సరోవరం చిత్రo మీడియా సమావేశం

Published On: October 16, 2019   |   Posted By:
సరోవరం చిత్రo  ప్రీ రిలీజ్ ఈవెంట్
 
 
శ్రీలత సినీ క్రియేషన్స్ సరోవరం ప్రీ రిలీజ్ ఈవెంట్. అక్టోబర్ 18న సరోవరం గ్రాండ్ రిలీజ్ 
 
 
శ్రీలత సినీ క్రియేషన్స్ సరోవరం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. అక్టోబర్ 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులు మీడియా సమావేశం అయ్యారు.
 
ఈ సందర్భంగా నిర్మాత ఎస్.శ్రీలత మాట్లాడుతూ…
 
సరోవరం సినిమాను అందరూ ఇష్టపడి తీసాము. మమ్మల్ని ఆశీర్వదించడానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన పెద్దలకు, మీడియా వారికి ధన్యవాదాలు.  అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను అన్నారు. 
 
డైరెక్టర్ సురేష్ యడవల్లి మాట్లాడుతూ…
 
సరోవరం అనే గ్రామంలో జరిగిన కథ ఇది. ఎమోషనల్ గా నడిచే ఈ కథలో మలుపులు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. హీరో, హీరోయిన్ బాగా నటించారు. తనికెళ్ల భరణి, ఛత్రపతి శేఖర్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. అక్టోబర్ 18న ఈ సినిమాను థియేటర్స్ లో చూసి మమ్మల్ని దీవించండని తెలిపారు.
 
జబర్దస్త్ నవీన్, రాము మాట్లాడుతూ, సరోవరం సినిమా అందమైన లొకేషన్స్ లో చిత్రీకరణ జరిగింది. మాస్ కు కావాల్సిన అంశాలతో పాటు యూత్ ను అట్రాక్ట్ చేసే ఎలిమేంట్స్ ఈ సినిమాలో ఉన్నాయన్నారు.
 
నటీనటులు:
విశాల్ వున్న
ప్రియాంక శర్మ
శ్రీలత
తనికెళ్ల భరణి
మేకా రామకృష్ణ
ఛత్రపతి శేఖర్
మహమ్మద్ ముస్తఫ
సంధ్య జనక్
మీనా కుమారి 
జబర్దస్త్ నవీన్
జబర్దస్త్ రాము
 
సాంకేతిక నిపుణులు:
కెమెరామెన్: మలహార్ భట్ జోషి
ఎడిటర్: ఎస్.బి.ఉద్ధవ్
సంగీతం: సునీల్ కశ్యప్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పులి ఈశ్వర్ రావు
ప్రొడ్యూసర్: ఎస్.శ్రీలత
కథ – మాటలు – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: సురేష్ యడవల్లి