కాలేజ్ డాన్ మూవీ రివ్యూ

Published On: May 16, 2022   |   Posted By:

కాలేజ్ డాన్ మూవీ రివ్యూ

శివకార్తికేయన్ ‘కాలేజ్ డాన్’ రివ్యూ

Emotional Engagement Emoji (EEE)

👍

తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ మెల్లిమెల్లిగా తెలుగు మార్కెట్ లోకి ప్రవేశిస్తున్నారు. ఆయన గత చిత్రాలు ‘సీమ రాజా’, ‘రెమో’ , ‘వరుణ్ డాక్టర్’, తెలుగులో బాగానే వర్కవుట్ అయ్యాయి. వరుణ్ డాక్టర్ తో అతనికంటూ సెపరేట్ మార్కెట్ ఓపెన్ అయ్యింది. అయితే ఈ సారి ఎందుకనో పెద్దగా పబ్లిసిటీ లేకుండా తెలుగులో ఈ సినిమాని డబ్ చేసి వదిలారు. ఈ సినిమా ఎలా ఉంది..చూడదగ్గ కంటెంట్ ఉన్న సినిమాయేనా…వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

Story line:

చక్రవర్తి (శివకార్తికేయన్)కి చిన్నతనం నుంచే తండ్రి (సముతిర ఖని) క్రమశిక్షణ అంటే పడదు. తన తండ్రి ఓ నిఖాసైన విలన్ అంటూంటాడు. తన అభిప్రాయాలకు అసలు విలువ ఇవ్వడని భావిస్తూంటాడు. దానికి తోడు చక్రవర్తికి చదవు అంటే పెద్దగా ఎక్కదు. తనలో ఉన్న టాలెంట్ ఏంటో తెలుసుకుని దాంట్లో నైపుణ్యం సంపాదించాలని కలలు కంటూంటాడు. అ క్రమంలో పెరిగి పెద్దై తండ్రి బలవంతంపై బీటెక్ కాలేజీలో చేరతాడు.

అక్కడ కాలేజీలో ప్రొఫెసర్, కాలేజీ డిసిప్లిన్ కమిటీ హెడ్ భూమినాథం (ఎస్.జె. సూర్య) పెట్టె రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ అతడిని భవపడతాయి. దాంతో చక్రవర్తి ఓ ప్లాన్ వేసి భూమినాథం కాలేజీ నుంచి వెళ్లగొడతాడు. ఆ తర్వాత చాలా స్వేచ్చంగా ఉంటాడు. దాంతో దాంతో చక్రవర్తిని కాలేజీ స్టూడెంట్స్ అంతా డాన్ అని పిలవడం స్టార్ట్ చేస్తారు. రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ లేకుండా హ్యాపీగా ఉంటారు. ఇక డాన్ చదువు ఎక్కదు. కానీ, తండ్రి (సముద్రఖని) దగ్గర 80 శాతం మార్కులు వచ్చాయని చెప్పుకొంటాడు. యేడాదికేడాదికి బ్యాక్ లాగ్స్ పెరుగుతున్నా, తండ్రికి మాత్రం పాస్ అయినట్టుగా అబద్ధం చెబుతుంటాడు.

మరో ప్రక్క డాన్ కో ఓ లవ్ స్టోరీ. అదీ అతను స్కూల్ డేస్ నుంచి నడుస్తూంటుంది. తను ప్రేమించిన అమ్మాయి ఆకాశవాణి (ప్రియాంకా అరుల్ మోహన్) కూడా తన కాలేజీలో చేరుతుంది. అయితే ఆమె అతన్ని పట్టించుకోదు.. ఈ లోగా కాలేజీ నుంచి బయిటకు వెళ్లిన భూమినాథం రెండు నెలల్లో తిరిగొస్తాడు. తనను కాలేజీ నుంచి తరిమేసిందని డాన్ అని తెలుసుకుని అతనిపై రివేంజ్ తీర్చుకునే పోగ్రామ్ పెట్టి మరింత స్ట్రిక్ట్ గా చేస్తాడు. దాంతో డాన్ మరో ఎత్తు వేసి లెక్చరర్స్, ప్రొపెసర్స్ ని మరింత ఏడ్పించే పోగ్రాం పెట్టుకుంటాడు. అప్పుడు భూమినాథం…డాన్ తండ్రికి కబురు పంపుతాడు. ఆయన కాలేజీ కు వచ్చే సమయానికి భూమినాధం ను అక్కడ లేకుండా చేసి మరో గేమ్ ఆడి,తప్పించుకుంటాడు. ఇలా పిల్లా, ఎలుకా ఆట ఇద్దరి మధ్యా జరుగుతుంది. ఈక్రమంలో తను సినిమా డైరక్టర్ అయితే బెస్ట్ అని డాన్ అర్దం చేసుకుని, ఓ షార్ట్ ఫిలమ్ చేయాలని నిర్ణయించుకుంటాడు.

ఇది తెలిసిన భూమినాథన్ అడ్డుపడతాడు.ఈ సారి డాన్ తండ్రికి తెలిసిపోతుంది. చివరకు కాలేజీలో షూటింగ్ పెడితే అక్కడ అనుకోని సంఘటనతో భూమినాథన్ గాయపడతాడు. డాన్ ని కాలేజీనుంచి పంపేస్తాడు. చివరకు అన్ని అడ్డంకులు దాటుకుని డాన్ సినిమా డైరక్టర్ గా సక్సెస్ అయ్యి..అదే కాలేజీ పంక్షన్ కు గెస్ట్ గా వస్తాడు. ఈ ప్రాసెస్ లో తన తండ్రిని కోల్పోతాడు. ఆయన చనిపోయాక డాన్ కు అర్దమవుతుంది. తన తండ్రి విలువ. అలాగే భూమినాధం కూడా అంత స్ట్రిక్ట్ గా స్టూడెంట్స్ తో ఉండకూడదని తెలుసుకుంటాడు. చేసిన పని తెలుసుకుని అతను ఏం చేశాడు? రివేంజ్ ఎలా ప్లాన్ చేశాడు? డాన్‌కు చెప్పిన అబద్ధాలు తెలుసుకుని తండ్రి ఏం చేశాడు? చివరకు, ఏమైంది? అనేది మిగతా సినిమా.

Screenplay Analysis:

ఈ సినిమా త్రీ ఇడియట్స్ కు లోకలైడ్జ్ వెర్షన్ లా ఉంది. మన సౌతిండియా ఇంజినీరింగ్ కాలేజీలో జరిగే కథలా అనిపిస్తుంది. ఇది ఓ కనువిప్పు కాన్సెప్టు. కన్న బిడ్డలు గొప్పవాళ్లు అవ్వాలనే తపనతో తల్లిదండ్రులు కఠినంగా వ్యవహరించడం వల్ల విలన్స్ గా కనిపిస్తుంటారని కానీ అందులో వాస్తవం లేదని దర్శకుడు ఉద్దేశ్యం. దాన్ని ఫన్ తో చెప్పారు. ముఖ్యంగా ‘డాన్’ లో విలన్ అనే వాళ్ళు లేకుండా అన్ని పాత్రలను పాజిటివ్ క్యారెక్టర్స్ గా ఎండింగ్ ఇవ్వటానికి దర్శకుడు చాలా తాపత్రయ పడ్డాడు.అయితే సినిమాలో తండ్రి చనిపోవటం, , ఎంతో కష్టపడి తీసిన తొలి షార్ట్ ఫిల్మ్ పాడైపోవడం వంటి సన్నివేశాలు బాగా తమిళ అతిగా అనిపిస్తాయి. తర్వాత ఏం జరుగుతుందో ఊహించే విధంగా కథ, కథనం ఉండటం కొంత వరకూ మైనస్ అని చెప్పాలి. అయితే ఈ ఫిల్మ్ పక్కా కమర్షియల్ ఎంట‌ర్‌టైన‌ర్‌. సినిమా నవ్విస్తుంది, ఏడిపిస్తుంది..అన్నట్లు గా రాసుకున్నారు. ముఖ్యంగా చదువు విషయంలో తల్లిదండ్రులు, ప్రొఫెసర్లు, స్టూడెంట్స్‌కు చిన్న మెసేజ్ ఇస్తుంది. అయితే స్క్రీన్ ప్లే విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది. సినిమా ప్రీ క్లైమాక్స్ లో షార్ట్ ఫిల్మ్ మేకర్ గా చక్రవర్తి పేరు తెర మీద కనిపించేసరికీ ప్రేక్షకులకు సినిమా అయిపోయిందనే భావనతో సీట్లలోంచి లేచి బయటకు వెళ్ళిపోవడం మొదలు పెట్టారంటేనే అర్దం చేసుకోవాలి. ఆ తర్వాత కాన్వకేషన్ లాగ్ గా మారింది. స్క్రీన్ ప్లేను ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు శిబి చక్రవర్తి విఫలం అయ్యారు. కాలేజీలోని అనవసర సన్నివేశాలను ఎడిట్ చేసి ఉంటే బాగుండేది.

Analysis of its technical content:

తమిళం నుంచి తెలుగు డబ్బింగ్ చేసేటప్పుడు మినిమం జాగ్రత్తలు తీసుకోలేదు. కాలేజీ ఫెస్టివల్‌లో తమిళ్ పాటలు రావడం విసిగిస్తాయి! మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ డీసెంట్ గా ఉన్నాయి. అనిరుథ్ సంగీతం ఏమంత గొప్పగా లేదు. కె. ఎం. భాస్కరన్ సినిమాటోగ్రఫీ ఓకే. లైకా ప్రొడక్షన్స్ తో కలిసి శివ కార్తికేయన్ ఈ సినిమాను నిర్మించడం విశేషం.

నటీనటుల విషయానికి వస్తే… శివ కార్తికేయన్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ గా ఫన్ బాగా చేశాడు. ప్రియాంక అరుల్ మోహన్ రొటీన్ క్యారక్టర్. సముతిర కని, ఎస్.జె. సూర్య కష్టం కనపడింది. కాలేజ్ డిసిప్లిన్ కమిటీ హెడ్ గా సూర్య కొన్ని చోట్ల అతి అనిపించినా, కొత్తగా ఉంది. బాడీ లాంగ్వేజ్ గమ్మత్తుగా ఉంది. ఇతర పాత్రల్లో రాధారవి, సూరి, ఆధిర పాండిలక్ష్మి, మనోబాల, శివంగి కృష్ణకుమార్ తదితరులు పోషించారు. దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ తన నిజ జీవిత పాత్రలోనే గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చాడు.

ప్లస్ లు

శివకార్తికేయన్ ఫన్
సినిమాటోగ్రఫీ
ప్రొడక్షన్ వాల్యూస్

మైనెస్ లు
సరిగ్గా రాసుకోని స్క్రీన్ ప్లే
సెకండాఫ్ కాలేజీ సీన్స్

CONCLUSION:

కామెడీ కోసం సరిదాగా ఓ సారి చూసేయచ్చు, ఇంజినీరింగ్ చదివే కుర్రాళ్లు బాగా కనెక్ట్ అవుతారు.

Movie Cast & Crew

నటీనటులు: శివకార్తికేయన్, ప్రియాంకా అరుల్ మోహన్, ఎస్.జె. సూర్య, సముద్రఖని, సూరి తదితరులు
సినిమాటోగ్రఫీ: కె.ఎం. భాస్కరన్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
నిర్మాతలు: అల్లిరాజా సుభాస్కరన్, శివకార్తికేయన్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శిబి చక్రవర్తి
Run Time:2 గంటల, 1 నిముషము
విడుదల తేదీ: మే 13, 2022