ప్రకాశ్‌రాజు నవీన్‌చంద్ర కార్తీక్‌రత్నం చిత్రం తొలిషెడ్యూల్‌ ప్రారంభం

Published On: March 4, 2022   |   Posted By:

ప్రకాశ్‌రాజు నవీన్‌చంద్ర కార్తీక్‌రత్నం చిత్రం తొలిషెడ్యూల్‌ ప్రారంభం

శివరాత్రి రోజున తొలిషెడ్యూల్‌ ప్రారంభం

ప్రకాశ్‌రాజు, నవీన్‌చంద్ర,  కార్తీక్‌రత్నం,  వాణీబోజన్, అమృతా అయ్యర్‌లు  కీలకపాత్రల్లో నటిస్తోన్న చిత్రం ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే.

శ్రీ షిరిడిసాయి మూవీస్‌ అధినేత యం. రాజశేఖర్‌ రెడ్డి, థింక్‌ బిగ్‌ బ్యానర్‌పై ‘తలైవి’ దర్శకుడు ఏ.ఎల్‌ విజయ్, ప్రకాశ్‌రాజ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రకాశ్‌రాజ్, శ్రీక్రియేషన్స్‌పై బి.నర్సింగరావులు నిర్మిస్తున్నారు.

శ్రీ అండ్‌ కావ్య సమర్పణలో ప్రొడక్షన్‌ నం 6గా తెరకెక్కుతున్న తెలుగు, తమిళ ద్విభాషా  చిత్రం తొలిషెడ్యూల్‌ శివరాత్రి పర్వదినం సందర్భంగా హైదరాబాద్‌లో ప్రారంభం అయ్యింది.

ఈ చిత్రంతో వాలీ మోహన్‌దాస్‌ దర్శకునిగా పరిచయం అవుతున్నారు.

తెలుగులోను, తమిళంలోను నవీన్‌చంద్ర, ప్రకాశ్‌రాజ్‌  ఇద్దరు  నటులు రెండుభాషల్లో ఫేమస్‌ కావటంతో వారివురు  కామన్‌గా నటించనున్నారు.

తెలుగులో ‘‘కేరాఫ్‌ కంచెరపాలెం’’ ఫేమ్‌ కార్తీకరత్నం నటిస్తోన్న పాత్రకు తమిళ్‌లో ధనుష్‌ హీరోగా నటించిన  ‘‘అసురన్‌’’తో ఫేమస్‌ నటుడైన తమిళ సింగర్‌   టీ.జె అరుణాచలం నటించటం విశేషం.

వారివురితో పాటు నవీన్‌చంద్ర పాల్గొనే కీలకమైన చేజింగ్‌ సన్నివేశాలను హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ చేయనున్నారని నిర్మాత యం.రాజశేఖర్‌ రెడ్డి తెలిపారు.

ఈ చిత్రానికి  కెమెరా–గురుదేవ్, ఎడిటర్‌– సతీష్‌ , ఆర్ట్‌– హరిబాబు.