ఆహా ఫిల్మ్ మెయిల్ న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2021కి ఎంపిక

Published On: May 13, 2021   |   Posted By:
ఆహా ఫిల్మ్ మెయిల్ న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2021కి ఎంపిక
 
న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2021కి ఎంపికైన ‘ఆహా’ ఒరిజిన‌ల్ ఫిల్మ్ ‘మెయిల్’
 
ప్రియదర్శి, హర్షిత్ , గౌరీ ప్రియ‌ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ‘ఆహా’ ఒరిజినల్ మూవీ ‘మెయిల్’(చాపర్ట్1- కంబాలపల్లి కథలు). ఉదయ్ గుర్రాల దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఈ ఏడాది ప్రారంభంలో ‘ఆహా’లో విడుదలైంది. ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది.  ప్రస్తుతం ఈ చిత్రానికి అరుదైన గుర్తింపు దక్కింది. జూన్‌లో నిర్వహించబోయే న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్(ఎన్‌వైఐఎఫ్‌ఎఫ్)2021కు ఈ చిత్రం ఎంపికైంది. గొప్ప లెగసీతో చాలా కాలం నుంచి నిర్వహించబడుతున్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సినిమాలు, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిలింస్, ఇండిపెండెంట్, ఆర్ట్ మూవీస్ ఇలా అన్నీ విభాగాలకు చెందిన సినిమాలను ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శనకు ‘మెయిల్’ సినిమా ఎంపిక కావడంపై చిత్ర యూనిట్, ఆహా యాజమాన్యం తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 
 
2000 సంవత్సరం ప్రారంభంలో.. ఇంటర్నెట్ శకం ప్రారంభ‌మ‌వుతున్న టైమ్‌లోతెలంగాణ‌లోని ఓ అంద‌మైన ప‌ల్లెటూరిలో జరిగే క‌థే ‘మెయిల్’ సినిమా. కాలేజీ కుర్రాడు రవికి కంప్యూటర్ అంటే ఎంతో ఆసక్తి ఉంటుంది. అదే సమయంలో ఆ గ్రామంలో గేమింగ్ సెంటర్‌ను నిర్వహించే హైబత్ అనే వ్యక్తితో రవికి ఎలా అనుబంధం ఉంటుందో సినిమా తెలియజేస్తుంది. డిజిటల్ యుగం ప్రారంభమవుతున్న సమయంలో పల్లెటూరిలో ఉండే అమాయకత్వం, హాస్యం, భావోద్వేగాల కలయికను ‘మెయిల్’ సినిమాలో చూడొచ్చు. ఇప్పుడు న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2021కి ‘మెయిల్’ సినిమా ఎంపిక కావడమనేది ప్రపంచ వాప్తంగా ఉన్న సినీ అభిమానులకు ఈ సినిమా రీచ్ అవుతుందనడనడంలో సందేహం లేదు. 
 
న‌టీన‌టులు: 
 
ప్రియ‌ద‌ర్శి, హ‌ర్షిత్‌, మ‌ణి, గౌరి, స‌న్నీ ప‌ల్లె, గిరిజా త‌దిత‌రులు
 
సాంకేతిక నిపుణులు:
 
స్వప్న సినిమా
దర్శకత్వం: ఉద‌య్ గుర్రాల‌
సినిమాటోగ్రఫీ: ఉద‌య్ గుర్రాల‌, శ్యామ్ 
మ్యూజిక్‌:  స్వీకార్ అగ‌స్తి
ఎడిట‌ర్‌:  హ‌రి శంక‌ర్ టి.ఎన్‌
బి.జి.ఎం:  క‌మ్రాన్‌
కాస్ట్యూమ్స్‌:  అశ్వ‌న్‌