చరణ్ పై మహిత్ సాంగ్

Published On: April 9, 2021   |   Posted By:

చరణ్ పై మహిత్ సాంగ్

చరణ్ పై సాంగ్ చేసిన మహిత్ ని అభినందించిన మెగా స్టార్ 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రి సోదరుడు మహిత్ నారాయణ్ చిరుతకు కానుక అంటూ ఓ అదిరిపోయే సాంగ్ ని రూపొందించి చరణ్ పుట్టినరోజున విడుదల చేసారు. ఈ సాంగ్ విన్న అందరు బాగుందని చెప్పారు. లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి కూడా మ్యూజిక్ డైరెక్టర్ మహిత్ నారాయణ్ ని అభినందించారు. హాయ్ మహిత్ నారాయణ .. రోజులైంది నిన్ను చూసి.. చరణ్ బర్త్ డే రోజున నిన్ను చూసి నీ మాటలు విని చాలా ఎమోషన్ కు లోనయ్యాను. చక్రి గుర్తుకు రావడం, నేను మీ ఇంటికి రావడం, మీ అందరితో కలిసి ఆప్యాయంగా మాట్లాడుకున్న సందర్భాలు గుర్తొచ్చాయి.  చక్రిని అందరం మిస్ అవుతున్నాము, లవ్లీ బాయ్.  చక్రి కూడా కెరీర్ ప్రారంభంలో నా మీద, మా ఫామిలీ మీద పాట రాసి తన అభిమానాన్ని చాటుకున్నాడో, అలాగే నువ్వు కూడా చరణ్ పై చక్కని సాంగ్ రాసి కంపోజ్ చేసావు. చాలా ఆకట్టుకునేలా ఆ సాంగ్ ఉంది. ఏ జన్మలో ఉన్న ఋణానుబంధమో తెలియదు. మీ ప్రేమకు ఎప్పుడు కృతజ్ఞులమై ఉంటాము. ప్రస్తుతం  రెండు సినిమాలు జరుగుతున్నాయి. తప్పకుండా ఆ తరువాత ఎప్పుడైనా కలవాలంటే తప్పకుండా రాగలవు అని మెగాస్టార్ ఆయనకు మెసెజ్ పంపించారు.

మెగాస్టార్ అభినందనలు తెలుపడం పై మహిత్ నారాయణ్ స్పందిస్తూ .. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా విడుదల చేసిన పాట అందరికి నచ్చడం, ముక్యంగా మెగాస్టార్ గారికి ఆ సాంగ్ నచ్చి అయన అభినందనలు నాకు పంపించారు.  ఈ రోజు నాకొక వరం దొరికింది , నిజంగా ఆ దేవుడే వచ్చి  నాకు వరం ఇచ్చినట్టు అయింది. ఈ తీపిగుర్తుని నేను మరచిపోలేను. అందుకే మీ అందరితో ఈ ఆనందాన్ని పంచుకుంటున్నాను. మెగాస్టార్  వచ్చినప్పటినుండి నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఈ అనుభూతి అసలు ఉహించలేనిది. మెగాస్టార్ గారు సాంగ్ బాగుందని చెప్పిన మాట చాలా ఆనందాన్ని ఇచ్చింది. చక్రి అన్నయ కూడా మెగాస్టార్ పై సాంగ్స్ చేసాడు. అలాగే నేను కూడా రామ్ చరణ్ పై చేసిన సాంగ్ కు చిరంజీవి గారు నన్ను అభినందించడం మరచిపోని అనుభూతి. ఈ అద్భుతం జరగడానికి ఎదో మహత్తు జరిగిందని, చక్రి అన్నయ్య వెనకుండి ఈ ప్రయత్నం చేయించాడేమో అనిపిస్తుంది. చిరంజీవి గారు ఇచ్చిన ఆ ప్రోత్సహం నాకు కొండంత బలాన్ని ఇచ్చింది. అయన అభిమానానికి నేను ఏమిచ్చి ఋణం తీర్చుకోలేను, ఒకవేళ అలా తీర్చుకోవాలని ఉంటె నా సంగీతంతో ఆయనకోసం ఓ సాంగ్  చేయాలని ఈ రోజు నిర్ణయం తీసుకున్నాను. అది వారికి గొప్పగా అనిపించకపోయినా నాకు మాత్రం అదృష్టాంగా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునేలా ఉండే విషయం అని చెబుతున్నాను. ఈ సందర్బంగా ఇంత తృప్తి మిగిల్చిన చిరంజీవి గారికి పాదాభివందనం చేస్తున్నాను. నేను చిరంజీవి, రామ్ చరణ్ ల దగ్గరికి వెళ్ళడానికి ముఖ్య కారణం బ్లడ్ బ్యాంక్.  నేను చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ని నమ్ముకున్నాను. చక్రి అన్నయ బ్లడ్ బ్యాంకు తో అనుబంధం ఉండేది .. అలాగే నేను కూడా అది కంటిన్యూ చేస్తున్నాను. చిరంజీవి బ్లడ్ బ్యాంకు  స్వామి నాయుడు గారు నా వెనకుండి సపోర్ట్ అందిస్తున్నారు. చిరంజీవి రాముడైతే .. అయన హనుమంతుడు. చిరంజీవి బ్లడ్ బ్యాంకు కోసం ఎప్పుడు నేనున్నానంటూ ముందుండే స్వామినాయుడు గారికి థాంక్స్ చెబుతున్నాను. ఈ అనందానికి హద్దులు లేవు. చక్రి అన్నయ్య  పొయ్యాకా మా ఇంట్లో ఇంత ఆనందనం ఎప్పుడు కలగలేదు. చిరంజీవి గారి నుండి మంచి సందేశంతో పాటు పూల బొకే, స్వీట్స్ పంపించారు. ఇంతగా నన్ను గుర్తు పెట్టుకుని అయన నాపై తీసుకున్న శ్రద్ధ కు చాలా ఆనందంగా ఉంది. రామ్ చరణ్ ఇచ్చిన హగ్ చాలా గొప్పగా ఉందని అనుకుంటే ఇది అంతకు మించిన వరంగా భావిస్తున్నాను. ఈ సందర్బంగా మెగాస్టార్ గారికి థాంక్స్ చెప్పడం అన్నది చిన్న మాట అవుతుంది. నిజంగా చిరంజీవి గారి అభినందన, చరణ్ అభినందన నా జీవితంలో మరచిపోలేను. థాంక్యూ సర్… లవ్ యూ సర్ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు.