ఒరేయ్‌ బుజ్జిగా చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్

Published On: September 30, 2020   |   Posted By:

ఒరేయ్‌ బుజ్జిగా చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్

అక్టోబ‌ర్1 సాయంత్రం 6 గంట‌ల నుండి ఆహాలో యంగ్ హీరో రాజ్ త‌రుణ్  ఒరేయ్‌ బుజ్జిగా

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న చిత్రం  ‘ఒరేయ్‌ బుజ్జిగా…`. రొమ్‌కామ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం  అక్టోబ‌ర్ 1 సాయంత్రం 6 గంట‌లకు  అతి తక్కువ సమయంలోనే  తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని దక్కించుకున్న ఆహా ఓటీటీలో విడుద‌ల‌వ‌నుంది. ఇప్ప‌టికే  టాలెంటెడ్ మ్యాజిక్ డైరెక్ట‌ర్‌ అనూప్ రూబెన్స్ స్వ‌ర ప‌రిచిన అన్ని పాట‌లు సంగీతాభిమానుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ హైద‌రాబాద్ ట్రైడెంట్ హోట‌ల్‌లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా..

న‌టుడు మ‌ధు నంద‌న్ మాట్లాడుతూ – “ఈ ఈవెంట్ చూస్తుంటే మ‌ళ్లీ మ‌నం క‌మ్‌బ్యాక్ అయ్యాం అనే ఫీలింగ్ క‌లుగుతోంది. మ‌మ్మ‌ల్నంద‌రినీ న‌మ్మి ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు, అలాగే  ఈరోజు ఇంత మంచి ఈవెంట్ చేస్తున్న శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ అధినేత కె.కె రాధామోహ‌న్ గారికి నా హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. ఈ సినిమా ఒక బ్యూటిఫుల్ జ‌ర్నీ. ఈ సినిమాతో హండ్రెడ్ ప‌ర్సెంట్ టీమ్ అంద‌రం  స‌క్సెస్ సాధిస్తామ‌నే న‌మ్మ‌కం ఉంది. సినిమా చాలా బాగా వ‌చ్చింది. డిజిట‌ల్ ఫ్లాట్ ఫామ్‌లో వ‌స్తోన్న ఫ‌స్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ఒరేయ్ బుజ్జిగా..ఈ అవ‌కాశం ఇచ్చిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు“అన్నారు.

సినిమాటోగ్రాఫ‌ర్ ఐ. ఆండ్రూ మాట్లాడుతూ  – “ద‌ర్శ‌కుడు విజ‌య్ గారితో ఇది నా మూడ‌వ ‌సినిమా. ప్రొడ్యూస‌ర్  రాధామోహ‌న్‌‌
గారు చాలా ఫ్రీడ‌మ్ ఇచ్చారు. దాని వ‌ల్లే అవుట్ పుట్ చాలా బాగా వ‌చ్చింది. ఈ కోవిడ్ టైమ్‌లో ఒక మంచి ఎంట‌ర్‌టైన‌ర్ అవుతుంది. రాజ్ త‌రుణ్‌, మాళ‌విక‌, హెబా ప్ర‌తి ఒక్క‌రు చ‌క్క‌గా న‌టించారు. ఈ సినిమా త‌ప్ప‌కుండా బిగ్గెస్ట్ హిట్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాను“ అన్నారు.

హీరో స‌ప్త‌గిరి మా‌ట్లాడుతూ – “ఐదు నెలలు డార్క్ డేస్‌ త‌ర్వాత ఈ స్టేజి మీద నిల‌బ‌డి మాట్లాడ‌డం చాలా బాగుంది. ఈ సినిమాలో ఒక సీక్వెన్స్ మెత్తం మిమ్మ‌ల్నంద‌రిని హిలేరియ‌స్‌గా న‌వ్వించ‌బోతున్నాం. బాస్ బామ్మ‌ర్ది అనే క్యారెక్ట‌ర్లో ఈ సినిమాలో క‌న‌ప‌డ‌బోతున్నాను. నేను, రాజ్‌త‌రుణ్‌, పోసాని, మాళ‌విక‌, న‌రేష్‌గారు చేసిన ఆ సీక్వెన్స్ మిమ్మ‌ల్ని క‌డుపుబ్బా న‌వ్వించి ప‌దే ప‌దే మాట్లాడుకునే విధంగా ఉంటుంది.  ఇంత మంచి క్యారెక్ట‌ర్ ఇచ్చిన విజ‌య్ గారికి, రాధా మోహ‌న్‌గారికి ధ‌న్య‌వాదాలు“ అన్నారు.

న‌టి సిరి మాట్లాడుతూ  – “ఈ సినిమాలో నాకు అవ‌కాశం ఇచ్చిన రాధామోహ‌న్ గారికి, విజ‌య్ గారికి థ్యాంక్యూ వెరీ మ‌చ్‌. ఈ మూవీతో టీమ్ అంద‌రూ నాకు ఫ్రెండ్స్ అయ్యారు“ అన్నారు.

శేఖ‌ర్ మాస్ట‌ర్ మాట్లాడుతూ – ఇలాంటి ఫంక్ష‌న్స్ చూసి చాలా రోజులైంది. విజ‌య్ గారు త‌ను డైరెక్ట్ చేసిన మూడు సినిమాల్లో అన్ని పాట‌లు నాతోనే కొరియోగ్ర‌ఫి చేపించారు. ఈ సినిమాలో అవ‌కాశం ఇచ్చిన రాధా మోహ‌న్ గారికి, విజ‌య్ గారికి ఈ సంద‌ర్భంగా నా కృత‌జ్ఞ‌త‌లు. ఆండ్రూ గారి ఫోటోగ్ర‌ఫీకి నాతో పాటు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమాలో అన్ని సాంగ్స్ చాలా బాగా పిక్చ‌రైజ్ చేశారు.  ఈ సినిమాతో రాజ్ త‌రుణ్ మంచి డ్యాన్స‌ర్ అని మ‌రోసారి ప్రూవ్ చేసుకుంటాడు. అనూప్ అన్ని మంచి ట్యూన్స్ ఇచ్చారు. మాళ‌విక చ‌క్క‌గా న‌టించింది“ అన్నారు.

హీరోయిన్ మాళ‌విక నాయ‌ర్ మాట్లాడుతూ  – “ఒక మంచి సినిమాని మీ అంద‌రికీ చూపించ‌బోతున్నందుకు హ్యాపీగా ఉంది.  ఈ మూవీ రావ‌డానికి ఇది ప‌ర్‌ఫెక్ట్ టైమ్ అని నేను భావిస్తున్నాను. అక్టోబ‌ర్2 న నేను కూడా మీ అంద‌రిలాగే  మా ఫ్యామిలీతో క‌లిసి ఈ సినిమా చూడ‌బోతున్నాను. అంద‌రూ సినిమా చూడండి. ఈ అవ‌కాశం ఇచ్చిన విజ‌య్ గారికి, రాధా మోహ‌న్ గారికి థ్యాంక్యూ వెరీ మ‌చ్“ అన్నారు.

హీరోయిన్ హెబా ప‌టేల్ మాట్లాడుతూ  – ` ఒరేయ్ బుజ్జిగా ఒక ఫ‌న్ రైడ్‌.  నా కెరీర్‌లో 90ప‌ర్సెంట్ రాజ్‌త‌రుణ్‌తో క‌లిసి న‌టించాను. ఆయ‌న‌తో క‌లిసి న‌టించ‌డం హ్యాపీగా ఉంది. అలాగే మాళ‌విక  క్యారెక్ట‌ర్ ఈ సినిమాలో చాలా బాగుంటుంది. విజ‌య్ గారు ఇంట‌లీజెంట్ డైరెక్ట‌ర్‌. నా త‌దుప‌రి చిత్రాన్ని కూడా రాధా మోహ‌న్ గారే నిర్మిస్తున్నారు. ఆయ‌న‌కు నా ధ‌న్య‌వాదాలు.
అక్టోబ‌ర్‌2 న అంద‌రూ సినిమా చూడండి“ అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ – “ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ చేస్తుండ‌గానే లాక్‌డౌన్ మొద‌లైంది. మ‌ళ్ళీ ఈ సినిమాతో ప్ర‌మోష‌న్స్ మొద‌లవ్వ‌డం హ్యాపీగా ఉంది. మ‌ళ్లీ సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి అనే హోప్ ఈ ఈవెంట్ అంద‌రికీ ఇచ్చింది. ఫుల్ లెంగ్త్ ఎంట‌ర్టైన‌ర్‌. ఇది విజ‌య్ తో నా మూడ‌వ చిత్రం అలాగే రాజ్ తో నా రెండ‌వ సినిమా. మీ అంద‌రు త‌ప్ప‌క సినిమాని  ఇష్ట‌ప‌డ‌తారు. ఈ అవ‌కాశం ఇచ్చిన రాధా మోహ‌న్‌గారికి ధ‌న్య‌వాదాలు“అన్నారు.

ద‌ర్శ‌కుడు విజ‌య్‌కుమార్ కొండా మాట్లాడుతూ – “మూడు సంవ‌త్స‌రాల క్రితం నేను నెక్ట్స్ ఏం సినిమా చేయాలి అని ఆలోచ‌న వ‌చ్చిన‌ప్పుడు అంద‌రినీ న‌వ్వించే సినిమా చేయాలి అని డిసైడ్ అయ్యాను. అలా ఒక పాయంట్‌గా స్టార్ట్ చేసి నా స్నేహితుడు నంద్యాల ర‌వితో క‌లిసి చాలా రోజులు ట్రావెల్ చేసి ఈ క‌థ రాశాం.  మధ్య‌లో మ‌ధునంద‌న్, ప్ర‌కాశ్ మాకు హెల్ప్ చేశారు.  ఈ సినిమాలో డైలాగ్స్ ఇంత బాగున్నాయి అంటే దానికి కార‌ణం నంధ్యాల ర‌వి పెట్టిన ఎఫ‌ర్ట్‌. ఈ క‌థ ఎవ‌రితో తీస్తే బాగుంటుంది అనుకున్న‌ప్పుడు రాజ్‌త‌రుణ్ బెస్ట్ చాయిస్ అనిపించింది.  త‌ర్వాత రాధా మోహ‌న్ గారిని క‌లిసి స‌ర్ సినిమాకు కొంచెం ఎక్కువ ఖ‌ర్చు అవుతుంది అని చెప్పాను. ఆయ‌న క‌థ‌ను నన్ను, న‌మ్మి ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా సినిమాకు ఏది కావాలో అవ‌న్ని స‌మ‌కూర్చి మాకు హెల్ప్ చేశారు. సినిమాలో చాలా పెద్ద ప్యాడింగ్ ఉంటుంది. మేము థియేట‌ర్‌లో మీ న‌వ్వుల్నే మిస్ అవుతున్నాం కాని మీరు న‌వ్విన ప్ర‌తిసారి మా మాట‌లు గుర్తొస్తాయి. డెఫినెట్‌గా ఆహాలో ఒక మంచి సినిమా అవుతుంది. మేము ఎంత నిజాయితిగా సినిమా చేశామో మీరు అంత నిజాయితీగా ఆహాలోనే సినిమా చూడండి. థ్యాంక్యూ“ అన్నారు.

హీరోయిన్ హేమ‌ల్ ఇంగ్లే మాట్లాడుతూ – ` ట్రైల‌ర్ చూశాను చాలా బాగుంది. `సినిమా  కూడా త‌ప్ప‌కుండా చాలా బాగుంటుంది అని నేను న‌మ్ముతున్నాను. అక్టోబ‌ర్ 2న అంద‌రూ ఆహాలో సినిమా చూడండి“ అన్నారు.

ర‌చ‌యిత నంధ్యాల ర‌వి మాట్లాడుతూ – “నేను, విజ‌య్ క‌లిసి ఈ స్క్రిప్ట్‌ని ఎంతో క‌ష్ట‌ప‌డి రాశాం. అంత‌కంటే ఎక్కువ ఇష్ట‌ప‌డి చేశాం. ఈ అవ‌కాశం ఇచ్చిన రాధా మోహ‌న్ గారికి థ్యాంక్స్‌. ఆ టైమ్‌లో ఆయ‌న మాకు చాలా మంచి హోప్ ఇచ్చారు. ఈ క‌థే రాజ్‌త‌రుణ్ ని వెతుక్కుంటూ వెళ్లింది. ఫ్యామిలీ అంతా చూసి ఎంట‌ర్‌టైన్ అయ్యే సినిమా“ అన్నారు.

నిర్మాత కె.కె.రాధామోహ‌న్ మాట్లాడుతూ – “ఆరు నెలల త‌ర్వాత ఇలాంటి ఫంక్ష‌న్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఒరేయ్ బుజ్జిగా లాంటి ఒక మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ రూపొందించాలంటే ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ అంద‌రి స‌హ‌కారం ఉండాలి. అలా పూర్తిగా అంద‌రి స‌హ‌కారంతోనే ఈ సినిమా పూర్తిచేయ‌గ‌లిగాను. ద‌ర్శ‌కుడు విజ‌య్ కుమార్ గారు స్టార్‌బ‌క్స్ కాఫీ హౌస్‌లో ఫ‌స్ట్ ఈ స్టోరీ నాకు చెప్పారు.  త‌ను నంధ్యాల ర‌వి కొన్ని సంవ‌త్స‌రాలు క‌ష్ట‌ప‌డి ఫ్లాలెస్‌గా ఒక స్క్రిప్ట్‌ని త‌యారు చేసి ఆ స్క్రిస్ట్‌ని న‌న్ను ప్రొడ్యూస్ చేయ‌మ‌ని అడిగారు. సినిమా చెయొచ్చు కాని ఆ స‌బ్జెక్ట్‌కి మంచి టీమ్ కుద‌రాలి అనుకున్నాను. అలా మంచి టీమ్‌, మంచి ప్యాడింగ్ కుదిరింది. అంద‌రు కష్ట‌ప‌డి ఒక మంచి సినిమాగా  చేశారు. త‌ప్ప‌కుండా ప్ర‌‌తి ఒక్క‌రూ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు. ఫుల్ లెంగ్త్  ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా ఆహాని మ‌రోమెట్టు ఎక్కిస్తుంద‌ని మేము న‌మ్ముతున్నాము“అన్నారు.

హీరో రాజ్ త‌రుణ్ మాట్లాడుతూ – “ ఇప్ప‌ట్లో ఇలాంటి ఒక ఈవెంట్ జ‌రుగుతుంద‌ని నేను ఊహించ‌లేదు. ముందుగా శేఖ‌ర్ మాస్ట‌ర్ విజ‌య్‌ ప‌ట్టుబ‌ట్టి నాతో ఈ సినిమాలో డ్యాన్స్ వేయించారు. అలాగే ఆండ్రూ గారు స్పీడ్‌, క్వాలిటీ రెండు ఒకేసారి ఎలా చేస్తారో నాకు తెలీదు.  మ‌ధు యాక్ట‌ర్‌గానే కాకుండా స్క్రిప్ట్‌లో కూడా హెల్ప్ చేశారు. నంధ్యాల ర‌వి గారు పేప‌ర్‌మీద పెన్ను పెడితే న‌వ్వులు పూస్తాయి. స‌ప్త‌గిరి గారు చాలా బాగా న‌టించారు. అనూప్ అద్భుత‌మైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో  మాళ‌వికని ఒక కొత్త కోణంలో చూస్తారు. చాలా బాగా న‌టించింది. ఈ సినిమా నాతో చేసినందుకు విజ‌య్‌గారికి థ్యాంక్స్‌.

సినిమా అక్టోబ‌ర్‌2న సినిమా ఆహాలో విడుద‌ల‌వుతుంది అంద‌రూ త‌ప్ప‌కుండా చూడండి. అయితే నా త‌ర‌పున ఆహా వారికి, ప్రొడ్యూస‌ర్‌గారికి ఒక‌టే రిక్వ‌స్ట్. నాకు చాలా మంది మెసేజెస్ పెడుతున్నారు. సినిమా బ‌జ్ చాలా బాగుంది. సినిమాని ఒక‌రోజు ముందుగా మాకు చూపించండి అని వారంద‌రి కోసం సినిమాని ఒక‌రోజు ముందుగా ప్రిమియ‌ర్ వేయాల్సిందిగా కోరుకుంటున్నాను.“ అన్నారు.

రాజ్ త‌రుణ్, ప్రేక్ష‌కుల  కోరిక మేర‌కు అక్టోబ‌ర్ 1 సాయంత్రం 6గంట‌ల‌నుండి  ఆహాలో ఒరేయ్ బుజ్జిగా అందుబాటులో ఉంటుంద‌ని నిర్మాత రాధా మోహ‌న్ తెలిపారు.

ఆహా సీఈఓ అజిత్ మ‌ట్లాడుతూ – “ఆహా అతి త‌క్కువ స‌మ‌యంలోనే తెలుగు ఎంట‌ర్‌టైన్‌మెంట్ కు హోమ్‌లా  మారింది. ఈ సినిమా త‌ప్ప‌కుండా ఆహా ఆడియ‌న్స్ ని ఎంట‌ర్టైన్ చేస్తుంద‌ని న‌మ్ముతున్నాను. ఈ అవ‌కాశం ఇచ్చిన రాధా మోహ‌న్ గారికి ధ‌న్య‌వాదాలు. విజ‌య్ గారితో మ‌రిన్ని ఆహా ఒరిజిన‌ల్స్‌ చేయాల‌ని కోరుకుంటున్నాము. ప‌బ్లిక్ డిమాండ్ మేర‌కు అక్టోబ‌ర్ 1 సాయంత్రం 6గంట‌ల‌నుండి  ఆహాలో విడుద‌ల‌వుతుంది.` అన్నాను.

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబా పటేల్‌, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డాన్స్‌: శేఖర్‌, ఆర్ట్‌: టి.రాజ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్‌: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్‌.