హీరోయిన్ కశ్మీర పరదేశి ఇంటర్వ్యూ
అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సినిమా వినరో భాగ్యము విష్ణు కథ హీరోయిన్ కశ్మీర పరదేశి ఇంటర్వ్యూ
శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 18 న గ్రాండ్ రిలీజ్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కిరణ్ అబ్బవరం, కాశ్మీర పరదేశి జంటగా మురళి కిషోర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న సినిమా వినరో భాగ్యము విష్ణు కథ. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ,18 పేజెస్ లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత జీఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణు కథ.ఈ చిత్రం నుండి రిలీజైన సాంగ్స్, టీజర్ అన్ని మంచి అంచనాలను క్రియేట్ చేసాయి. అలానే రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచింది. మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కాబోతున్న సందర్బంగా చిత్ర హీరోయిన్ కశ్మీర పరదేశి విలేకర్లతో మాట్లాడుతూ.
మాది మహారాష్ట్ర రాజ్ పుత్ వంశానికి చెందిన నేను ఫ్యాషన్ స్టూడెంట్ ను. నటనపై ఉన్న ఇష్టంతో థియేటర్ ఆర్ట్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత నాకు 2018లో నాగశౌర్య హీరోగా నటించిన నర్తనశాల సినిమాలో నటించే అవకాశం రావడం జరిగింది.ఆ సినిమా తర్వాత డ్యాన్స్ పరంగా యాక్టింగ్ పరంగా ఇలా అన్ని రకాలుగా నాలో చాలా ఇంప్రూమెంట్ వచ్చింది.
నర్తనశాల సినిమా తర్వాత తిరుపతి నేపద్యంలో ఉన్న ఈ సినిమా కథ వినగానే నాకు నచ్చి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. ఎందుకంటే నాకు తిరుపతితో ఎక్కువ అటాచ్మెంట్ ఉంది. ఈ సినిమా చెయ్యడం వలన నాకు పాజిటివ్ వైబ్రేషన్స్ రావడం ఒక ఎత్తయితే గీతా ఆర్ట్స్ లో సినిమా చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. గీతా ఆర్ట్స్ లో చేయడం నాకు చాలా కంఫర్టబుల్ గా ఉంది.వాళ్ళు నన్ను చాలా బాగా చూసుకున్నారు.
ఈ సినిమాలో నేను దర్శన పాత్రలో మంచి స్కోప్ ఉన్న పాత్రలో నటించాను. నెంబర్ నైబరింగ్ కాన్సప్ట్ తో వస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులందరినీ కచ్చితంగా అలరిస్తుందనే నమ్మకం ఉంది. అలాగే ఈ సినిమా కొరకు షూటింగ్ మధ్యలో మరియు షూటింగ్ తర్వాత కూడా సినిమా ప్రమోషన్ లో భాగంగా మురళీ శర్మ లాంటి సీనియర్ యాక్టర్ తో రీల్స్ చేయడం జరిగింది. దీనివల్ల చాలా ఎంజాయ్ చేశాను
నేను మరాఠి అయినా నాకు తెలుగు సినిమాలు అంటే చాలా ఇష్టం ఎందుకంటే తెలుగు సినిమాలు మంచి కంటెంట్ తో పాటు కమర్షియల్ యాక్సెప్ట్ లో వెళ్లి ప్రేక్షకులందరినీ అలరిస్తాయి. ఇలా చేయడం చాలా రిస్క్ అయినా ఛాలెంజింగ్ గా తీసుకొని చాలా చక్కగా తెరకెక్కిస్తారు. అయితే మరాఠీ సినిమాలు ఇందుకు భిన్నంగా ఉంటాయి. అక్కడ సినిమాలు కమర్షియల్ గా కాకుండా ఎక్కువ రియలిస్టిక్ ను బేస్ చేసుకొని సినిమాలు తీస్తారు.
ఈ సినిమా తర్వాత తెలుగు లో ఒక సినిమా కథ చర్చలు నడుస్తున్నాయి. అలాగే తమిళంలో ఓ సినిమా, హిందీలో ఓ సినిమా చేస్తున్నాను అని ముగించారు.