కెజిఫ్ 2 మూవీ రివ్యూ

Published On: April 14, 2022   |   Posted By:

కెజిఫ్ 2 మూవీ రివ్యూ

‘కేజీయఫ్‌: ఛాప్టర్‌2’ రివ్యూ

Emotional Engagement Emoji (EEE)

👍

కేజీఎఫ్ సైలెంట్ గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం. ఆ సినిమాకు సీక్వెల్ తీయటం అంటే మాటలు కాదు. పెరిగిన ఎక్సపెక్టేషన్స్ ని రీచ్ కావాల్సిన అవసరం ఉంది. డైరక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమా తర్వాత ప్రభాస్,ఎన్టీఆర్ వంటి స్టార్స్ తో చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా రిజల్ట్ ఆ సినిమాలపై ఉంటుందని తెలుసు. ఈ నేపధ్యంలో భారీగా వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది..ఫస్ట్ పార్ట్ ని మించిందా..లేక ముంచిందా…కథేంటి..భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ అయ్యే సినిమాయేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

Storyline:

ఫస్ట్ పార్ట్ లో  రాఖీభాయ్ (యశ్) కేజీఎఫ్ అధినేత గరుడ (రామచంద్ర)ని చంపి ఆ సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటాడు.ఈ సెకండ్ పార్ట్ లో కేజీఎఫ్ లో పనిచేసేవాళ్లతో ప్రేమగా ఉంటూ అక్కడివారికి దేవుడు అనిపించుకుంటాడు. అయితే అన్ని రోజులు ఒకేలా సుఖంగా జరగవు కదా. ఈ సారి కేజీఎఫ్ ని ఆక్రమించుకోవటానికి చనిపోయాడనుకున్న గరుడ బాబాయ్ అధీరా(సంజయ్ దత్) వస్తాడు. అతనో క్రూరుడు. రాఖీ భాయ్ పై డైరక్ట్ ఎటాక్ చేస్తాడు. మరో ప్రక్క ప్రభుత్వం కూడా ఈ కేజీఎఫ్ పై దృష్టి పెడుతుంది. ఏకంగా దేశ ప్రధాని రమికాసేన్ (రవీనాటాండన్) ..రాకీ భాయ్ సామ్రాజ్యాన్ని కూల్చాలనుకుంటుంది. అటు అధీరాని ఇటు దేశ ప్రధాని నుంచి వచ్చిన థ్రెట్ ని రాఖీ భాయ్ తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ క్రమంలో తనను ఇష్టపడి వచ్చి పెళ్లి చేసుకున్న  రీనా (శ్రీనిధి)ని కోల్పోతాడు. అలాగే దేశ ప్రధానికే వార్నింగ్ ఇచ్చి,తప్పించుకోలేక సముద్రంలో దూకేస్తాడు. అలా రాఖీభాయ్ చరిత్ర అంతమవుతుంది.

Screenplay Analysis:

సినిమాని   గ్రాండియర్ గా తెరకెక్కించారు ప్రశాంత్ నీల్. ఆ విషయంలో మరో మాట లేదు…సినిమా ఓ భారీ హాలీవుడ్ సినిమాలా  విజువల్ గా మంచి ఫీస్ట్. అయితే కంటెంట్  కూడా అంతే గ్రాండియర్ గా ఉంటే ఆ విజువల్స్ కు మ్యాచ్ అయ్యి బాగుండేది. హీరోకు ఈ సారి విలన్స్ ని ఎవరిని పెడదాము అని ఆలోచించి, Vikings గెటప్ లో ఓ విలన్ ని (సంజయ్ దత్) ని తీసుకువచ్చారు. అదీ సరిపోదు అని డౌట్ వచ్చినట్లు ఉంది. ఏకంగా దేశ ప్రధానికే హీరో వెళ్లి వార్నింగ్ ఇస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి, సీన్ పెట్టేసారు. అదీ సరిపోదన్నట్లు ఏకంగా దేశ పార్లమెంట్ కు వెళ్లి అక్కడ ప్రధాని ఎదురుగా ఓ ఎంపిని చంపేస్తే అనే ఐడియా వచ్చేసింది. దాన్ని అమలు చేసేసారు. సాధ్యాసాధ్యాలు చూసుకోలేదు. ఓ క్రిమినల్ వెళ్లి దేశ ప్రధానితో పోటీపడి, ఏదో మామూలు మనిషికి వార్నింగ్ ఇచ్చినట్లు ఇవ్వటం ఏమిటి అని అనుకోలేదు.  సినిమాలో ఏదైనా సాధ్యమే అన్నట్లు రాసుకుంటూ ,తీసుకుంటూ పోయారు. అది కాస్త చూసేటప్పుడు ఇబ్బందిగానే అనిపించింది.

దానికి తగినట్లు మెయిన్ విలన్ అనుకున్న అధీరా..సంజయ్ దత్ …యష్ విగ్రహం ముందు తేలిపోయాడు. సంజయ్ దత్ హెల్త్ ఇష్యూలు, ఏజ్ పాక్టర్ తో ఎంత మేకప్ చేసినా వయస్సు మీదపడినట్లు కనపడిపోతోంది. దాంతో అతను వచ్చి యష్ తో ఫైట్ చేస్తూంటే మనకేమీ థ్రిల్లింగ్ గా ఉండదు. అయితే తెర నిండా పరుచుకున్న విజువల్స్ , స్పీడుగా సాగిపోయే ఎడిటింగ్ మాయలో ఇవి మరుగున పడ్డాయి. అలాగే ఇంత యాక్షన్ ఎపిసోడ్ లో తల్లి ప్రేమ సీన్స్ ఎమోషన్ గా వర్కవుట్ అవుతాయనుకున్నారు. కానీ అవి తెర మీద వచ్చినప్పుడల్లా విసిగించాయి. కథకు అడ్డం పడ్డాయి. అలాగే ఎంతసేపూ రాకీ భాయ్ కు ఎదురే లేకుండా సీన్స్ నడుస్తూంటే కాంప్లిక్ట్స్ ఎక్కడపుడుతుంది. డ్రామా ఎక్కడ క్రియేట్ అవుతుంది. బారీతనం ముందు అవన్ని బలాదూర్ అన్నట్లు తోసుకుంటూ పోయారు. అలాగే మాటిమాటికి ఎలివేషన్ సీన్స్… కాస్త విసిగించేవే. నేరేషన్ కు అడ్డం పడేవే. మాస్ కోసం పెట్టిన ఈ సీన్స్ మూసపోసినట్లు ఉండటం ఇబ్బందే. ఇక హీరో,హీరోయిన్ సీన్స్ అయితే చెప్పక్కర్లేదు. అవి తీసేస్తే బాగుండేది. అలాగే వాటివల్ల కథకు కానీ, చూసేవారికి కానీ కలిసొచ్చేది లేదు.  ఎన్ని అనుకున్నా కొన్ని సీన్లు సినిమా ప్రాణంలా నిలిచాయి. కేజీఎఫ్ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకొన్న ఒక గోల్డ్ బిస్కెట్ కోసం పోలీస్ స్టేషన్ పై రాఖీభాయ్ సృష్టించే విధ్వంసం చూసేవాళ్లకు మంచి ఎక్సపీరియన్స్ ఇస్తాయి.

Analysis of its technical content:

సినిమా టెక్నికల్ గా మంచి స్దాయిలో ఉంది. అలాగే ప్రశాంత్ నీల్ మేకింగ్ కూడా చాలా స్టాండర్డ్స్ లో ఉంది. అతనికి కెమెరా మెన్ అద్బుతంగా సపోర్ట్ ఇచ్చారు. అలాగే ఎడిటర్ కూడా బాగా కలిసొచ్చాడు. అయితే స్క్రీన్ ప్లే రాసుకోవటంలో విఫలమవటంతో సినిమా గందరగోళంగా చాలా సార్లు అనిపిస్తుంది. తెరపై జరిగే సీన్స్ చూడటమే కానీ కొన్ని సార్లు అర్దం కాదు. అలాగే డైరక్టర్ ఎంతసేపు హీరోయిజం ఎలివేట్ చేయటం, బిల్డప్ చేయటమే పనిగా పెట్టుకున్నాడు.  ఇక పాటలు అసలు బాగోలేవు. కానీ రీరికార్డింగ్ మాత్రం బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా నెక్ట్స్ లెవిల్ లో ఉన్నాయి.

నటీనటుల్లోరాఖీ భాయ్ పాత్రతో యష్ ఒదిగిపోయారనటం చిన్న మాట.   హీరోయిన్ శ్రీనిధి శెట్టి జస్ట్ ఓకే. అధిరాగా సంజయ్ దత్ కొన్ని సీన్స్ లో తేలిపోయారు. అయితే ఆయన లుక్స్, అగ్రెసివ్ నెస్ నచ్చుతాయి.  ప్రధాన మంత్రి రమికాసేన్ పాత్రలో రవీనాటండన్ చెప్పుకో దగ్గరీతిలో నటించి మెప్పించింది. ఇక ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, అయ్యప్ప పీ శర్మ, అచ్యుత్ కుమార్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

బాగున్నవి
స్టైలిష్ మేకింగ్
యష్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన విధానం
రాఖీ రీ ఇంట్రడక్షన్ సీన్,
అధిరా మీద అతడి దాడి,

బాగోలేనివి

బోర్ కొట్టే  స్క్రీన్ ప్లే
సినిమా పూర్తైపోతే బాగుండును అనిపించే లెగ్త్
విఎఫ్ ఎక్స్ షాట్స్

CONCLUSION:

రొమాన్స్, ఫన్ వంటివి ఆశించకుండా…పూర్తి యాక్షన్ మోడ్ లో సాగే సినిమా కావాలంటే మాత్రం మంచి ఆప్షన్.

Movie Cast & Crew

నటీనటులు: యశ్‌, శ్రీనిధి శెట్టి, సంజయ్‌ దత్‌, రవీనా టాండన్‌, ప్రకాశ్‌రాజ్‌, రావు రమేశ్‌, ఈశ్వరిరావు, అచ్యుత్‌కుమార్‌, మాళవిక అవినాశ్‌ తదితరులు;
సంగీతం: రవి బస్రూర్‌;  (KGF Chapter 2 movie review)
సినిమాటోగ్రఫీ: భువన్‌ గౌడ;
ఎడిటింగ్‌: ఉజ్వల్‌ కులకర్ణి;
నిర్మాత: విజయ్‌ కిరంగదూర్‌;
రచన, దర్శకత్వం: ప్రశాంత్‌ నీల్‌;
Runtime: 2h 48m
విడుదల: 14-04-2022