సుమంత్ కొత్త సినిమా!!

Published On: May 30, 2019   |   Posted By:
నితిన్, నాని, నిఖిల్ తదితర హీరోలతో పలు హిట్ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు తన మిత్రుడు పి.జగన్ మోహన్ రావుతో కలిసి ప్రముఖ కథానాయకుడు సుమంత్ తో ఓ భారీ చిత్రం మొదలు పెడుతున్నారు.
 
యువ ప్రతిభాశాలి సంతోష్ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ యాక్షన్ డ్రామా  ను సంజన ప్రొడక్షన్స్-సాయి కృష్ణా ప్రొడక్షన్స్ పతాకలపై పి.జగన్ మోహన్ రావు-డి.ఎస్.రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  సుమంత్ సరసన సిమ్రత్ నటించే ఈ చిత్రం త్వరలోనే సెట్స్ కు వెళ్లనుంది. సుమంత్ ను కొత్త కోణంలో, సరికొత్త గెటప్ తో చూపించే ఈ చిత్రానికి సంగీతం: యాజమాన్య, సినిమాటోగ్రఫీ: అష్కర్.
“ఈ ప్రపంచంలో ఎవరూ చెడ్డ కాదు. ఎవరూ మంచి కాదు. పరిస్థితుల ప్రభావంతోనే మంచివాళ్లుగా, చెడ్డవాళ్లుగా మారతారు”