‘సాహో’ ఆరంభం ‘హ్యారీ పోటర్’ సౌరభం

Published On: May 4, 2020   |   Posted By:

‘సాహో’ ఆరంభం ‘హ్యారీ పోటర్’ సౌరభం

అస్సలు చావడు…
అంటూంటే ఓ గొడుగు…క్రింద పాదాలు..రివీల్ చేస్తే రాయిల్ గా నడిచి వస్తూ ప్రభాస్
అన్నకే ఎగినెస్ట్ బెట్టా…
అంజి విజిల్స్ లో కిచిడీ రెడీ అయ్యిపోయినా
సూపర్ వదినా..ఐదు విజిల్స్ అంటా..కిచిడీకి, వాడికి
ట్రై చేయి..పో..పో ..చూద్దా…
ఈలోగా ఫైట్ ప్రారంభం అయ్యింది…ప్రభాస్ వరసపెట్టి రౌడీలను తన్నుకుంటూ పోతున్నాడు.

ఇదంతా ఆల్రెడీ చూసేసాం కదా..మళ్లీ ఎందుకు చెప్తున్నారు..అంటారా..అక్కడికే వస్తున్నా…

అలా వెళ్తున్న ప్రభాస్..ఓ చోటకు వచ్చి ఆగుతాడు..అక్కడ ఓ చీకటి గదిలో ఓ బ్లాక్ ఫాందర్ కనిపిస్తుంది.అది ప్రభాస్ పై ఎటాక్ చేస్తుంది దాన్నుంచి తప్పించుకున్న ప్రభాస్..ఎవడీ పిచ్చోడు..ఇళ్లలో ఫాంధర్ ని పెట్టుకున్నాడేంటి అంటారు..
అక్కడ కనిపించే ఫాంధర్ మళ్లీ ఎక్కడా సినిమాలో ఉండదు. దాంతో హఠాత్తుగా అది అక్కడ ఎందుకు కనిపిస్తుందో అనిపిస్తుంది. కొద్ది క్షణాలు మాత్రమే ఆ ఇంపాక్ట్ ఉంటుంది.

అయితే సినీ లవర్స్ కు ఆ విజువల్ చూడగానే…హ్యారీ పోటర్ సీరిస్ లో తొలి చిత్రం గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలోనూ హ్యారీ పోటర్ తన ప్రెండ్స్ తో కలిసి రాత్రిపూట తమ స్కూల్ కు వెళ్తే..అక్కడ ఓ గదిలో నల్లటి భయంకరమైన కుక్కలు కనపడతాయి. అవి మీదపడబోతే..చాకచక్యంగా తప్పించుకుంటారు. స్కూల్ లో వీటిని పెట్టేరేంటి అనుకుంటారు. ఆ సీన్ చూసిన ప్రతీ పిల్లాడు మనస్సులో గుర్తుండిపోతుంది. ఆ స్దాయిలో ఆ విజువల్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఆ రెండు సీన్స్ ని కంపేర్ చేసే ఉద్దేశ్యం..దర్శకుడు కాపీ కొట్టాడు..మేం పట్టేసాం అని చెప్పటం కాదు….చిన్నతనంలో చూసిన కొన్ని సినిమాల లేదా సన్నివేశాల ప్రభావం ఖచ్చితంగా పెద్దయ్యాక తాము సృజించే పనులపై పడుతుందని. ఖచ్చితంగా ఈ దర్శకుడు తన చిన్నతనంలో ఈ హారీపోటర్ సీరిస్ ని చూసే ఉంటాడు. అది మనస్సులో ముద్రించుకుపోయి ఉంటుంది. చాలా ఏళ్ల పాటు జ్ఞాపకాల మెరుస్తూ ..చివరకు ఈ రకంగా బయిటకు వచ్చి ఉంటుంది. ఆ సన్నివేశ రూపకల్పన వెనక మనస్సు చేసే మ్యాజిక్ వాళ్లకు కూడా తెలియకపోవచ్చు.

ప్రతీ సృజనకారుడూ.. బాల్యం కొమ్మల మీద ఊగిసలాడేవాడే. ప్రముఖ దర్శకుడు స్పీల్ బర్గ్ అంటారు ఓ చోట…తను తీసే సినిమాల వెనక తన బాల్యం ఉందని…అప్పటి తన ఊహలు,భయాలు, ఆనందాలే తెరకెక్కాయని, ఓ సారి తన సినిమాలు తీరిగ్గా తను చూస్తే తనకు అర్దమైందని. కాబట్టి చిన్నప్పుడే మంచి సాహిత్యం, మంచి సినిమాలు చూస్తే పెద్దయ్యాక..మరింత గొప్ప సృజనకారులు అయ్యే అవకాసం ఉంటుంది కాదనగలమా. మీ ఇంట్లోనే మరో సుజీత్ లేదా స్పీల్ బర్గ్ ఉన్నాడేమో…ఆల్రెడీ కార్టూన్ షోలు చూస్తూ…