ఫుల్ బాటిల్ చిత్రం ప్రారంభం

Published On: April 7, 2022   |   Posted By:

ఫుల్ బాటిల్ చిత్రం ప్రారంభం

వెర్సటైల్ హీరో స‌త్య‌దేవ్ క‌థానాయ‌కుడుగా శ‌రణ్ కొప్పి శెట్టి దర్శకత్వంలో రామాంజ‌నేయులు జ‌వ్వాజి -ఎస్‌.డి. కంపెనీ రూపొందిస్తోన్న ఫ‌న్ రైడ‌ర్ ‘ఫుల్ బాటిల్’ లాంఛనంగా ప్రారంభం.

విలక్ష‌ణ‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో మెప్పిస్తోన్న స‌త్య‌దేవ్ హీరోగా రామాంజ‌నేయులు జ‌వ్వాజి, ఎస్‌.డి. కంపెనీ నిర్మాణంలో స‌ర్వాంత్ రామ్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ఫ‌న్ రైడ‌ర్ ‘ఫుల్ బాటిల్’. ఫన్, ఫాంటసీ సహా అన్ని ఎలిమెంట్స్‌తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం బుధ‌వారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. శ‌ర‌ణ్ కొప్పిశెట్టి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

ఈ సినిమా మేక‌ర్స్ కాన్సెప్ట్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్ యూనిక్‌గా ఉంది. సినిమా ఎలా ఉండ‌బోతుందోన‌ని ఆస‌క్తిని క‌లిగించేలా ఈ పోస్ట‌ర్‌ను డిజైన్ చేశారు. స‌రికొత్త కాన్సెప్ట్‌తో తెర‌కెక్క‌నున్న ఈ మూవీ షూటింగ్‌ను వీలైనంత త్వ‌రగా పూర్తి చేసి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తామ‌ని మేక‌ర్స్ తెలిపారు.

సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి సంతోష్ కామిరెడ్డి ఎడిట‌ర్‌. న‌వీన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌.

బ్యాన‌ర్ : స‌ర్వాంత్ రామ్ క్రియేష‌న్స్

న‌టీన‌టులు : స‌త్య‌దేవ్‌

నిర్మాత‌లు :  రామాంజ‌నేయులు జ‌వ్వాజి, ఎస్‌.డి.కంపెనీ

ద‌ర్శ‌క‌త్వం: శ‌ర‌ణ్ కొప్పిశెట్టి

సినిమాటోగ్ర‌ఫీ :  సుజాత సిద్ధార్థ్‌

ఎడిటింగ్ :  సంతోష్ కామిరెడ్డి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ : న‌వీన్ రెడ్డి