చోర్ బజార్ చిత్రం హీరోయిన్ గెహన సిప్పి ఫస్ట్ లుక్ రిలీజ్

Published On: October 11, 2021   |   Posted By:
 
చోర్ బజార్ చిత్రం హీరోయిన్ గెహన సిప్పి ఫస్ట్ లుక్ రిలీజ్
 
‘చోర్ బజార్’’ చిత్రంతో టాలీవుడ్ లో హీరోయిన్ గెహన సిప్పి ఎంట్రీ, ఫస్ట్ లుక్ రిలీజ్
 
 
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్  తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘‘చోర్ బజార్’’. ఈ చిత్రంతో గెహన సిప్పీ హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. దళం, జార్జ్ రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు తన తొలి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
*లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న “చోర్ బజార్” చిత్రంలో సిమ్రన్ పాత్రలో ఆకట్టుకోనుంది నాయిక గెహన సిప్పి.
 
సోమవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆమె క్యారెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అందంగా నడిచొస్తున్న సిమ్రన్ గ్లామర్ అండ్ పర్మార్మెన్స్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకోబోతోంది*. నిర్మాణాంతర కార్యక్రమాల తుది దశలో ఉన్న “చోర్ బజార్” సినిమా త్వరలో థియేటర్ ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.
 
సాంకేతిక నిపుణులు:-
 
సినిమాటోగ్రఫీ – జగదీష్ చీకటి, సంగీతం – సురేష్ బొబ్బిలి, ఎడిటింగ్ – అన్వర్ అలీ ఆర్ట్ – గాంధీ నడికుడికర్, కాస్ట్యూమ్స్ డిజైనర్ – ప్రసన్న దంతులూరి, ఫైట్స్ – ఫృథ్వీ శేఖర్, కొరియోగ్రఫీ – భాను.సహ నిర్మాత – అల్లూరి సురేష్ వర్మ, బ్యానర్ – ఐ.వి ప్రొడక్షన్స్, నిర్మాత – వీ.ఎస్ రాజు, రచన, దర్శకత్వం – బి. జీవన్ రెడ్డి.