కౌసల్య కృష్ణమూర్తి మూవీ రివ్యూ

Published On: August 23, 2019   |   Posted By:

కౌసల్య కృష్ణమూర్తి మూవీ రివ్యూ

డబ్బింగైన…రీమేక్  (‘కౌస‌ల్య కృష్ణ‌మూర్తి’ రివ్యూ)
 
Rating: 2.5/5

వ్యవసాయం చేసుకుంటూ క్రికెట్ ఆస్వాదిస్తూ, ఇండియా ఓడిపోతే బాధపడుతూండే సన్నకారు రైతు కృష్ణ‌మూర్తి (రాజేంద్ర‌ప్ర‌సాద్‌) . అతని  క్రికెట్ పిచ్చి..యాజ్  యూజవల్ గా ఆయన కూతురు కౌసల్య (ఐశ్వర్యా రాజేష్) కు అంటుకుంది. ఇండియా తరుపున ఆడి కప్ తీసుకొచ్చి తన తండ్రి కళ్లలో ఆనందం చూడాలని చిన్నతనంలోనే ఓ పెద్ద లక్ష్యం పెట్టేసుకుంటుంది. కూతురు లక్ష్యం…తన ఆనందమే అని తెలిసిన ఆ తండ్రి ..ఆమెను అన్ని విధాల ఎంకరేజ్ చేస్తారు. అదే సమయంలో ఆడపిల్లకు ఈ క్రికెట్ ఆట ఏంటి అని ఆ ఊరు వారంతా ఎగతాళి చేస్తూంటారు. ఈ క్రమంలో ఆమె మగపిల్లలతో కలిసి క్రికెట్ ఆడుతూ..నేర్చుకుని ఇండియన్ టీమ్ కు ఆడటానికి రెడీ అవుతుంది. అదే సమయంలో  వ్యవసాయంలో కోలుకోలేని నష్టాలు వస్తాయి కృష్ణమూర్తికి. అప్పుడు ఏం జరుగుతుంది. తన తండ్రి కళ్లలో ఆనందాన్ని కూతురు చూడగలుగుతుందా లేదా అన్నిది కాస్తంత మెలో డ్రామాతో నడిచే కథ. 

డబ్బింగా ..రీమేకా 

తమిళం లేదా మరో భాషలో ఓ సినిమా వచ్చి హిట్టైతే ఏo చేస్తారు.. దాన్ని డబ్బింగ్ చేస్తారు..ఇంకా నచ్చేస్తే..ఇక్కడ హీరోలు ఎవరైనా దొరికితే రీమేక్ చేస్తారు. అయితే డబ్బింగ్ కు నేటివిటి సమస్య ఉంటుంది. రీమేక్ కు డబ్బులు సమస్యలు ఉంటాయి. అయితే ఈ విషయమై రీసెర్చ్ చేసిన వాళ్లు ఈ మధ్యన ఓ కొత్త థీరి కనిపెట్టారు. రీమేక్ లా కనపడాలి. కానీ డబ్బింగ్ చేయాలి. అంటే ఇక్కడ కొందరు ఆర్టిస్ట్ లతో కొన్ని సీన్స్ తీసి సింక్ చేసి రీమేక్ సినిమా చేసినట్లు బిల్డప్ ఇస్తారన్నమాట. కానీ నిజానికి సినిమా సగానికి పైగా డబ్బింగే. అయితే సినిమా కదా మనకు కావాల్సింది. అది ఎలా మనకు అందిస్తే ఏంటి అనుకుంటే  ఏ సమస్యా ఉండదు. 

కానీ కొన్ని సినిమాలు అలా పొరపాటున  కూడా అనిపించవు. ఇదిగో కౌసల్య కృష్ణమూర్తి కూడా అదే బాపతు.తమిళంలో వచ్చి హిట్టైన   ‘క‌నా’సినిమాని తెలుగులోకి రీమేక్ చేసారు.  అయితే అది నామ మాత్రం రీమేక్. సగానికి పైగా తమిళంలో ఉన్నదున్నట్లు డబ్బింగ్. అంటే డబ్బింగ్ ముద్ర పడకుండా తెలివిగా తప్పించుకునే ప్రయత్నం. అయితే ఈ ప్రయత్నం ఈ సినిమాలో బెడిసి కొట్టిందనిపిస్తుంది. ఆ తేడా స్పష్టంగా తెలిసిపోతుంది. కేవలం మన నటులతో ఉన్న సన్నివేశాలను మాత్రమే రీ షూట్ చేసి మిగిలిందంతా కట్ అండ్ పేస్ట్ చేసేసారు. దాంతో డబ్బింగ్ సువాసనలు సినిమా వెదజల్లుతూనే ఉంది.  
 
సత్తాలేని  స్క్రీన్ ప్లే
 
ఈ సినిమాకు మరో పెద్ద మైనస్ ఏమిటంటే ప్రెడక్టబులిటీ. తెలుగు సినిమా ఈ స్దాయి కు వచ్చిన తరుణంలో స్క్రీన్ ప్లే  చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సిన సిట్యువేషన్. ఈ జనరేషన్ వాళ్లు వరల్డ్ సినిమాని చూస్తున్నారు. వాటితో పోటి పడకపోయినా..ప్రక్కన అయినా నిలబడకపోతే పట్టించుకోరు. అదే ఈ సినిమాకు జరగలేదు. చేసేవారి ఊహలకు దగ్గరగా ట్విస్ట్‌లకు దూరంగా కథను నడపటం పెద్దగా ఇంట్రస్టింగ్ గా అనిపించదు. తమిళం వారికి వారి నేటివిటీ ప్లస్ అయ్యిండవచ్చు కానీ మనకు అంత కిక్ ఇవ్వదు.  దానికి తోడు ఈ  కథలో రైతు పడే ఇబ్బందుల్ని తెలియజేసి సందేశాత్మకంగా  చెప్తూ వచ్చారు. కానీ సందేశాలను కూడా మహర్షి లోలాగ మహేష్ వంటి స్టార్ చెప్తేనే చూడగలగుతున్నాం. 
 
సాంకేతికంగా

 ‘కృష్ణమూర్తి’గా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ నటిస్తే.. ‘కౌసల్య’ పాత్రకు ఐశ్వర్య రాజేష్ జీవం పోసింది.పల్లెటూరి అమ్మాయిగా డీ గ్లామరస్ పాత్రలో ఆమె పరకాయ ప్రవేశం చేసింది. క్రికెటర్‌ పాత్రకి జస్టిఫై చేయడానికి నాలుగైదు నెలల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకున్నానని చెప్తున్న ఐశ్వర్య..   పడ్డ శ్రమ,  డెడికేషన్ స్క్రీన్‌పై స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ సినిమాకు బాగా ప్లస్సైంది డైలాగులు. పాటలు కూడా బాగున్నాయి. కెమెరా వర్క్ కూడా సినిమాకు బాగా కలిసొచ్చింది. 
 
చూడచ్చా

తప్పనిసరిగా చూడాలనిపించే సినిమా కాదు కానీ ఓ సారి లుక్కేయచ్చు

తెర ముందు….వెనక

బ్యాన‌ర్: క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్‌
స‌మ‌ర్ప‌ణ‌: కె.ఎస్‌.రామారావు
న‌టీన‌టులు: ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి రాజేంద్రప్రసాద్‌, శివకార్తికేయన్‌(స్పెషల్‌ రోల్‌), కార్తీక్‌రాజు, ఝాన్సీ, సి.వి.ఎల్‌.నరసింహారావు, వెన్నెల కిశోర్‌, ‘రంగస్థలం’ మహేశ్‌, విష్ణు(టాక్సీవాలా ఫేమ్‌), రవిప్రకాశ్‌ తదితరులు
సంగీతం: దిబు నిన‌న్‌
కెమెరా: ఐ.అండ్రూ
క‌థ‌: అరుణ్ రాజ్ కామ‌రాజ్‌
మాట‌లు: హ‌నుమాన్ చౌద‌రి
నిర్మాత‌: కె.ఎ.వ‌ల్ల‌భ‌
ద‌ర్శ‌క‌త్వం: భీమ‌నేని శ్రీనివాస‌రావు