హీరో శ్రీవిష్ణు ఇంటర్వ్యూ
సామజవరగమన అందరినీ కడుపుబ్బా నవ్వించే హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్: హీరో శ్రీవిష్ణు
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు, వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సామజవరగమనతో రాబోతున్నారు. హాస్య మూవీస్ బ్యానర్ పై ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ ట్రైలర్ పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. జూన్ 29న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో హీరో శ్రీవిష్ణు సామజవరగమన విశేషాలని విలేకరుల సమావేశంలో పంచుకున్నారు?
ప్రివ్యూస్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది ?
ప్రివ్యూస్ కి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కేవలం నవ్వించాలని ఉద్దేశంతో తీసిన చిత్రమిది. ఫ్యామిలీ, యూత్ కి చాలా నచ్చుతుంది. ప్రివ్యూస్ చూసిన ప్రేక్షకులు నాన్ స్టాప్ గా నవ్వుతూనే వున్నారు. ఇది అవుట్ అండ్ అవుట్ క్లీన్ ఎంటర్ టైనర్. కడుపుబ్బా నవ్విస్తుంది. చాలా రిలీఫ్ గా వుంటుంది. ఇందులో మాటలు కూడా కొత్తగా వుంటాయి.
సామజవరగమన పాయింట్ ఏమిటి ?
పాయింట్ విషయానికి వస్తే తెలుగు సినిమాల్లో ఇప్పటివరకూ రాని పాయింటే చెబుతున్నాం. చాలా డిఫరెంట్ గా వుంటుంది. కొన్ని ఊహించని మలుపులు కూడా వుంటాయి. ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం వుంది.
ఫ్యామిలీస్ కి మూడు రోజుల ముందే చూపించారు కదా.. ఈఆలోచన ఎవరిది ?
టీం అంతా కలిసి చేసిన ఆలోచన. ఈ సినిమా కోసం ఆహ్వాన యాత్ర చేశాం. యాత్ర సమయంలో ఫ్యామిలీస్ ని కలిసినపుడు వారి కోసం ముందుగానే వేయాలని భావించాం.
సామజవరగమన టైటిల్ ఆలోచన ఎవరిది ?
బ్రోచేవారెవరురా, రాజరాజ చోర, అర్జున ఫల్గుణ.. ఇలా నా సినిమాల్లో కొంచెం సంస్కృతం టచ్ వుంటుంది. ఐతే తొలిసారి పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేస్తున్నాను. అందరికీ తెలిసిన టైటిల్ ఐతే బావుంటుందని అనుకున్నాం. సామజవరగమన ఐతే ఎలా ఉంటుందని అన్నప్పుడు అనిల్ గారికి చాలా నచ్చింది. సామజవరగమన టైటిల్ శంకరాభరణం, టాప్ హీరో, అల వైకుంఠపురం సినిమాల్లోని పాటలతో అందరికీ పరిచయం. అలాగే ఈ టైటిల్ కి పురాణ వృతాంతం వుంది. ఇంద్రుడు దగ్గర వున్న ఐరావతం నడకని పోలుస్తూ సామజవరగమన అనే వర్ణన చేశారు. శ్రీరాముడు కూడా అంత సొగసుగా నడుస్తారని వర్ణన వుంది.
నరేష్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
ఇంతకుముందు నరేష్ గారితో అర్జున ఫల్గుణలో కూడా చేశాను.సామజవరగమన లో నరేష్ గారి పాత్రకి యూత్ పిచ్చెక్కిపోతారు. తండ్రికొడుకుల అనుబంధం చాలా లైవ్లీగా హిలేరియస్ గా వుంటుంది. ఇందులో ఫ్యామిలీకి ప్రాధాన్యత ఇచ్చే పాత్రలో కనిపిస్తా.
టీ షర్టు పై చిరంజీవి గారి ఆటోగ్రాఫ్ తీసుకోవడం ఎలా అనిపించింది ?
చిరంజీవి గారిని ఇంతకుముందు దూరంగా చూశాను. దగ్గర నుంచి చూడటం అదే మొదటిసారి. బ్రోచేవారెవరురా, రాజరాజ చోర చిత్రాలు ఆయన చూశారు. రాజరాజ చోర చూసి పిలిపించినప్పుడు కోవిడ్ కేసుల వలన కుదరలేదు. అప్పుడు మిస్ అయ్యింది ఇప్పుడు కుదిరింది
వైరల్ అయిన ఫోన్ డైలాగ్ ని ఇందులో మళ్ళీ వాడటానికి కారణం ?
ఇందులో సినిమా మొత్తానికి ఒక హైలెట్ సీన్ వుంటుంది. ఆ సీన్ కి ముగింపు ఈ డైలాగ్ తో వుంటుంది. మనం బిజీగా ఉన్నప్పుడు కొంతమంది ఫోన్ చేసి అసలు మేటర్ చెప్పకుండా ఏదోదో మాట్లాడుతుంటారు. అప్పుడు ఎవరికైనా చిరాకు వస్తుంది. ఇందులో హీరో కూడా అలాంటి పరిస్థితిలో వున్నప్పుడు అలాంటి కాల్ వస్తుంది. ఇది థియేటర్ లో చూసినపుడు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇందులో చాలా మంచి డైలాగులు వున్నాయి. హీరో క్యారెక్టర్ ప్రకారం బాక్సాఫీసు వద్ద పని చేస్తుంటాడు. తన మాటల్లో సినిమాలకి సంబధించిన డైలాగులు వుంటాయి. దాదాపు అందరి హీరోల డైలాగులు వాడాం.
హాస్య మూవీస్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ తో పని చేయడం ఎలా అనిపించింది ?
చాలా కంఫర్ట్ బుల్ గా పని చేశాం. చాలా క్రియేటివ్ ఫ్రీడమ్ ఇస్తారు. అలాగే అనుకున్నదాని కంటే భారీగా తీశారు. నేను మొదట సాంగ్స్ ని మాంటేజస్ లా చేద్దామని అనుకున్నాను. ఐతే నిర్మాతలు రాజీపడకుండా మస్కట్ తీసుకెళ్ళి పాటలు షూట్ చేశారు. ఐతే జనవరి, ఫిబ్రవరి అంటే వింటర్ అనే అపోహతో అక్కడికి వెళ్లాను. కానీ అక్కడ అది మండు వేసవి. ఎండలకు దొరికిపోయాం( నవ్వుతూ).
హీరోయిన్ పాత్ర కూడా ఫుల్ లెంత్ వున్నట్లుగా అనిపిస్తుంది ? మీ కెమిస్ట్రీ ఎలా వుంటుంది ?
హీరోయిన్ గా చేసిన రెబా మోనికా జాన్ తెలుగు కి కొత్త. హీరోయిన్ పాత్రలో కూడా చాలా ఫన్ వుంటుంది. తను చాలా చక్కగా నటించింది.
కొత్త ప్రాజెక్ట్స్ గురించి ?
హుషారు ఫేం హర్షతో యువీ లో ఒక సినిమా చేస్తున్నా. రాజరాజ చొర కి ప్రీక్వెల్ చేస్తున్నా.
ఆల్ ది బెస్ట్
థాంక్స్