శ్రీకారం చుట్టుకున్న “సత్యమేవ జయతే-1948”

Published On: May 22, 2019   |   Posted By:

శ్రీకారం చుట్టుకున్న “సత్యమేవ జయతే-1948”

ఎం.వై.ఎం. క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ బాబు.డి దర్శకత్వంలో ఎం.వై.మహర్షి నిర్మిస్తున్న చిత్రం ‘సత్యమేవ జయతే-1948″. అన్ని భారతీయ మరియు ముఖ్య అంతర్జాతీయ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ సికింద్రాబాద్ లోని లీ పాలస్ లో  ప్రారంభమైంది. ఆలేఖ్య, రఘునందన్(గాంధీ), ఆర్యవర్ధన్ రాజు(గాడ్సే), నాగినీడు(ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్), జెన్నీ (మొహ్మద్ ఆలీ జిన్నా), సమ్మెట గాంధీ(అబ్దుల్ గఫార్ ఖాన్), ఇంతియాజ్ (నెహ్రు) శరద్ దద్భావాలా(సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్), పి.శ్రీనివాస్, (అబుల్ కలాం ఆజాద్), తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి పి.జితేంద్రకుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. శరద్ దద్భావాలా క్లాప్ కొట్టారు. ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్న ప్రముఖ నటుడు నాగినీడు గౌరవ దర్శకత్వం వహించారు.

మహాత్మాగాంధీ హత్యకు గురి కావడానికి 45 రోజుల ముందు నుంచి హత్య తదనంతర పరిణామాల నేపధ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుందని, వివాదాలకు తావులేని రీతిలో మరుగున పడిపోయిన వాస్తవాలు వెలికి తీయడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నామని నిర్మాత ఎం.వై.మహర్షి తెలిపారు.  11,372 పేజీల రీసెర్చ్ పేపర్స్, 350కి పైగా పుస్తకాలు, 750కి పై చిలుకు ఇంటర్వ్యూలు పరిశోధించి, 96 క్యారెక్టర్లు, 114 సీన్స్, 500కి పైగా ప్రొపర్టీస్, 370కి పైగా కాస్ట్యూమ్స్,  500కి పైగా జూనియర్ ఆర్టిస్టులు, 47 లొకేషన్స్ లో. 9 షెడ్యూల్స్ లో, ఉన్నత ప్రమాణాలతో.. జాతీయ, అంతర్జాతీయ భాషల్లో సినిమాను పూర్తి చేయనున్నామని డాక్టర్ ఆర్యవర్ధన్ రాజ్ తెలిపారు.

ఈ చిత్రానికి మేకప్: హరి,

ప్రొడక్షన్ కంట్రోలర్ : అంజి కోకా,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:  సూర్యప్రకాష్ రెడ్డి,

లైన్ ప్రొడ్యూసర్: లక్ష్మీనారాయణ,

కెమెరా: కథ- స్క్రీన్ ప్లే- మాటలు: డాక్టర్ ఆర్యవర్ధన్ రాజు,

సంగీతం: ‘గులాబీ’ ఫేమ్ శశి ప్రీతమ్,

నిర్మాత: ఎం.వై..మహర్షి, దర్శకత్వం: ఈశ్వర్ బాబు.డి!!