ఆచార్య చిత్రం విడుదల వాయిదా

Published On: April 27, 2021   |   Posted By:
ఆచార్య చిత్రం విడుదల వాయిదా
 
మెగాస్టార్ చిరంజీవి, కొర‌టాల శివ చిత్రం ‘ఆచార్య’ విడుదలను వాయిదా వేస్తున్నాం:  నిర్మాత‌లు
 
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌ధారిగా కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో నిరంజ‌న్ రెడ్డి నిర్మిస్తోన్న భారీ చిత్రం `ఆచార్య‌`. ఈ చిత్రాన్ని మే 13న విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా దేశంలో నెల‌కొన్న కొవిడ్ సెకండ్ వేవ్ ప‌రిస్థితుల కారణంగా సినిమా విడుద‌లను వాయిదా చేస్తున్న‌ట్లు , ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ‌గానే సినిమా విడుద‌ల తేదీకి సంబంధించిన ప్ర‌క‌ట‌న‌ను వెలువ‌రిస్తామ‌ని నిర్మాత‌లు నిరంజ‌న్ రెడ్డి, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌క‌టించారు. 
 
న‌టీన‌టులు:
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే, సోనూసూద్ త‌దిత‌రులు
 
సాంకేతిక వ‌ర్గం:
 
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  కొర‌టాల శివ‌
బ్యాన‌ర్స్‌:   కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ 
నిర్మాత‌లు:  నిరంజ‌న్ రెడ్డి, రామ్ చ‌ర‌ణ్‌
మ్యూజిక్‌:  మణిశ‌ర్మ‌
సినిమాటోగ్ర‌ఫీ:  ఎస్‌.తిరుణ్ణావుక్క‌ర‌సు
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:  సురేష్ సెల్వరాజ్‌
ఎడిట‌ర్‌:  న‌వీన్ నూలి