తెల్ల‌వారితే గురువారం చిత్రం ఓటీటీ ఆహలో విడుదల

Published On: April 15, 2021   |   Posted By:

తెల్ల‌వారితే గురువారం చిత్రం ఓటీటీ ఆహలో విడుదల

ఈ వీకెండ్‌ను ‘తెల్ల‌వారితే గురువారం’ చిత్రం ద్వారా న‌వ్వుల‌తో ముంచెత్తుతున్న తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహ’.
 
హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’లో ఏప్రిల్ 16న విడుదల
 
రొమాంటిక్ కామెడీ ‘తెల్లవారితే గురువారం’ సినిమాను ఈ ఏప్రిల్ 16న ‘ఆహా’ ప్రసారం చేస్తుంది. దీంతో తెలుగు ప్రేక్షకులు, సినీ ప్రేమికులు విలాసవంతమైన ట్రీట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేక్ పైనున్న చెర్రీ పండులా ఈ ఫ్లాట్ ఫామ్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ ఏడాది క్రాక్, నాంది, గాలి సంపత్, జాంబి రెడ్డి వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన ‘ఆహా’ ఉగాది సంబరాలను ప్రేక్షకులకు ‘తెల్లవారితే గురువారం’ సినిమాతో ఈ వారాంతరంలోనూ అందించడానికి సిద్ధమైంది. ఎంటైర్ ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ ఫన్ ఎంటర్ టైనర్‌ను ఎంజాయ్ చేస్తారు. 
 
శ్రీసింహా, మిషా నారంగ్, చిత్రా శుక్లా హీరో హీరోయిన్లుగా నటించిన ‘తెల్లవారితే గురువారం’ సినిమా ..నేటి యువతలో చాలా మంది ఎదుర్కొంటున్న గందరగోళాలను తెరపై చూపెట్టే చిత్రం. ప్రేమ, బంధాలపై మరింత గౌరవాన్ని పెంపొందించేలా చేసే చిత్రమిది. మనలో చాలా మంది ఎదుర్కొనే సమస్యలను తేలికగా అందరికీ అర్థమయ్యేలా కామెడీ కోణంలో వివరించే ప్రయత్నం చేవారీ సినిమాలో. అన్ని రకాల అంశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా సినిమా ఉంటుంది. తప్పకుండా ఓటీటీ ప్రేక్షకులను ‘తెల్లవారితే గురువారం’ సినిమా ఎంటర్టైన్ చేస్తుంది. 
 
వైవిధ్యమైన కంటెంట్‌ను ప్రేక్ష‌కుల‌కు అందిస్తోన్న తెలుగు ఓటీటీ మాధ్య‌మంగా   ‘ఆహ’ తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. ఎవ‌ర్ గ్రీన్ క్లాసిక్స్ నుంచి రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ వ‌ర‌కు..అలాగే వెబ్ సిరీస్‌లు, సెల‌బ్రిటీ ఇంట‌ర్వ్యూస్ అన్నింటినీ ఓ గొడుగు కింద‌కు చేర్చి ఎక్స్‌క్లూజివ్‌గా ప్రేక్ష‌కుల‌కు అందిస్తోంది మ‌న  ‘ఆహ’.