జాబిల్లి కోసం చిత్రం టీజర్ విడుదల

Published On: August 16, 2022   |   Posted By:

జాబిల్లి కోసం చిత్రం టీజర్ విడుదల

ఓక చిన్న స్థాయి వ్యక్తి తను ప్రేమించిన జాబిల్లి దూరమైతే ఏం జరిగింది అనేదే ఈ కథ. కె యస్ ఆర్ సిల్వర్ స్క్రీన్, ఆర్ ఎక్స్ 100 మరియు మదర్ మూన్ క్రియేషన్స్ సమర్పణలో వి. జి. ఆర్. ఎంటర్ టైన్మెంట్ పతాకంపై ప్రిన్స్ ప్రణయ్ (తొలిపరిచయం ), జారాఖాన్ జంటగా బి. వి. గోవింద రాజన్ దర్శకత్వంలో కళ్ళం సుధాకర్ రెడ్డి, , కె. హరి రత్నం లు సంయుక్తంగా నిర్మిస్తున్న “జాబిల్లి కోసం” చిత్రం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.

ఆగష్టు 15 సందర్బంగా ఈ చిత్రానికి సంబందించిన టీజర్ ను హైదరాబాద్ లో చిత్ర యూనిట్ విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన ఇక్కుర్తి శ్రీనివాస్ రావు గారు టీజర్ ను లాంచ్ చేశారు.ఇంకా ఈ కార్యక్రమానికి

దర్శకుడు బి. వి. గోవింద రాజన్ మాట్లాడుతూ..ఒక చిన్న కథనీ పెద్ద క్వాలిటీతో చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదములు. బలవంతమైన సర్పం చలి చీమల చేతచిక్కి చావదే.. సుమతీ అను పద్యమే ఈ సినిమాకు స్ఫూర్తి.ఈ సినిమా కొరకు నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేయడమే కాకుండా ఫుల్ సపోర్ట్ చేశారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.ఈ సినిమాను మా నిర్మాతలు చూశారు. వారికీ ఈ సినిమా నచ్చడంతో మళ్ళీ వారు చేసే తదుపరి సినిమాకు కూడా దర్శకుడుగా నన్ను సెలెక్ట్ చేకుకోవడం చాలా సంతోషం గా వుందని అన్నారు.

నిర్మాత కళ్ళం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. శివ నాగేశ్వరావు (శివాజీ ) తయారు చేసిన కథను దర్శకుడు గోవింద రాజన్ హరి రత్నం కు చెప్పడంతో తనకీ కథ నచ్చడంతో ఈ సినిమా చేద్దాము అని నాతో చెప్పడం జరిగింది. దాంతో నేను రత్నం కలసిఈ సినిమా చేయడం జరిగింది. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా మాకు మంచి అవార్స్ తీసుకు వస్తుందని నమ్ముతున్నాము .ఇదే బ్యానర్ లో మళ్ళీ మేము చేయబోయే సినిమాకు ఇదే టీం ను కంటిన్యూ చెయ్యాలనుకుంటున్నాము . వాటి వివరాలు త్వరలో తెలియ జేస్తున్నాము.అని అన్నారు.

మరో నిర్మాత కె. హరి రత్నం మాట్లాడుతూ..జాబిల్లి కోసం సినిమాను పూర్తిగా డంపింగ్ యార్డ్ లో షూట్ చేయడం జరిగింది. ఈ కథకు చాలా డెప్త్ ఉంటుంది. మంచి కాన్సెప్ట్ తో వస్తున్నా ఈ సినిమా ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది.ల్ అన్నారు.

కథ, మాటలు అందించిన శివ నాగేశ్వరావు (శివాజీ ) మాట్లాడుతూ..ఈ టీజర్ చాలా బాగుంది. జాబిల్లి కోసం వంటి మంచి కథను రాసుకున్నాను. రాసుకున్న విధంగానే దర్శకుడు బి. వి. గోవింద రాజన్ చాలాచక్కగా తెరకెక్కించారు .ఈ చిత్రానికి మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఏర్పాటు సినిమా ఆకట్టుకుంటుందని అన్నారు.

హీరో ప్రిన్స్ ప్రణయ్ మాట్లాడుతూ..సినిమా అందరూ కస్టపడి తీస్తారు. మేము ఆ కష్టాన్ని కూడా ఇష్టపడి చేశాము మేము ఎంత కష్టపడ్డామో ఈ సినిమా అవుట్ పుట్ చూస్తే తెలుస్తుంది. డంపింగ్ యార్డ్ లో లైవ్ లో ఈ చిత్రాన్ని తీయడం జరిగింది. ఇందులోని పాటలు అందరినీ అలరిస్తాయి.అందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది అన్నారు

అసోసియేట్ డైరెక్టర్స్ ఇక్కుర్తి శ్రీనివాస్ రావు, శీలం రవీందర్ రెడ్డి మాట్లాడుతూ..ఇలాంటి చిత్రానికి మేము బాగామైనందుకు చాలా సంతోషం గా వుంది.

సంగీతం ఎం. ఎల్. రాజు మాట్లాడుతూ..మంచి కంటెంట్, మంచి పాటలు మంచి వర్త్ ఉన్న సినిమా” జాబిల్లి కోసం” . ఈ సినిమాను డి. గ్లామర్ గా తీయడానికి చాలా కష్టపడ్డారు ఇందులో పిక్చరైనేషన్ చాలా బాగుంటుంది.త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా అందరకీ నచ్చుతుంది అన్నారు.

ఎడిటర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ.. జాబిల్లి కోసం మూవీ చాలా బాగా వచ్చింది. ఇలాంటి మంచి సినిమాకు ఎడిటర్ గా పని చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు.

నటీ నటులు
ప్రిన్స్ ప్రణయ్ (తొలిపరిచయం ), జారాఖాన్, హరి రత్నం, విశ్వనాథ్, రాజు డాన్సర్, రుక్మిణి తదితరులు

సాంకేతిక నిపుణులు
సమర్పణ : కె యస్ ఆర్ సిల్వర్ స్క్రీన్, ఆర్ ఎక్స్ 100 మరియు మదర్ మూన్ క్రియేషన్స్
బ్యానర్ : వి. జి. ఆర్. ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : కళ్ళం సుధాకర్ రెడ్డి, బి. వి. గోవింద రాజన్, కె. హరి రత్నం
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : బి. వి. గోవింద రాజన్
కథ, మాటలు : శివ నాగేశ్వరావు (శివాజీ )
సంగీతం : ఎం. ఎల్. రాజు
డి. ఓ. పి : నందన్ కృష్ణన్
ఎడిటర్ : సంపత్ కుమార్
డాన్స్ : బాలు మాస్టర్