అల త్రివిక్రమ్ రచనలో ఓ ఇంగ్లీష్ డైలాగు

Published On: April 16, 2020   |   Posted By:

అల త్రివిక్రమ్ రచనలో ఓ ఇంగ్లీష్ డైలాగు

Okay, the way I see it, I got three choices. One, I can shoot him. Two, I can kick the crap out of him. Or three… I leave you. Well, all that’s no good. You see, ’cause none of those options get me you. And in spite of everything, I love you.

ఇలాంటి డైలాగే మీరు ఎక్కడో విన్నట్లు ఉంది కదా.. నోట్ బుక్ అనే హాలీవుడ్ క్లాసిక్ లోది. అబ్బే మేము ఆ సినిమా చూడలేదు కానీ ఈ డైలాగు మాత్రం విన్నాము అంటారా. యస్..మీ ఆలోచన కరెక్టే.. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్టైన ..అల వైకుంఠ పురములో చిత్రంలో ఈ తరహా డైలాగు మనకు కనపడుతుంది. సినిమాలో ఓ కీలకమైన సన్నివేశంలో ..బ్రహ్మాజీతో అల్లు అర్జున్ మాట్లాడుతూ..

“కాదు కూడదు అనుకుంటే మాత్రం నా దగ్గర మూడు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మీ వాళ్లను కొట్టి మిమ్మల్ని కంట్రోలు చేయటం, రెండు మిమ్మల్ని కొట్టి మిమ్మల్నే కంట్రోలు చేయటం. మూడు నేను కొడతానామో అని డౌట్ వచ్చి మీరే కంట్రోలు అయ్యిపోవటం. కంట్రోలు కామన్ అనుకుంటున్నారేమో ..కాదు నేను కొట్టడం కామన్. గొప్పదో, చెత్తదో, మనోమోక ఆఫర్ ఇచ్చాక అయ్యా మాకొద్దు అంటే దానర్థం వద్దు అని” అంటూ అద్బుతమైన డైలాగు చెప్తాడు.

అంటే ఇప్పుడు ఫలానా సినిమాలో ..ఫలానా సీన్ ని త్రివిక్రమ్ కాపీ కొట్టాడు అని ఎత్తిచూపటానికి కాదు ఈ సీన్ గుర్తు చేస్తోంది. త్రివిక్రమ్ లోని ప్రతిభను మరోసారి ఎత్తటానికి. ఆయన ప్రేరణ పొందే తీరుని అభినందింటానికి.

అందరూ సినిమాలు చూస్తారు. కానీ కొందరే గుర్తుపెట్టుకుంటారు. మరికొందరు ఆ గుర్తు పెట్టుకున్న దాని స్పూర్తితో మరొకటి క్రియేట్ చేస్తారు. ఏదీ ఊరికినే రాదు అని మన పెద్దలు చెప్తారు. అలాగే ఏదీ గాలి లోంచి పుట్టదు. ఎక్కడో చోట చిన్న ప్రేరణ ఉంటుంది. ఆ మొలక ను నీళ్లు పోసి, మొక్కగా ఎదిగేలా చేసి పూలు పూయించటమే అసలైన క్రియేటర్ చేయగలుగుతాడు.

త్రివిక్రమ్ దగ్గర ఆ సుగుణం ఉంది. తనకు నచ్చిన దాన్ని మనసులో పడేసి, అవసరం వచ్చినప్పుడు దాన్ని అద్బుతంగా ప్రెజెంట్ చేసి, అసలు మొదలెట్టినవాడు కూడా అరెరే భలే ఉంది…మనం దీన్ని లేపేద్దా అనిపించేలా చేయగలడు. అందుకే త్రివిక్రమ్ తెలుగు సినిమా పాలిట త్రివిక్రముడు అయ్యాడు.