉంది. ఆకర్షణీయమైన ప్యానెల్ చర్చల నుండి అద్భుతమైన ప్రదర్శనల వరకు, SIFF దక్షిణ భారత సినిమా యొక్క చైతన్యం ,వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది. కొత్త ప్రతిభకు మద్దతు ఇవ్వడానికి, ప్రోత్సహించడానికి మేము సిద్ధంగా వున్న్నాము. SIFF ప్రతిభను గుర్తించడానికి, ప్రోత్సహించదానికి ఒక వేదికగా పనిచేస్తుంది.” అన్నారు