Reading Time: < 1 min

హీరోయిన్ కాజల్ అగర్వాల్ కొత్త చిత్రం గ్లింప్స్ రేపు విడుదల

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మరొక సినిమా తో తిరిగి ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. తన నెక్స్ట్ చిత్రం కాజల్ 60 లో ఆమె ఒక పవర్ ఫుల్ పాత్రలో వెండి తెరపై కనిపించడానికి సిద్ధంగా ఉంది. తాజాగా జూన్ 19 న ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్ర నిర్మాతలు రేపు ఒక గ్లింప్స్ వీడియో ను విడుదల చేయనున్నారు.

అఖిల్ డేగల సినిమా కి దర్శకత్వం వహించారు. ఇందులో కాజల్ మునుపెన్నడూ కనిపించని విధంగా ప్రేక్షకులు ఇష్టపడే పాత్రలో కనిపించనుంది.

అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క ఈ చిత్రాన్ని తమ ప్రొడక్షన్‌ లో మొదటి సినిమా గా నిర్మిస్తున్నారు. సినిమా సమర్పకుడు శశి కిరణ్ తిక్క ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే కూడా అందించారు. శ్రీ చరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

తారాగణం:

కాజల్ అగర్వాల్

సాంకేతికవర్గం :

బ్యానర్: అవురమ్ ఆర్ట్స్
సమ ర్ప కులు : శశి కిరణ్ తిక్క
నిర్మాతలు : బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి
స్క్రీన్ ప్లే: శశి కిరణ్ తిక్క
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
దర్శకుడు: అఖిల్ డేగల