తకిట తదిమి తందాన చిత్రం ప్రారంభం

Published On: June 20, 2022   |   Posted By:

తకిట తదిమి తందాన చిత్రం ప్రారంభం

మర్డర్ మూవీ ఫేమ్ ఘన ఆదిత్య మరియు ప్రియ జంటగా, రాజ్ లోహిత్ దర్శకత్వం లో, ఎల్లో మ్యాంగో ఎంటర్ టైన్మెంట్ మరియు వ్యాస స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం తకిట తదిమి తoధాన .

ఈ రోజు హైదరాబాద్ లోని వ్యాస స్టూడియోలో పూజా కార్యక్రమాలు వైభవoగా జరిగాయి.సకినాల నరేంధర్ రెడ్డి కెమెరా ఆన్ చేయగా FTIH ఫౌండర్ & CEO కటకం ఉదయ్ కిరణ్ గారు క్లాప్ కొట్టారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చందన్ కుమార్ మాట్లాడుతూ”ఈ చిత్రం ఈ నెల 20 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది .ఇదొక వెరైటీ కథ. మంచి ఎమోషన్ ఉంటుంది. అర్జున్ కెమెరా మెన్ గా , రైటర్ గా దిలీప్ కుమార్ , ఎడిటర్ గా జానీ బాషా మ్యూజిక్ డైరెక్టర్ గా అభిషేక్ రుఫుస్ అత్యున్నత సాంకేతిక బృందం కలిసి పని చేస్తున్నారు.