Reading Time: 2 mins
స్వేచ్ఛ సినిమా ప్రిరిలీజ్ వేడుక
 
ఇలాంటి సందేశాత్మక చిత్రాలు రావాలి- స్వేచ్ఛ ప్రి రిలీజ్ వేడుకలో మాజీ మంత్రి తీగల కృష్ణారెడ్డి
 
 
స్ర్తీజాతికి జరుగుతున్న అన్యాయంపై సందేశాత్మకంగా నిర్మించిన ‘స్వేచ్ఛ’లాంటి చిత్రాల అవసరం నేటి సమాజానికి ఎంతైనా ఉందని మాజీ మంత్రి తీగల కృష్ణారెడ్డి అన్నారు.  
ప్రముఖ గాయని మంగ్లీ కథానాయికగా నటించిన ‘స్వేచ్ఛ’ సినిమా ప్రిరిలీజ్ వేడుక బుధవారం ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తీగల కృష్ణారెడ్డి 
మాట్లాడుతూ ‘అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్ రామారావుల కాలంలో వంద రోజులు ఆడిన రోజులు మనం చూశాం. ఇవి ఆరోజులు కావు… ఎన్నో మార్పులు వచ్చాయి. అయినా కొత్త కొత్త తరహా  సినిమాలు వస్తున్నాయి, కొత్తకొత్త హీరోలు వస్తున్నారు. మంగ్లీ మంచి సింగర్ గా తెలుసు, ఈ సినిమా ద్వారా మంచి నటి అనిపించుకుంటుందని భావిస్తున్నా. మంగ్లీ అతి జాగ్రత్తగా సినిమాల్లో నటిస్తే  మంచి పేరుప్రఖ్యాతులు వస్తాయి. భగవంతుడు ప్రతి మనిషికి మంచి అవకాశాలు ఇస్తాడు… మనం వాటిని చక్కగా ఉపయోగించుకోవాలి. ప్రయ్నతం, మన కృషి, నడవడికల మీద విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. చమ్మక్ చంద్ర మాట్లాడుతూ ‘ఇలాంటి చిన్న సినిమాని మీడియా ముందుకు తీసుకువెళ్లడానికి కృషిచేయాలి. ‘గోర్ జీవన్’ పేరుతో బంజారా భాషలో విడుదలై సంచలనం  సాధించిన సినిమా ఇది, ఆ నమ్మకంతోనే రాజు నాయక్ గారు తెలుగులో దీన్ని విడుదల చేస్తున్నారు. సమాజానికి ఉపయోగపడే పాయింటు ఉన్న సినిమా. ఆడపిల్లలను రక్షించండి, చెట్లను  సంరక్షించండి అనే సందేశంతో తీశారు. అలాంటి సందేశాత్మక పాత్రను మంగ్లీ చేసింది. ఇందులో నేను కూడా మంచి పాత్ర పోషించాను.  అందరూ బాగా చేశారు. భోలే పాటలు మంచి హిట్టయ్యాయి. తెలుగులో కూడా మంచి విజయం లభిస్తుంది. మంచి ప్రయత్నాన్ని ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారు. 
 
 
ఈ చిత్ర కథానాయిక మంగ్లీ మాట్లాడుతూ ఇది బంజారాలకు సంబంధించిన సినిమా కాదు… ప్రజలకు సంబంధించిన సినిమా. చాలా చోట్ల అణగారిన వర్గల్లో నడిచే కథ. చక్కటి సందేశం ఉండటంతో నేను నటించాను. బంజారా భాషలో మంచి హిట్ అయింది. తెలుగులో కూడా హిట్టవుతుందని భావిస్తున్నా. నిర్మాతగా రాజు నాయక్ కు మంచి పేరు రావాలని కోరుకుంటున్నా.
సంగీత దర్శకుడు భోలే మాట్లాడుతూ ‘సతీష్ కుమర్ బంజారా భాషలో ఎంతో కష్టపడి దీన్ని నిర్మించారు. ఈ చిత్రానికి హీరోకు రెండు వైపులా మంగ్లీ, చమ్మక్ చంద్ర కుడిఎడమ భుజాలుగా నిలబడి  సినిమాని మోయడం నేను కళ్లారా చూశాను. ప్రతి విషయంలో ఉన్నదున్నట్లుగా మాట్లాడే నిర్మాత రాజు నాయక్. అందుకే తెలుగులో కూడా ఉత్సాహంతో నేను పనిచేశాను. మంగ్లీ హీరోయిన్  ఓరియంటెడ్ గా చేసిన ఈ సినిమాని అందరూ చూడాలి. ఇందులో అద్భుతమైన పాటల్ని ఇచ్చాను. తెలుగులో కూడా లేడీస్ కూడా ముందువరసలో చూడాల్సిన సినిమా ఇది. ‘బంజారే బంజారే బంజారే ’ అనే పాట జనంలోకి బాగా వెళ్లింది. అందరినీ కదిలించే పాట ఇది.’ అన్నారు. 
 
 
ధర్శకుడు, హీరో కెపిఎన్ చౌహాన్ మాట్లాడుతూ ‘నిర్మాత రాజునాయక్ ఈ సినిమాని విడుదల చేయాటానికి ఎంతో ఎఫర్ట్ పెట్టారు. చిన్న సినిమాలను మీడియా ముందుకు తీసుకెళ్లాలి. ప్రతిఒక్కరికీ అమ్మాయి అంటే ఇష్టమే. కానీ ఆమెకు సపోర్ట్ ఇవ్వడం లేదు. సందేశంతో చేశాను. కమర్షియల్ జోన్ లోనే చేశాను. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది. చిన్న సినిమాని పెద్దగా చేయడానికి సహకరించాలి. ఇలాంటి సినిమాలు వచ్చినపుడు కేసీఆర్, కేటీఆర్ లాంటి వారు సపోర్ట్ చేయాలి.’ అన్నారు. నిర్మాత రాజు నాయక్ మాట్లాడుతూ ఈ సినిమా ప్రచారంలో కొత్త పుంతలు 
తొక్కించినట్లు చెప్పారు. అన్ని థియేటర్లలో భారీగానే విడుదల చేస్తున్నామన్నారు. వేలాది హోర్డింగులతో బాగా ప్రమోట్ చేశామన్నారు. మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. 
 
సరస్వతీ డెవలపర్స్ రాజు నాయక్, సతీష్ నాయుడు, తారకేష్, బాలనటుడు చక్రి తదితరులు పాల్గొన్నారు.