కథ కంచికి మనం ఇంటికి మూవీ రివ్యూ

Published On: April 11, 2022   |   Posted By:

కథ కంచికి మనం ఇంటికి మూవీ రివ్యూ

అదిత్ అరుణ్ ‘కథ కంచికి మనం ఇంటికి’ సినిమా రివ్యూ

👎

సినిమా అంటే ఓ హీరో.. ఓ హీరోయిన్.. ఓ విలన్ ఇలాంటి రూల్స్ అక్కర్లేదు. ప్రధాన పాత్రలో ఏ దెయ్యాన్నో, భూతాన్నో పెట్టేస్తే పోలా అనే ఆలోచనలో ఉంటున్నారు దర్శక నిర్మాతలు. హాలీవుడ్ సినిమాల ఇంపాక్ట్ కావొచ్చు.. డిఫరెంట్ సినిమాలను ప్రేక్షకులకు అందించాలనే తపన అనచ్చు. ఏదైతైనేం హారర్ కామెడీలు మనకు అడపాదడపా వచ్చి పలకరిస్తున్నాయి. ఈ జానర్ లో కొత్త థోరణిలో ఆలోచించిన వాళ్లు చిన్న బడ్జెట్ లోనే సినిమాలు తీస్తూ హిట్ కొట్టేస్తున్నారు. హారర్ కామెడీ.. హారర్ ఉండాలి.. కామెడీ ఉండాలి.. ఈ రెండిటిని మిక్స్ చేసి సినిమాలు చేస్తున్నారు. సినిమాలో కామెడీ టీంని పెట్టి.. సినిమాలో సన్నివేశాలతో భయపెడుతూనే ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. జనాలకు నచ్చితే జానర్ తో సంభందం లేకుండా సినిమాలకు ఆడియెన్స్ బ్రహ్మరధం పడుతున్నారు. అలాంటి జానర్లో వచ్చిన తాజా చిత్రం ఇది …మనవాళ్ళకు నచ్చుతుందా..లేదా రివ్యూ లో చూద్దాం.

Storyline:

ప్రేమ్ (త్రిగుణ్ ఎప్పుడూ తన పేరులో తప్ప జీవితంలో ప్రేమ లేదని, పెళ్లి కావడం లేదని ఫీలవుతూంటాడు.అమ్మాయిలను పడేయడం, ఆంటీలైనా సరే పెళ్లి చేసుకుందామని అనుకుంటాడు. ఇక బెట్టింగ్ కోసం బట్టలు విప్పేసేటంత రిస్క్ చేసే అమ్మాయి అమ్మాయి దీక్ష (పూజితా పొన్నాడ). కన్నయ్య (‘గెటప్’ శీను) దొంగ. నంది (‘మిర్చి’ హేమంత్) రైటర్. సినిమా దర్శకుడిగా రాణించాలని కథలు రాస్తూ, వాటిని పట్టుకుని నిర్మాతల చుట్టూ తిరుగుతుంటాడు నంది(ఆర్జే హేమంత్‌). ఈ నలుగురూ తమ పర్శనల్ కారణాల చేత ఓ రాత్రి స్మశానానికి వెళతారు. అక్కడ భయపడుతూ ఒకరికొకరు పరిచయం అవుతారు. ఎవరికి వాళ్లు ఎదుటివాళ్లను చూసి దెయ్యాలు అనుకుంటారు. భయపడతారు. తర్వాత స్మశానం పక్కనున్న ఓ గెస్ట్ హౌజ్‌లోకి వెళ్తారు. అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది. ఆమెలోకి ఎవరెవరి ఆత్మలో ప్రవేశిస్తూ ఈ నలుగురినీ ముప్పు తిప్పలు పెడతాయి. ఆ ఆత్మలు బారి నుంచి తప్పించుకుని, అసలు, ఆ అమ్మాయి ఎవరు? ఆమెలో ఆత్మలు ఎవరివి? అని ఈ నలుగురు కూపీ లాగుతారు. అప్పుడు ట్విస్ట్ రివీల్ అవుతుంది. చైల్డ్ ట్రాఫికింగ్‌(అనాథ మైనర్‌ బాలికలపై అత్యాచారాలు) కి ఆ ఆత్మలకు లింక్ ఉందని అర్దమవుతుంది. ఆ ఆత్మలు మహేష్ మంజ్రేకర్ పై పగ తీర్చే పోగ్రాం పెట్టుకున్నాయని తెలుసుకుంటారు. అక్కడ నుంచి వాటి కోరిక తీర్చి, ఆ ఆత్మల నుంచి, బంగ్లా నుంచి ఆ నలుగురూ బయటపడతారు.

Screenplay Analysis:

అప్పుడెప్పుడో మారుతి దర్శకత్వంలో వచ్చిన ప్రేమ కథా చిత్రమ్ మంచి హిట్టైంది. ఆ హారర్ కామెడీ వాసనలు మాత్రం ఇన్నాళ్లైనా తెలుగు తెరను వీడటం లేదు. లో బడ్జెట్ లో సినిమా పూర్తవడం,ఒకే చోట కథ,కథనం నడిచేలా కలిసి రావటం ఈ తరహా సినిమాలకు కలిసొచ్చే అంశం. పాయింట్ ఎప్పుడూ ఒకటే..ఆల్రెడీ బంగ్లాలో దెయ్యం ఉంటుంది. అక్కడికి జనం వెళ్తారు. ఆ దెయ్యం వీళ్లతో ఆడుకుటుంది. ఆ తర్వాత ఆ దెయ్యానికో కథ ఉందని వీళ్లు తెలుసుకుంటారు. ఇదే ఫార్ములాని పిప్పి పిప్పి చేసారు. హారర్ కామెడీ అంటూ ఓటిటి కు, శాటిలైట్ కు అమ్ముకునే ప్రాసెసె లో సినిమా చేసి థియోటర్ లో రిలీజ్ చేస్తున్నారు ముందుగా. ఆ బాపతులో వచ్చిన సినిమానే అనిపిస్తుంది. ఈ సినిమా కథలో ఎలాంటి కొత్తదనం కూడా కనిపించదు. ఇలాంటి రొటీన్ స్టోరీ,సీన్స్ , చాలా సార్లే చూసేసిందే. అలాగే సినిమాలో దర్శకుడు ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్న మెసేజ్ కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ కాకపోవటం కూడా మరో ఇబ్బంది. ఇక స్క్రీన్ ప్లే కూడా అంత ఎంగేజింగ్ గా అనిపించదు. అసలు అలాంటిది ఒకటి ఉన్నట్లు పట్టించుకున్నట్లు కనపడరు. దీనితో చాలా సీన్స్ లో ఇంట్రెస్టింగ్ గా చూపించడానికి స్కోప్ ఉన్నా దారి తెన్నూ లేక సినిమా పక్క దారి పట్టింది.

అలాగే ఆర్టిస్ట్ లను కూడా సరిగ్గా వినియోగించుకోలేకపోయారు. ఇక ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆశిస్తే మన తప్పే. చాలా చోట్ల సినిమా చాలా బోర్ గా అనిపిస్తుంది. ఉన్నంతలో ప్రీ ఇంటర్వెల్ సీన్స్, క్లైమాక్స్ బావున్నాయి. ఇంటర్వెల్ ముందు కాసేపు నవ్వించారు. ఇంటర్వెల్‌కి ముందు శ్మశానం ఎపిసోడ్‌ బాగా నవ్విస్తుంది. ఒకరినొకరు దెయ్యాలుగా భావించి భయపడే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. క్లైమాక్స్ సీన్స్ ల్లో దైవశక్తి, దుష్టశక్తి, ఆత్మల శక్తి అంటూ ప్రేక్షకులు ఆసక్తిగా చూసేలా తీశారు. అంతకు మించి ఏమీ లేదు. సినిమాకు బలమైన కథ లేదు. సెకాండాఫ్‌ తర్వాత కథ స్టార్ట్ అవటం విసిగిస్తుంది. అప్పటి వరకు ఏ పాత్ర ఏం చేస్తుందో అర్థం కాదు, ఏ సీన్ ఎందుకొస్తుందో అర్థం కాకపోవటంతో సినిమా సెకండాఫ్ పై కూడా నమ్మకం పోతుంది.

Analysis of its technical content:

టెక్నికల్ గా చూస్తే.. . కథ,కథనం మొదట ఫెయిల్. అలాగే ‘మీరు ఫ్రెష్, నేను తోమేసిన బ్రష్’ అనే ప్రాస డైలాగులు విరక్తిగా అనిపిస్తాయి. సంగీతం మినహా మిగతా టెక్నికల్ టీమ్ వర్క్ అసలు బాలేదు. కెమెరా వర్క్ అయితే దారుణం. క్లైమాక్స్ సీన్స్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అదరకొట్టారు.
నటీనటుల్లో త్రిగుణ్ బాగా చేసాడు. కామెడీ సన్నివేశాల్లో అంత జోష్ లేకపోయినా తన ప్రయత్నం అయితే చేసాడు. పూజితా పొన్నాడ గ్లామర‌స్‌గా కనిపించింది. ‘గెటప్’ శీను, ‘మిర్చి’ హేమంత్ ఫన్ చేసే ప్రయత్నం చేసారు. మహేష్ మంజ్రేకర్‌ లాంటి సీనియర్ ని వాడుకోలేదు. సప్తగిరి అలా ఓ సీన్ లో వచ్చి కనపడి వెళ్లిపోతాడు.

CONCLUSION:
చూడచ్చా?
చివరిదాకా చూడటం కష్టమే.

Movie Cast & Crew

నటీనటులు: త్రిగుణ్ (అదిత్ అరుణ్), పూజిత పొన్నాడ, ఆర్జే హేమంత్, గెటెప్ శ్రీను, మహేష్ మంజ్రేకర్, సప్తగిరి, వినోద్ కుమార్, శ్యామల, సాహితి తదితరులు.
డైరెక్టర్: చాణక్య చిన్న
మ్యూజిక్: బీమ్స్ సిసిరోలియో
డి.ఓ.పి: వైయస్ కృష్ణ
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
డైలాగ్స్: శ్రీనివాస్ తేజ
ఫైట్స్: షావోలిన్ మల్లేష్
Runtime:140 minutes
ప్రొడ్యూసర్: మోనిష్ పత్తిపాటి
విడుదల తేదీ:2022-04-08