‘దుప్పట్లో మిన్నాగు’ సినిమా రివ్యూ

Published On: April 27, 2019   |   Posted By:

‘దుప్పట్లో మిన్నాగు’ సినిమా రివ్యూ

గొప్ప థ్రిల్లరేమీ కాదు (‘దుప్పట్లో మిన్నాగు’ సినిమా రివ్యూ )

రేటింగ్  : 2/5

నవలా రచయితగా యండమూరి ఓ తరానికి ఆరాధ్యదైవం. వీళ్ళనేం చేద్దాం?, డేగ రెక్కల చప్పుడు, ఒక వర్షాకాలపు సాయంత్రం, రెండు గుండెల చప్పుడు, వెన్నెల్లో ఆడపిల్ల, ఆనందో బ్రహ్మ, అంతర్ముఖం, డబ్బు టు ది పవరాఫ్ డబ్బు వంటి నవలలు ఆయన కీర్తి పతాకాన్ని ఎక్కడికో తీసుకెళ్ళాయి. ఆ నవలలో  వెన్నెల్లో ఆడపిల్ల, అభిలాష, డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు, ఆఖరి పోరాటం, ఒక రాధ-ఇద్దరు కృష్ణులు, రాక్షసుడు వంటివి ఎన్నో  సినిమాలుగా వచ్చి సక్సెస్ అయ్యాయి. ఆ తర్వాత పర్శనాలిటి డవలప్ మెంట్ సాహిత్యం వైపు వచ్చి విజయానికి అయిదు మెట్లు, విజయానికి ఆరవ మెట్టు  వంటి ఎన్నో పుస్తకాలు సృజించి సక్సెస్ అయ్యారు.  అంతేకాక అగ్నిప్రవేశం,  స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ సినిమాలతో డైరక్టర్ గా మారారు. చాలా కాలం తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టి ఈ సినిమాకు కథ అల్లుకుని డైరక్ట్ చేసారు. ఈ నేపధ్యంలో ఈ సినిమా ఎలా ఉంది. యండమూరి అభిమానులకు నచ్చేలా ఉందా..అలాగే ‘దుప్పట్లో మిన్నాగు’నవలనే సినిమాగా చేసారా, అసలు ఈ సినిమా కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

కథ..

గఫార్ ఖాన్ (సుబ్బరాయ శర్మ) మంచి దేశభక్తుడు.  బేకరీ నడుపుకుంటూ తన జీవితం గడుపుతూంటాడు.   ఓ రోజు అనాధ గా కనపడ్డ కల్యాణి (చిరాశ్రీ) ని  గఫార్ ఖాన్  చేరదీస్తాడు. మతం వేరైనా పట్టించుకోకుండా ఆమెను   స్వేచ్ఛగా పెంచుతాడు. ఆమె పెరిగి పెద్దై  ఐఐటీ గ్రాడ్యుయేట్ అవుతుంది.   ఓ రోజు గఫార్ ఖాన్ బాల్య మిత్రుడు మిజ్రాదీన్ అతన్ని కలవటానికి వచ్చాడు.  అతను వచ్చిన రెండు రోజులకి గఫార్ ఖాన్ కనిపించకుండా మాయం పోయాడు. తనని జీవితం ఇచ్చిన గఫార్ ఖాన్ ఏమయ్యాడో వెతకటం మొదలెడుతుంది  కల్యాణి . ఆ క్రమంలో ఆమె కొన్నిత్యాగాలు చేయాల్సివస్తుంది.  మరో ప్రక్క ఇదే కథకు… ఒక పోలీస్ ఆఫీసర్ భార్య  …తన ఇంట్లో అద్ద్దెకున్న కురాడి బ్లాక్ మెయిల్ కి లొంగిన కథ నడుస్తుంది. ఈ రెండింటికి లింకేంటి… ఈ కథ మొత్తానికి కాశ్మీర్ తీవ్ర వాదానికి ఉన్న సంబంధం ఏమిటి? అసలు గఫార్ ఖాన్ ఏమైపోయారు..కళ్యాణి చేసిన త్యాగం ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉంది

నవలలు వేరు, సినిమా స్క్రిప్ట్ వేరు. నవల్లో అద్బుతం అనిపించినవి తెరపై తేలిపోవచ్చు. అలాగే నవల్లో అపరితమైన ట్విస్ట్ లు మన ఊహాశక్తికి అణుగుణంగా పేర్చుకుంటూ పోవచ్చు. కానీ అదే సినిమా దగ్గరకు వచ్చేసరికి ఆ గ్రామర్ వేరు కావటంతో పూర్తిగా మార్చుకోవాల్సి వస్తుంది. అదే ఈ సినిమాకు మిస్సైంది అనిపిస్తుంది. ఈ చిత్రం కథ ..ఓ సినిమాగా కన్నా మంచి నావల్టి కలిగిన నవలగా బాగుంటుంది అనిపిస్తుంది. దానికి తోడు ఈ సినిమాని సీరియల్ మేకింగ్ తో తీయటంతో ఇంటెన్స్ డ్రామా కాస్తా పలచబడిపోయింది. కథలో ఉన్న సినిమాలో అనువాదం కాలేదని అర్దమవుతోంది.  ఎక్కువ మలుపులు ఈ కథను కాస్త కన్ఫూజన్ కు గురి చేస్తాయి.

అయితే థ్రిల్లర్ సినిమా జానర్ కు తగినట్లుగా ..పాటలు పెట్టకపోవటం, లెంగ్త్ తక్కువగా ఉండటం కలిసి వస్తాయి. నటీనటుల్లో చాలా మంది మనకు పరిచయం ఉండరు. కన్నడ,తెలుగు సినిమా కావటం వలన కావచ్చు. ఉన్నంతలో  బాగానే చేసారు.   ఎడిటింగ్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. 

నవలకు సినిమాకు సంభందం ఉందా

వాస్తవానికి నవల కథ వేరు, సినిమా కథ  వేరు. టైటిల్ తో తప్ప రెండింటికి పోలిక  లేదు. 

చూడచ్చా…

థ్రిల్లర్ ఎలిమెంట్స్ కలిగిన ఓ సాదా సీదా సినిమా చూడటానికి మీరు ఆసక్తి చూపించటట్లు అయితే ఖచ్చితంగా చూడవచ్చు. 

ఆఖరి మాట

యండమూరి వంటి క్రియేటర్ నుంచి మాత్రం ఇలాంటి సినిమా మాత్రం ఆశించం. 

తెర వెనక..ముందు

బ్యానర్: చిరంజీవి క్రియేషన్స్ 

నటీనటులు :  చిరాశ్రీ ,విశ్వజిత్, నవీన్ తీర్దహళ్ళ, సుబ్బరాయ శర్మ,సుథీర్ కుమార్ ,మఢథా చిరంజీవి, అమర్ ప్రసాద్ తదితరులు 

మాటలు: శ్రీశైల మూర్తి,

 కెమెరా: నిరంజన్ బాబు, 

ఎటిడింగ్: పవన్ ఆర్.ఎస్. , 

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: సతీష్ బాబు, 

సౌండ్ ఇంజనీర్ : శ్రీరామ్,

పి.ఆర్.ఓ: సాయి సతీష్‌,

బ్యానర్: చిరంజీవి క్రియేషన్స్,

నిర్మాత : చల్లపల్లి‌అమర్,

రచన- దర్శకత్వం: యండమూరి వీరేంద్రనాథ్.