న‌టుడు స‌త్య‌ప్ర‌కాష్ చేత‌ తొలిసారిగా మెగాఫోన్

Published On: September 16, 2019   |   Posted By:

న‌టుడు స‌త్య‌ప్ర‌కాష్ చేత‌ తొలిసారిగా మెగాఫోన్ 

సీనియ‌ర్ న‌టుడు స‌త్య‌ప్ర‌కాష్ పేరు చెప్ప‌గానే `పోలీస్ స్టోరీ` సినిమా గుర్తుకొస్తుంది. ఈ ఒక్క సినిమా అనే కాదు, ఎన్నో ఎన్నెన్నో సూప‌ర్ హిట్ సినిమాల్లో ప్ర‌తినాయ‌కుడిగానూ, ముఖ్య పాత్ర‌ధారిగానూ రాణించి ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు పొందారు. 11 భాష‌ల్లో 500కు పైగా చిత్రాల్లో న‌టించిన ఈ సీనియ‌ర్ న‌టుడు తొలిసారిగా మెగాఫోన్ చేత‌బ‌ట్టారు. స‌త్య‌ప్ర‌కాష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం పేరు `ఉల్లాలా ఉల్లాలా`. గ‌త వేలంటైన్స్ డేకి భారీ ఎత్తున `ల‌వ‌ర్స్ డే`  చిత్రాన్ని విడుద‌ల చేసి మంచి నిర్మాత‌గా పేరు తెచ్చుకున్న సుఖీభ‌వ మూవీస్ అధినేత ఎ.గురురాజ్ `ఉల్లాలా ఉల్లాలా` చిత్రాన్ని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. న‌ట‌రాజ్‌, నూరిన్‌, అంకిత హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది.

ఇదొక రొమాంటిక్ ఎంట‌ర్‌టైనింగ్  థ్రిల్ల‌ర్‌. ఈ సినిమాలో చాలా వింత‌లూ విశేషాలూ ఉన్నాయి. ఎవ్వ‌రూ ఊహించ‌ని రీతిలో ఈ సినిమా ఉంటుంది. ద‌ర్శ‌కునిగా స‌త్య‌ప్ర‌కాష్‌కి క‌చ్చితంగా ఓ ట‌ర్నింగ్ పాయింట్ అవుతుంది. షూటింగ్ కార్య‌క్ర‌మాలు తుదిద‌శ‌కు చేరుకున్నాయి. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ కూడా శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.
తారాగ‌ణం
న‌ట‌రాజ్‌, నూరిన్‌, అంకిత‌, గురురాజ్‌, స‌త్య‌ప్ర‌కాష్‌, `బాహుబ‌లి` ప్ర‌భాక‌ర్‌, పృథ్వీరాజ్‌, `అదుర్స్` ర‌ఘు, జ‌బ‌ర్ధ‌స్త్ న‌వీన్‌, లోబో, మ‌ధు, జ‌బ‌ర్ధ‌స్త్ అప్పారావు, రాజ‌మౌళి, జ్యోతి, గీతాసింగ్‌, జ‌య‌వాణి త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు
స‌మ‌ర్ప‌ణ‌:  శ్రీమ‌తి ఎ.ముత్త‌మ్మ‌,
ఛాయాగ్ర‌హ‌ణం:  జె.జి.కృష్ణ‌, దీప‌క్‌,
సంగీతం:  జాయ్‌,
ఎడిటింగ్‌:  ఉద్ధ‌వ్‌,
నృత్య ద‌ర్శ‌క‌త్వం:  శేఖ‌ర్ మాస్ట‌ర్‌, దిలీప్ కుమార్‌,
యాక్ష‌న్‌:  డ్రాగ‌న్ ప్ర‌కాష్‌,
ఆర్ట్:  కె.ముర‌ళీధ‌ర్‌,
పాట‌లు:  కాస‌ర్ల శ్యామ్‌, గురుచ‌ర‌ణ్‌,
క‌థ – నిర్మాత‌:  ఎ.గురురాజ్‌,
స్క్రీన్‌ప్లే – మాట‌లు – ద‌ర్శ‌క‌త్వం:  స‌త్య‌ప్ర‌కాష్‌.