పేట మూవీ రివ్యూ

Published On: January 10, 2019   |   Posted By:

పేట మూవీ రివ్యూ

ఏంటీ పేట..నోటి మాట రాలేదు (‘పేట’ రివ్యూ)

రేటింగ్ : 2/5

 సీనియర్ హీరోలకు కథలు దొరకటం లేదా..కొత్త డైరక్టర్స్ కూడా పాత సినిమాలనే రీసైకిల్ చేయాల్సిన అవసరం ఏమొస్తోంది..అనే ప్రశ్నలు పేట చూస్తూంటే వరసపెట్టి కలుగుతూంటాయి. అభిమానం ముసుగులో అంత ఇన్ సెక్యూరిటీ గా కథ,కధనం నడపటం ఇబ్బందిగా అనిపిస్తుంది. వింటేజ్ రజనీకాంత్ ని చూపెడతామని పూర్తిగా వింటేజ్ సినిమానే తీస్తాడని ఊహించం. ఇంతకీ పేట కు సుబ్బరాజు అనుకున్న స్టోరీ లైన్ ఏమిటి… రజనీ అభిమానులకు అయినా ఈ సినిమా నచ్చుతుందా…2.0 సినిమా తర్వాత రావాల్సిన రజనీ సినిమా ఇలాంటిదేనా…వంటి విషయాలు మాట్లాడుకుంటూ రివ్యూ చూద్దాం.

కథేంటి

 హాస్టల్ వార్డెన్ గా జాయిన కాళీ(ర‌జ‌నీకాంత్‌) కు అక్కడ జూనియర్స్ ని ఇబ్బంది పెడుతున్న   మైకేల్‌( బాబీ సింహ‌) ని అడ్డు పడుకుంటాడు.దాంతో అది ఆ ఇష్యూ పెద్దదై లోకల్ డాన్ అయిన మైకేల్ తండ్రి తో గొడవగా మారుతుంది. ఈలోగా ప్రాణిక్‌ హీలర్‌  మంగళ సిమ్రన్‌)తో కాళీకి పరిచయం అవుతుంది. ఆమె కుమార్తె(మేఘా ఆకాష్) ..అన్వర్ అనే కుర్రాడితో ప్రేమలో ఉందని తెలిసి..వాళ్లను కలుపుతాడు. ఈ లోగా మైకల్ తండ్రి…కొందరినీ కాళీ ని కొట్టమని పురమాయిస్తాడు. వాళ్లువచ్చి కాళీని చంపబోతాడు. ఆ సమయంలో అతను కాళీ కాదు… పేట వీర అని రివీల్ అవుతుంది. ఫాలో అప్ గా ఫ్లాష్ బ్యాక్ ఉందని అర్దమవుతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ కు నేపధ్యం ఉత్తరప్రదేశ్. అక్కడ  పేటకు, పొలటీషియన్ సింహాచలం (న‌వాజుద్దీన్ సిద్ధికీ)కి పాత గొడవలు ప‌గ‌లుంటాయి. అసలు పేట ఎవరు…అతన్ని చంపేటంత పగ  సింహాచలం ఎందుకు పెంచుకున్నాడు.  ఈ పగ ,ప్రతీకారం టాపిక్ కు పేట పెళ్లి చేసిన  అన్వ‌ర్‌కి ఉన్న రిలేష‌న్ ఏంటి? చివ‌ర‌కు పేట ఏం చేశాడు? అనే విష‌యాలు తెల‌సుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

ఈ కథ చదువుతూంటే రజనీకాంత్ సూపర్ హిట్ భాషా మళ్లీ చెప్తున్నట్లుంది కదూ. నేపధ్యం మార్చి మళ్లీ అదే కథను చెప్పే ప్రయత్నం చేసాడు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు. జిగర్తాండ వంటి న్యూ ఏజ్  సినిమాతో  తమిళ సినిమాకు కొత్త తరహా కథ,కథనం పరిచయం చేసిన ఈ దర్శకుడు రజనీతో సినిమా అనేసరికి పాత పాత్రనే సరికొత్తగా అలంకరించి ప్రెజెంట్ చేసారు. అవే స్టైల్స్, అదే నేరేషన్..మారిందల్లా దర్శకుడు,కథా నేపధ్యం మాత్రమే. అయితే రజనీ వీరాభిమానులకు ఇది నచ్చచ్చు. కానీ డబ్బింగ్ సినిమా అంటే ఏదన్నా కొత్త విషయం ఉంటుందని ఆశించే తెలుగువాళ్లకు మాత్రం ఇది మింగుడుపడని విషయం.

ఎవరెలా చేసారు

ఇక రజనీకాంత్ తన పాతరోజుల్లోకి వెళ్ళి చెలరేగిపోయారు. ఆయన ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ ఇచ్చేసారు. కబాలి,కాలా, 2.0 సినిమాల్లో కనపడని స్టైల్స్ ఈ సినిమాలో అడుగడుగునా చొప్పంచాడు. రజనీ, సిమ్రాన్ ట్రాక్ కూడా కొత్తదేం కాదు. న‌వాజుద్దీన్ సిద్ధికీ   సింహాచ‌లం పాత్ర‌లో సూపర్బ్ అనిపిస్తారు.  బాబీ సింహ లాంటి నటుడుని పెద్దగా ఎలివేట్ చేసే  పాత్ర కాదు.  గుండా జిత్తులాగా విజ‌య్ సేతుప‌తి అరిపించాడు. త్రిష , శశికుమార్ వంటివారు రొటీన్ గా చేసుకుంటూ పోయారు. కాకపోతే కథే వాళ్ళకు కలిసిరాలేదు.

సాంకేతికంగా

అనిరుధ్ పాట‌లు సోసోగా ఉన్నా బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా ప్లస్సైంది. తిరు కెమెరా వర్క్ బాగా రిచ్ లుక్ తెచ్చింది. డైలాగులు ర‌జ‌నీకాంత్ పొలిటిక‌ల్ ఎంట్రీ రాసుకున్నారు. అవి తెలుగునాట పెద్దగా పేలలేదు. పొలిటికల్ గా రజనీ మనకు కనెక్ట్ అవటం కష్టమే. ఎడిటింగ్ బాగుంది. కార్తీక్ సుబ్బరాజు అదిరిపోయే విజువల్స్ తో అధమ స్దాయి కథతో అల్లాడిద్దామనుకున్నాడు. 

చివరి మాట

రజనీ వీరాభిమానులకు విపరీతంగా నచ్చే పేట..సినీ ప్రేమికులకు నోట మాట రానివ్వదు.

తెర వెనుక..ముందు

న‌టీన‌టులు: ర‌జ‌నీకాంత్‌, సిమ్ర‌న్‌, త్రిష‌, విజ‌య సేతుప‌తి, నవాజుద్దీన్  సిద్ధిఖీ, బాబీ సింహా, యోగిబాబు త‌దిత‌రులు

సంగీతం: అనిరుధ్ ర‌విచంద్ర‌న్‌

సినిమాటోగ్ర‌ఫీ:  తిరు

ఎడిటింగ్‌:  వివేక్ హ‌ర్ష‌న్ 

నిర్మాత‌: క‌ళానిధి మార‌న్‌, అశోక్ వ‌ల్ల‌భ‌నేని

ద‌ర్శ‌క‌త్వం:  కార్తీక్ సుబ్బ‌రాజు

సంస్థ‌: స‌న్ పిక్చ‌ర్స్‌

విడుద‌ల‌: 10-01-2019