బ్లాక్ చిత్రం ఆది ఫస్ట్ లుక్ విడుదల

Published On: December 23, 2020   |   Posted By:
Image
 
బ్లాక్ చిత్రం ఆది ఫస్ట్ లుక్ విడుదల
 
ఆది సాయికుమార్ బర్త్ డే సందర్భంగా ‘బ్లాక్’ ఫస్ట్ లుక్ విడుదల
 
ఆది సాయి కుమార్ హీరోగా మహాంకాళి మూవీస్ బ్యానర్‌పై మహాంకాళి దివాకర్ నిర్మిస్తున్న చిత్రం బ్లాక్. కొత్త దర్శకుడు జిబి కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 23న ఆది పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు ఆది.
 
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆదికి జోడీగా దర్శన బానిక్ నటిస్తున్నారు. లాక్‌డౌన్ కంటే ముందుగానే ఈ చిత్ర షూటింగ్ చాలా వరకు పూర్తి చేసారు మేకర్స్. ఈ సినిమాలో కౌశల్ మందా, ఆమని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, తాగుబోతు రమేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అమర్ రెడ్డి ఈ చిత్రానికి ఎడిటర్‌గా పని చేస్తుండగా.. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. మరిన్ని వివరాలు చిత్రయూనిట్ త్వరలోనే ప్రకటించనున్నారు. 
 
నటీనటులు: 
ఆది సాయికుమార్, దర్శన బానిక్, కౌశల్ మందా, ఆమని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, తాగుబోతు రమేష్..
 
టెక్నికల్ టీం:
దర్శకుడు: జిబి కృష్ణ
నిర్మాత: మహాంకాళి దివాకర్
బ్యానర్: మహాంకాళి మూవీస్
సంగీతం: సురేష్ బొబ్బిలి
ఎడిటర్: అమర్ రెడ్డి
సినిమాటోగ్రఫర్: సతీష్ ముత్యాల