Telugu News

వైభ‌వంగా వ‌ర‌ల్డ్ ఫొటోగ్ర‌పీ డే ఉత్స‌వాలు

వైభ‌వంగా `వ‌ర‌ల్డ్ ఫొటోగ్ర‌పీ డే` ఉత్స‌వాలు తెలుగు సినీ స్టిల్ ఫొటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ త‌ర‌ఫున 181వ వ‌ర‌ల్డ్ ఫొటోగ్ర‌ఫీ డే ఉత్స‌వాలు  హైద‌రాబాద్ ఎల్లారెడ్డిగూడ‌ నాగార్జున న‌గ‌ర్‌లోని నాగార్జున న‌గ‌ర్ వెల్ఫేర్ అసోసియేష‌న్‌లో సోమ‌వారంవైభ‌వంగా జ‌రిగాయి. తెలుగు సినిమా స్టిల్ ఫొటోగ్రాఫ‌ర్ల అధ్య‌క్షుడు  జి .శ్రీను , జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కే శ్రీను, వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు .య‌స్‌, ట్రెజ‌ర‌ర్ వీర‌భ‌ద్ర‌మ్ త‌దిత‌రుల ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈకార్య‌క్ర‌మానికి న‌ట‌కిరీటి డా.రాజేంద్ర‌ప్ర‌సాద్‌, `అల్ల‌రి` న‌రేష్‌, వైవీయ‌స్ చౌద‌రి, ర‌సూల్ ఎల్లోర్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఇదే వేదిక మీద‌ సీనియ‌ర్ ఫొటోగ్రాఫ‌ర్లు శ్యామ‌ల్ రావు, శ్యామ్‌నుస‌త్క‌రించారు.  సినీ స్టిల్ ఫొటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ స‌భ్యులంద‌రూ ఈ వేడుక‌లో పాల్గొన్నారు.  న‌ట కిరీటి డా. రాజేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ “మూడు త‌రాల స్టిల్ ఫొటోగ్రాఫ‌ర్ల‌తో నాకు అనుబంధం ఉంది. వాళ్లు నాకు ఫ్యామిలీలాంటివాళ్లు. ఒక‌ప్పుడు ఫొటోల‌తోనే నా ప‌బ్లిసిటీ న‌డిచింది. వ‌ర‌ల్డ్ఫొటోగ్ర‌పీడే సంద‌ర్భంగా ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌డం, దానికి న‌న్ను ఆహ్వానించ‌డం చాలా ఆనందంగా ఉంది. బి.ఎన్‌.రెడ్డిగారు, ఎన్టీఆర్‌గారు… ఇలా ఎంతో మంది లెజెండ్స్ తో నాకు ప‌రిచ‌యం ఉంది. వారంద‌రితో నాకున్న ఫొటోలు చూసుకుని ఆనాటి విష‌యాల‌ను గుర్తుచేసుకుని ఆనందిస్తుంటాను. ఇప్పుడే కాదు, స్టిల్ ఫొటోగ్రాఫ‌ర్ల అసోసియేష‌న్ త‌ర‌ఫున వాళ్లు ఎప్పుడు పిలిచినా, నేను రావ‌డానికిసిద్ధంగా ఉంటాను. ఈ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం కావాలి“ అని చెప్పారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వైవీయ‌స్ చౌద‌రి మాట్లాడుతూ “ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, సావిత్రి… ఇలాంటి లెజెండ్స్ ఎవ‌రైనా  ఫొటోగ్రాఫ‌ర్లు తీసిన అంద‌మైన స్టిల్స్ ద్వారా వెలుగులోకి వ‌చ్చిన‌వాళ్లే. స్టిల్ ఫొటోగ్రాఫ‌ర్లంటేనాకు ప్ర‌త్యేక‌మైన అభిమానం. పాట‌లు జ‌రిగేట‌ప్పుడు, సీన్లు జ‌రిగేట‌ప్పుడు లొకేష‌న్ల‌లో ఫొటోలు తీయ‌డానికి మాత్ర‌మే వారు ప‌రిమితం కాదు. ద‌ర్శ‌కుడి ఊహ‌కు అనుగుణంగా కొన్ని సార్లు ఆర్ట్డైర‌క్ట‌ర్ల‌కు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఏ చిత్రానికి ప‌నిచేసినా, దాన్ని సొంత సినిమాగా భావించి ప‌నిచేస్తారు“ అని తెలిపారు. ప్ర‌ముఖ ఛాయాగ్రాహ‌కుడు, డైర‌క్ట‌ర్ ర‌సూల్‌ ఎల్లోర్ మాట్లాడుతూ “స్టిల్ ఫొటోగ్రాఫ‌ర్లు నాకు సోద‌రులులాంటివాళ్లు. వాళ్ల  కార్య‌క్ర‌మానికి న‌న్ను పిల‌వ‌డం గౌర‌వంగా భావిస్తున్నా. చరిత్ర రాయ‌డానికిఫొటోగ్ర‌ఫీ ముఖ్య ఆధారం“ అని చెప్పారు. సినీ స్టిల్ ఫొటోగ్రాఫ‌ర్ల‌తో త‌న‌కున్న అసోసియేష‌న్‌ను ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్‌, హీరో `అల్ల‌రి` న‌రేష్ గుర్తుచేసుకున్నారు.        

మంచు లక్ష్మి విడుదల చేసిన హవా థీమ్ సాంగ్

మంచు లక్ష్మి విడుదల చేసిన ‘హవా’థీమ్ సాంగ్ డిఫరెంట్ స్టోరీస్ అనే మాట తరచూ వింటుంటాం.. కానీ అలా అనిపించుకున్న సినిమాలు తక్కువే. అయితే మోషన్ టీజర్ నుంచే మోస్ట్ ఇన్నోవేటివ్అనిపించుకున్న సినిమా ‘హవా’. ఒక వైవిధ్యమైన ప్రయత్నంగా వస్తోన్న ఈ […]

సెప్టెంబరు 6 న తారామణి విడుదల

సెప్టెంబరు 6 న ‘తారామణి” విడుదల   అంజ‌లి, ఆండ్రియా, వ‌సంత్ ర‌వి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం `తారామ‌ణి`. రామ్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని జె.ఎస్.కె ఫిలిం కార్పొరేషన్ సమర్పణలొ డి.వి.సినీ క్రియేష‌న్స్ మరియు లక్ష్మీ వెంకటేశ్వర ఫ్రేమ్స్  బ్యాన‌ర్‌పై  […]

తెలుగు సినీ ప్రొడక్షన్‌ఎగ్జిక్యూటివ్స్‌ యూనియన్‌ రజతోత్సవ వేడుక

తెలుగు సినీ ప్రొడక్షన్‌ఎగ్జిక్యూటివ్స్‌ యూనియన్‌ రజతోత్సవ వేడుక సెప్టెంబర్‌ 8న జరిగే తెలుగు సినీరథసారథులరజతోత్సవ వేడుకకు మా వంతు సహాకారం అందిస్తాం… నిర్మాతల మండలి అధ్యక్షుడు సి కళ్యాణ్‌.  సినీ నిర్మాణంలో ప్రొడక్షన్‌ఎగ్జిక్యూటివ్స్‌ కీలక పాత్ర వహిస్తారు. అలాంటి తెలుగు సినీ […]

బోయ్ చిత్రం ఆగస్ట్ విడుదల

బోయ్ చిత్రం ఆగస్ట్ విడుదల ఆగస్ట్ 23న విడుదల కానున్న విశ్వరాజ్ క్రియేషన్స్ బోయ్ చిత్రం..  లక్ష్య, సాహితి ప్రధాన పాత్రల్లో విశ్వరాజ్ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కిన సినిమా బోయ్. హై స్కూల్ ఆఖరి రోజుల్లో ఓ విద్యార్థి జీవితం ఎలా […]

ఎవరు సినిమా ప్రెస్ మీట్

ఎవరు సినిమా ప్రెస్ మీట్   ఎవరు` సక్సెస్‌తో న్యూ జనరేషన్ హీరోలకు శేష్ ఓ బెస్ట్ ఎంగ్జాంపుల్‌గా నిలిచాడు – హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు    అడివిశేష్, రెజీనా కసండ్ర, నవీన్ చంద్ర ప్రధాన తారాగణంగా ప్రముఖ నిర్మాణ […]

పరారి చిత్రం షూటింగ్‌ పూర్తి

పరారి చిత్రం షూటింగ్‌ పూర్తి వినోదాత్మక కుటుంబకథా చిత్రం పరారి యోగేశ్వర్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘పరారి’. ”రన్‌ ఫర్‌ ఫన్‌” అనేది ఉప శీర్షిక. అతిథి హీరోయిన్‌గా నటిస్తోంది. సాయి శివాజీ దర్శకుడు. శ్రీ శంకర ఆర్ట్స్‌ పతాకంపై […]

గీత గోవిందం సినిమా ఏడాది పూర్తి

గీత గోవిందం సినిమా ఏడాది పూర్తి ఏడాది పూర్తి చేసుకున్న  బ్లాక్ బస్టర్ గీత గోవిందం  మెగా  నిర్మాత శ్రీ అల్లు  అరవింద్ గారి సమర్పణలో  GA 2  పిక్చర్స్ పతకం పై సక్సెసఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన సినిమా […]

నిన్ను తలచి సినిమా సెప్టెంబర్ లో రిలీజ్

నిన్ను తలచి సినిమా సెప్టెంబర్ లో రిలీజ్   సెప్టెంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న ఫీల్ గుడ్ లవ్ స్టోరీ “నిన్ను తలచి”   ఎస్ ఎల్ యెన్ ప్రొడక్షన్స్, నేదురుమల్లి ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఓబిలేష్ మొదిగిరి, నేదురుమల్లి […]