విత్తన గణపతి గురించి తనికెళ్ళ భరణి

Published On: August 25, 2020   |   Posted By:
విత్తన గణపతి గురించి తనికెళ్ళ భరణి
 
 
ఈరోజు హైదరాబాదు లో ని శ్రీనగర్ కాలనీ తన నివాసంలో విత్తన గణపతి గురించి  తనికెళ్ళ భరణి గారు  మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు ఎంపీ మరియు  టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ – ఏకో ఫ్రెండ్లీ గణేష్ లో భాగంగా  కాదంబరి  కిరణ్ గారి ద్వారా వినాయక చవితి ముందు విత్తన గణపతి విగ్రహాన్ని పంపించడం జరిగింది.
 
మా ఇంట్లో కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాం. ఈ యొక్క విత్తన గణపతి యొక్క ప్రత్యేకత దీన్ని ఇంట్లోనే నిమజ్జనం చేసుకుంటే ఒక విత్తనం ద్వారా కొన్ని రోజుల్లో   ఒక మొక్క మొలుస్తుంది . ఆ మొక్కని అలాగే మన ఇంటి పరిసరాల్లో నాటుకోవాలి .కొత్త జీవం మొక్క ద్వారా ఆవిర్భవిస్తుంది . ఆ మొక్క ని పవిత్రంగా భావించి , పెంచినట్లయితే ఆరోగ్యకరమైన వాతావరణం లో మనం జీవించవచ్చు .ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ శ్రీ సంతోష్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను