హీరో విక్టరీ వెంకటేష్ ఇంటర్వ్యూ
సైంధవ్ నా కెరీర్ లో చాలా డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ మూవీ. న్యూ ఏజ్ యాక్షన్, ఎమోషన్స్ తో ప్రేక్షకులని అలరిస్తుంది: విక్టరీ వెంకటేష్
విక్టరీ వెంకటేష్ 75 మైల్ స్టోన్, మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ సైంధవ్. వెరీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల వస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం జనవరి 13న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరో విక్టరీ వెంకటేష్ విలేకర్ల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
సైంధవ్ మీ లాండ్ మార్క్ 75వ సినిమా కదా.. ఆ ఒత్తిడి ఏమైనా ఉందా ?
నాకు ఆ ఒత్తిడి ఏమీ లేదు. 75 అనేది నెంబర్ మాత్రమే. అయితే ఒక కెరీర్ లో 50, 75, 100 నెంబర్స్ సహజంగానే ఒక మైల్ స్టోన్ లా అనుకోవచ్బు. నా వరకూ .. ఆ సమయానికి వచ్చింది నిజాయితీగా చేయాలని ప్రయత్నిస్తాను. ప్రతి సినిమా ప్రత్యేకమే. ప్రతి సినిమాకి కష్టపడి పని చేయాలి. ఇంకా చాలా దూరం ప్రయాణించాలి.
దర్శకుడు శైలేష్ కొలను కథ చెప్పినపుడు మీకు నచ్చిన అంశం ఏమిటి ?
చాలా బ్యుటీఫుల్ డాటర్ సెంటిమెంట్ వుంది. రెగ్యులర్ గా కాకుండా కథకు అవసరమైయ్యే ఎమోషనల్ యాక్షన్ సీక్వెన్స్ లు వున్నాయి. యాక్షన్ చాలా నేచురల్ గా వుంది. చాలా ఫాస్ట్ పేస్డ్ మూవీ ఇది. ఇది నాకు ఒక డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ మూవీ అవుతుందనిపించింది. దర్శకుడు శైలేష్ కొలను వర్క్ చేయడం చాలా మంచి అనుభూతి.
పిల్లలతో కలసి చాలా సినిమాలు చేశారు కదా.. బేబీ సారా నటన ఎలా అనిపించింది ?
పిల్లలతో కలసి పని చేయడం నాకు చాలా ఇష్టం. బేబీ సారాలో స్పార్క్ వుంది. అద్భుతంగా నటించింది.
సైంధవ్ కథకు సంబంధించి మీరేమైనా సూచనలు చేశారా ?
దర్శకుడు శైలేష్ చాలా మంచి కథతో వచ్చారు. ఒకసారి ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా టీంతో కలసిపోతాను. సాధారణమైన చర్చలు సహజంగానే జరుగుతుంటాయి. ఎక్కడైనా మెరుగుపరిచే అవకాశం వుందనిపిస్తే చెబుతాను. నా ద్రుష్టి మాత్రం నటనపైనే వుంటుంది.
సైంధవ్ లో చాలా డిఫరెంట్ గా కనిపిస్తారని, క్లైమాక్స్ సరికొత్తగా వుటుందని వినిపిస్తోంది ?
సైంధవ్ చాలా మంచి కథ. స్టొరీ నడిచే విధానం చాలా కొత్తగా వుంటుంది. క్లైమాక్స్ ని ఎక్స్ ట్రార్డినరీ గా డిజైన్ చేశారు. హైలీ ఎమోషనల్ గా వుంటుంది. యాక్షన్ సీక్వెన్స్ లని కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఇవన్నీ ఒక కొత్తదనం తీసుకొచ్చాయి.
ఈ సినిమా విషయానికి వస్తే ప్రమోషన్స్ లో స్టేజ్ పై డ్యాన్స్ చేశారు కదా ?
నాకు సహజంగానే సౌండ్ వింటే కాళ్ళు ఆడుతాయి. సడన్ గా వాసు పాట వేసేసరికి అలా వచ్చేసింది. ఆ బీట్ అలాంటిది (నవ్వుతూ)
సైంధవ్ పాత్రలో మీ ధర్మచక్రం పోలికలు ఉన్నాయా ?
లేదండీ. ఈ రెండు కంప్లీట్ గా డిఫరెంట్.
నవాజుద్దీన్ సిద్ధిఖి గారు ఈ సినిమాతో తెలుగులోకి వస్తున్నారు.. ఆయనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
నవాజుద్దీన్ సిద్ధిఖి గారితో పని చేయడం చాలా మంచి అనుభూతి. ఆయన ఎక్స్ ట్రార్డినరీ యాక్టర్. గ్యాంగ్స్ అఫ్ వాసేపూర్ నుంచి ఆయన ప్రయాణం చాలా విలక్షణంగా సాగుతోంది. సైంధవ్ లో చాలా క్రేజీ రోల్ చేశారు. మాములు సీక్వెన్స్ ని కూడా డిఫరెంట్ గా చేసే నటుడు ఆయన. ఇందులో చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇందులో ప్రతి పాత్రకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత వుంటుంది.
ఈ చిత్రంలో ఇంద్రప్రస్థ అనే ఫిక్షన్ సిటీ, డ్రగ్ కార్టేల్, గన్స్ డీలింగ్ ఇవన్నీ చూస్తుంటే హాలీవుడ్ తరహాలో ఒక కొత్తతరం సినిమా అనిపిస్తోంది.. ఈ తరహా సినిమా చేయడం మీకు కూడా కొత్త అనిపిస్తోంది ? దీనికి ఎలా చూస్తారు ?
ఇలాంటి సినిమా నాకూ కొత్తే. డైరెక్టర్ క్రియేటివ్ టీం చాలా కొత్త ఆలోచనతో వచ్చారు. సైంధవ్ వరల్డ్ బిల్డింగ్ చాలా డిఫరెంట్ గా వుంటుంది. సైంధవ్ తర్వాత ఈ తరహాలో ఇంకొన్ని కథలు వచ్చే అవకాశం వుంది.
సైంధవ్ లో సంగీతంకు ఎంత ప్రాధన్యత వుంటుంది ?
సంతోష్ నారాయణ్ అద్భుతమైన మ్యూజిక్ చేశారు. నేపధ్య సంగీతం ఎక్స్ లెంట్ గా వుంటుంది. రాంగ్ యూసెజ్, సరదాలే పాటలు అద్భుతంగా వచ్చాయి. లిరిక్స్ కూడా చాలా చక్కగా కుదిరాయి.
75 సినిమాల కెరీర్ లో ఒక్క వివాదం కూడా లేకుండా మీ ప్రయాణం సాగడం ఎలా సాధ్యమైయింది?
అది ఎలా అని తెలుసుంటే అందరికీ చెప్పేవాడిని( నవ్వుతూ). నిజంగా నాకు తెలీదు. చిన్నప్పటి నుంచి ఎవరికీ అసౌకర్యం కలిగించకూడదనే మనస్తత్వం నాది. స్కూల్, కాలేజీలో కూడా ఇలానే ఉండేవాడిని.
నాని గారితో సినిమా చేస్తున్నారని విన్నాం ? మీరు, నానిగారితో కలసి సినిమా చేయాలని నిర్మాత వెంకట్ గారి డ్రీమ్ ?
చేద్దాం. అన్నీ చేసేద్దాం (నవ్వుతూ)
స్వామి వివేకనంద సినిమా గురించి ?
ఆ స్క్రిప్ట్ ఒక లెవల్ వరకు వచ్చింది. ఇద్దరు మేకర్స్ చేస్తున్నారు. అయితే స్క్రిప్ట్ పై వాళ్ళకి పూర్తి స్థాయి సంతృప్తి రాలేదు.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా 11 ఏళ్ళు పూర్తి చేసుకుంది .. దానికి సీక్వెల్ చేసే ఆలోచన ఉందా ?
మొన్న ఎవరో ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఒకటి పెట్టారు. చాలా క్రేజీ గా వుంది. అందులో మహేష్, నేను వైల్డ్ గా కనిపిస్తున్నాం. వాళ్ళ ఆలోచనే పూర్తి డిఫరెంట్ గా వుంది. (నవ్వుతూ)
నెక్స్ట్ సినిమా గురించి ?
రెండు మూడు కథలు వున్నాయి. ఇంకా ఏమీ లాక్ చేయలేదు.
అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు వస్తున్నాయి. నాలుగు సినిమాలు అద్భుతంగా ఆడాలి. అందరూ ఆనందంగా వుండాలి. థాంక్ యూ సో మచ్.