హాయ్ నాన్న మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్
హాయ్ నాన్న ప్రేక్షకులందరినీ అలరించే మోస్ట్ కమర్షియల్, యూనిక్ మూవీ: టీజర్ లాంచ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని
నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్, శౌర్యువ్, వైరా ఎంటర్టైన్మెంట్స్ హాయ్ నాన్న టీజర్ లాంచ్- డిసెంబర్ 7న థియేట్రికల్ రిలీజ్
సండే అంటే ఫ్యామిలీ టైం. నేచురల్ స్టార్ నాని తన పాన్ ఇండియా చిత్రం హాయ్ నాన్నా నుంచి మనసుని హత్తుకునే టీజర్ ను విడుదల చేయడంతో ఈ సండే మరింత ప్రత్యేకంగా నిలిచింది. నాని, బేబీ కియారా ఖన్నా మధ్య అందమైన ప్రయాణంతో తండ్రీ-కూతుళ్ల కథగా టీజర్ ప్రారంభమవుతుంది. తర్వాత నాని, మృణాల్ ఠాకూర్ లవ్ జర్నీని ప్రజంట్ చేసింది. బేబీ కియారా అతని కూతురా? నాని, మృణాల్‌ని ఇంతకు ముందు కలిశాడా? మృణాల్ వేరొకరితో తన పెళ్లికి ముందు నానికి ఎందుకు ప్రపోజ్ చేసింది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
దర్శకుడు శౌర్యువ్ తన మొదటి సినిమాతోనే మ్యాజిక్ చేశాడు. తొలి సినిమాలో చాలా భావోద్వేగాలతో కూడిన స్క్రిప్ట్‌ను డీల్ చేయడం అంత సులభం కాదు. కానీ శౌర్యువ్ మొదటి సినిమాతోనే పరిణితి చూపించాడు. భావోద్వేగాలను చక్కగా బ్యాలెన్స్ చేశాడు. తండ్రీ కూతుళ్ల బంధం ప్రతి తండ్రి కి కనెక్ట్ అవుతుండగా, నాని, మృణాల్ ల ప్రేమ కథ జాయ్ ఫుల్ గా వుంది.
నాని ఎప్పటిలాగే తన అద్భుతమైన నటనతో అదరగొట్టారు. నాని చాలా కాలం తర్వాత ఇలాంటి ఎమోషనల్ క్యారెక్టర్లో కనిపించడం విశేషం. రెండు విభిన్నమైన గెటప్‌లలో కనిపించారు. ఒక గెటప్‌లో చాలా యంగ్ గా కనిపిస్తే, మరో పోర్షన్ లో మధ్య వయస్కుడిగా కనిపించాడు. మృణాల్ ఠాకూర్ తన ప్రెజెన్స్ తో కథనంలో ఎలిగెన్స్ ని తీసుకొచ్చింది. బేబీ కియారా ఖన్నా క్యూట్ గా ఉంది.
సాను జాన్ వరుగుస్ ISC ప్రతి ఫ్రేమ్‌కి జీవం పోయగా, హేషమ్ అబ్దుల్ వహాబ్ తన అద్భుతమైన స్కోర్‌తో విజువల్స్‌కి ప్రాణం పోశాడు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ సినిమా నిర్మాణ విలువలు ఫస్ట్ క్లాస్‌గా ఉన్నాయి. మొత్తం మీద, టీజర్ సినిమాపై మరింత అంచనాలు పెంచింది. ప్రవీణ్ ఆంథోని ఎడిటర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి సతీష్ ఈవీవీ ఎగ్జిక్యూటివ్ నిర్మాత.
టీజర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు హాయ్ నాన్న చిత్ర యూనిట్ సమాధానాలు ఇచ్చింది.
నాని గారు ఫాదర్ డాటర్ కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి కదా,, హాయ్ నాన్న ఎంత డిఫరెంట్ గా వుంటుంది?
హాయ్ నాన్న చాలా యూనిక్ సబ్జెక్ట్. ఒకొక్క ప్రమోషన్ కంటెంట్ వచ్చే కొద్ది కథ, కాన్సెప్ట్ ప్రత్యేకత గురించి తెలుస్తూనే వుంటుంది. ఇది టీజర్ ఈవెంట్ కాబట్టి అన్నీ టీజ్ చేయడానికే (నవ్వుతూ).
నాని గారు ఇందులో కమర్షియల్ కంటెంట్ ఉందా ?
కమర్షియల్ అంటే అందరికీ, అన్ని ఏజ్ గ్రూప్స్ ప్రేక్షకులందరినీ అలరించేది. అలా చూసుకుంటే హాయ్ నాన్న మోస్ట్ కమర్షియల్ మూవీ.
నాని గారు మీరు ప్రతి సినిమాకు ఒక ప్రయోగం, అలాగే వైవిధ్యమైన పాత్ర చేస్తుంటారు ? ఇది మీకు బరువుగా అనిపించదా ?
నచ్చనిది చేయడం బరువుగా వుంటుంది. నచ్చినది చేయడం తేలికగా వుంటుంది. నాకు నచ్చిన సినిమా చేస్తున్నాను.
నాని గారు దసరా కి దీనికి చాలా వైవిధ్యం వుంది. ఇందులో తల్లి ప్రేమ కూడా తండ్రి ఇస్తున్నాడనినిపించింది టీజర్ చూస్తే మీరు ఏం చెప్తారు ?
నిజానికి నేను ఏదీ పెద్దగా కాలిక్యులేట్ చేసి చేయను, మనసుకు నచ్చింది చేసేస్తాను. ఈ రోజువరకూ చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులు గొప్పగా ఆదరించారు. నాకు నచ్చింది ప్రేక్షకులకు నచ్చుతుందనే భరోసా ఇచ్చారు. డిసెంబర్ 7న అది మరోసారి ప్రూవ్ అవుతుందని నమ్ముతున్నాను.
నాని గారు ఇప్పటివరకూ ఫాదర్ క్యారెక్టర్ ని చేసే హీరోలు ఒక వయసు దాటిన తర్వాత చేశారు. మీరు ఇంకా యంగ్ గానే వున్నారు. ఈ వయసులో చేయడం ఎలా అనిపిస్తుంది ?
రోజులు మారాయి. పద్దతులు కూడా మారాలని భావిస్తాను. ప్రేక్షకులు చాలా ఫాస్ట్ గా అప్డేట్ అవుతున్నారు. వాళ్ళని అందుకోలేకపోతే చాలా కష్టం.
నాని గారు మీ అబ్బాయి మిమ్మల్ని హాయ్ నాన్న అని పిలిచినప్పుడు మీ ఫీలింగ్ ఏమిటి ?
చాలా గ్రేట్ ఫీలింగ్ అండీ. ఈ పేరు నేనే పెట్టాను కదా అని అంటుంటాడు. నువ్వే పెట్టావ్ నీ సినిమానే అని చెబుతుంటాను. జెర్సీ, హాయ్ నాన్న లాంటి సినిమాలు అర్ధం చేసుకొనే వయసు వాడికి వుందో లేదో తెలీదు. కానీ ఏదో ఒక రోజు ఈ సినిమాలు చూసి గర్వపడతాడని నా నమ్మకం.
టీజర్ లో మీరు తప్పితే అందరూ వేరే భాష నటులు కనిపిస్తున్నారు. పాన్ ఇండియా దృష్టిలో పెట్టుకుని ఇలా చేశారా ?
ఇందులో తెలుగు హిందీ తమిళ్ అన్ని భాషల నటులు ఉన్నారు. పాత్రకు ఎవరు సరిపోతారో వారినే ఎంపిక చేసి తీసుకోవడం జరిగిందే కానీ పాన్ ఇండియా ని దృష్టి లో పెట్టుకొని చేసింది కాదు. ఇందులో మృణాల్ ఫ్యామిలీ ముంబై నుంచి వచ్చిన కుటుంబం. ఆ పాత్రలు ఎవరు సరిపోతారో వాళ్ళనే తీసుకున్నాం. అలాగే కియారా ఒక ఆడిషన్ వీడియో పంపింది. చాలా అద్భుతంగా చేసింది. ఈ పాత్రకు తను న్యాయం చేస్తుందని తనని తీసుకున్నాం. ఖచ్చితంగా ఈ సినిమాతో తను మీ మనసుని టచ్ చేస్తుంది. ఒక మంచి సినిమా తీయాలి. ప్రేక్షకులకు ఎఫెక్టివ్ ప్రోడక్ట్ ఇవ్వాలనే ఉద్దేశం తీసిన సినిమా అచ్చమైన తెలుగు సినిమా ఇది. మన సరిహద్దులు దాటి ప్రేక్షకులని అలరించే సినిమా ఇది.
అంటే ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా తగ్గట్టు కథలో కూడా మార్పులు చేస్తున్నారు కదా ?
నా సినిమాల వరకూ మాట్లాడుకుంటే ఇప్పటివరకూ ఒక్క ఎలిమెంట్ కూడా పాన్ ఇండియాని దృష్టిలో పెట్టుకొని చేసినట్లుగా వుండదు. నాకు కథ నచ్చితే సినిమా చేస్తాను.
నాని గారు ఇందులో హీరోయిన్ మిమ్మల్ని హాయ్ నాన్న అని చెప్పడం ఏమిటి ?
ఇందులో కియారాకి నేను నాన్నను కాబట్టి తను తరచూ పిలిచే పిలుపు ప్రకారం అలా పిస్తుంది. అయితే హాయ్ నాన్న వెనుక వున్న డీపర్ లాజిక్ ఏమిటనేది సినిమా చూసిన తర్వాత అర్ధమౌతుంది.
నాని గారు సలార్ సినిమా రావడంతో మీ సినిమా ముందుగా విడుదల చేయడం ఎలా అనిపిస్తుంది?
ఒక ఇంట్లో పెద్ద అబ్బాయి కి సంబధించిన ఏదైనా వేడుక వుంటే చిన్నోడి వేడుకని ముందుకు వెనక్కి జరపడం సహజం. దీని వలన ఎలాంటి సమస్య లేదు. డిసెంబర్ అంతా ఒక లవ్ స్టొరీ, యాక్షన్ సినిమాలతో కళకళలాడిపోతుంది. ఇంతకంటే మనకేం కావాలి. (నవ్వుతూ)
నాని గారు మీ హిట్ సినిమా ఫేమ్ డైరెక్టర్ శైలేష్ కొలను తీస్తున్న సైంధవ్ కూడా విడుదలౌతుంది అది కూడా చైల్డ్ సెంటిమెంట్ అనిపిస్తుంది. దీని గురించి ?
శైలేష్ ఏ కథ చేసుకున్న అభిప్రాయం కోసం ముందు నాకు చెప్తాడు. సైంధవ్ అదిరిపోతుంది. డిసెంబర్, జనవరిలో డిఫరెంట్ జోనర్స్ లో బ్లాక్ బస్టర్స్ చూస్తారనే నమ్మక్మం వుంది.
నాని గారు పిల్లలతో మీరు చేసే సినిమాలు చాలా బాగుంటాయి ఇందులో ఎలా వుంటుంది
నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. కృష్ణగాడి వీర ప్రేమ గాధ, జెర్సీఇప్పుడు హాయ్ నాన్న ఇవన్నీ నాకు పెయిడ్ హాలీడేస్. (నవ్వుతూ)
నాని గారు పాప చాలా క్యూట్ గా వుంది ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ?
ఢిల్లీ లో దొరికింది (నవ్వుతూ). ఇప్పటివరకూ తనని చూసింది నథింగ్. తన నటన ప్రేక్షకులని ఖచ్చితంగా హత్తుకుంటుంది.
నాని గారు., చాలా మంది కొత్త దర్శకులకు అవకాశం ఇస్తున్నారు ? ఆ నమ్మకం ఎలా కుదురుతుంది ?
నిజానికి నేను అంతగా ఆలోచించను. నేను సహాయ దర్శకుడిగా పని చేశాను. కథ చెప్పినప్పుడు ఆ కనెక్ట్ వస్తే మరో ఆలోచన లేకుండా చేస్తాను. ఇప్పటివరకూ అది కరెక్ట్ అవుతూ వచ్చింది. హాయ్ నాన్న లాంటి స్పెషల్ ఫిల్మ్ తో శౌర్యువ్ కూడా లిస్టు లో చేరుతారు.
నాని గారు ఇప్పటివరకూ ముఫ్ఫై సినిమాలు చేశారు ఈ ప్రయాణం పట్ల తృప్తి గా వున్నారా ? ఏదైనా సాధించాను అని భావిస్తున్నారా ?
మీరు చాలా గౌరవంగా ప్రశ్నలు అడిగారు. ఆ గౌరవాన్ని సాధించానని భావిస్తున్నాను( నవ్వుతూ)
నాని గారు క్రికెటర్ మురళీధరన్ గారు మీరు తన ఫేవరెట్ యాక్టర్ ని చెప్పినపుడు ఎలా అనిపించింది ?
మురళీధరన్ గారు గ్రేట్ బౌలర్. చిన్నప్పుడు ఆయన ఆట ని చూశాం. ఆయన మాట్లాడుతూ నా గురించి అలా చెప్పడం చాలా ఆనందంగా అనిపించింది.
డైరెక్టర్ శౌర్యువ్ గారు నాని గారి సినిమా అంటే చాలా భాద్యత ఉంటంది. బావుంటే ప్రసంశలు బాగాలేకపోతే ఆయన అభిమానులు నుంచి విమర్శలు కూడా వస్తాయి. మీరు ఎలా చేశారని భావిస్తున్నారు?
నిజానికి ఇంత ఆలోచించలేదు. ఒక మంచి కథ రాసి సినిమా తీశాం. సినిమా ఎలావుందో ప్రేక్షకులు చూసి చెప్పాలి. మొదటి సినిమానే పాన్ ఇండియా కావడం ఆనందంగా వుంది
శౌర్యువ్ గారు హాయ్ నాన్న అనే టైటిల్ పెట్టడానికి కారణం ?
నాని గారికి కథ చెప్పినప్పుడే కథ అంతా నాన్న చుట్టూ తిగిరిగింది. నిజానికి ఈ టైటిల్ కూడా నాని గారికే తట్టింది. ఆయనే ఈ టైటిల్ సూచించారు.
మోహన్ గారు మీ తొలి సినిమాకి నాని గారినే ఎందుకు ఎంపిక చేసుకున్నారు ?
మేము ఎంపిక చేసుకోవడం అనేది ఏమీ లేదండి. నాని గారు మాకు అవకాశం ఇచ్చారు. మేము సినిమా చేశాం.
హేషమ్ అబ్దుల్ వహాబ్ గారు ఈ సినిమాకి మ్యూజిక్ అందించడం ఎలా అనిపించిది ?
నాని గారితో హాయ్ నాన్నలో భాగం కావడం ఆనందంగా వుంది. ఈ పాటలన్నీ మిమ్మల్ని అలరిస్తాయనే నమ్మకం వుంది. కథకు తగట్టే మ్యూజిక్ ని అందిస్తాను. ప్రతి సినిమా ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్
విజయేందర్ రెడ్డి గారు సినిమా నిర్మాణంలోకి రావడానికి కారణం ?
సినిమా అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. సినిమా చేసే అవకాశం వచ్చింది. ఈ ప్రయాణాన్ని ఇంకా ముందుకు కొనసాగిస్తాం.
హాయ్ నాన్నా ఈ ఏడాది డిసెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
తారాగణం :
నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఖన్నా
సాంకేతిక విభాగం:
దర్శకత్వం: శౌర్యువ్
నిర్మాతలు: మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల
బ్యానర్: వైరా ఎంటర్టైన్మెంట్స్
డీవోపీ: సాను జాన్ వరుగుస్ ISC
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
ఎడిటర్: ప్రవీణ్ ఆంటోని