బాయ్‌ఫ్రెండ్‌ ఫర్ హైర్ మూవీ రివ్యూ

Published On: October 14, 2022   |   Posted By:

బాయ్‌ఫ్రెండ్‌ ఫర్ హైర్ మూవీ రివ్యూ

image.png
బాయ్‌ఫ్రెండ్‌ ఫర్ హైర్’ రివ్యూ
Emotional Engagement Emoji (EEE)
👎
 
‘పెళ్లి అయితే అన్నీ సెట్‌ అవ్వవు. అన్నీ సెట్‌ అయితేనే పెళ్లి చేసుకోవాలి’ అనుకునే కుర్రాడి కథను చెప్పాలని చేసిన ఈ ప్రయత్నం ఈ సినిమా. అన్నీ సెట్‌ చేసుకునే పెళ్లి చేసుకున్నాడా? అనే పాయింట్ చుట్టూ  ‘బాయ్‌ఫ్రెండ్‌ ఫర్‌ హైర్‌’ (Boyfriend For Hire) సినిమా తిరిగింది.  అద్దెకు బాయ్‌ఫ్రెండ్‌.. అనే సరికొత్త కథాంశంతో ఈ సినిమా రూపొందిన ఈ చిత్రం వర్కవుట్ అయ్యిందా…అసలు ఈ చిత్రం కథేంటి..ఇంతకీ పెళ్లికు ముందు సెట్ కావాల్సినవి ఏమిటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీలైన్:

మొదటి నుంచి అమ్మాయిలకు దూరంగా ఉంటాడు అర్జున్ (విశ్వంత్). అందుకో ప్రత్యేకమైన  ప్లాష్ బ్యాక్ ఉంటుంది. చదువు పూర్తైన తర్వాత మరో చేదు ఎక్సపీరియన్స్ తో  జీవితంలో అమ్మాయిల జోలికి వెళ్ళకూడదని అనుకుంటాడు. అయితే అతని  తల్లిదండ్రులు పెళ్లి  చేసుకోమని ఒత్తిడి తెస్తారు. అప్పుడు అమ్మాయిలను అర్థం చేసుకోవడానికి, తనకు సరైన లైఫ్ పార్ట్నర్ ని ఎంపిక చేసుకోవడానికి ఒక మార్గం ఎంచుకుంటాడు. అదే అద్దెకు బాయ్‌ఫ్రెండ్‌. తనను తాను అద్దెకు ఇచ్చుకుంటూ ఆ ప్రాసెస్ లో  తగిలే అమ్మాయిలను తనకు కావాల్సిన లక్షణాలతో పోల్చి చూసుకుంటూంటాడు. తను ప్రాక్టికల్ గా ఉన్నాను అనుకుంటాడు. ఈ అద్దెకు బోయ్ ప్రెండ్ కాన్సెప్టు తో  అతడికి దివ్య (మాళవికా సతీషన్) పరిచయం అవుతుంది. అక్కడ నుంచిఅతని జీవితం మారుతుంది. ఇంతకీ అసలు ఆమె ఎవరు? తాను కోరుకున్న లక్షణాలు ఆమెలో ఉన్నాయని పెళ్ళికి సిద్ధపడిన అర్జున్, ఆ తర్వాత ఆమెను ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చింది? అద్దెకు బాయ్‌ఫ్రెండ్‌గా వెళ్లడం అలవాటు చేసుకున్న అతడు, జీవితంలో తెలుసుకున్న విషయాలు  ఏమిటి?చివరకు అతను రిలేషన్ షిప్ లో ఎంటర్ అవగలిగాడా లేదా  అనేది మిగతా సినిమా.

ఎలా ఉంది:

కొత్త ఆలోచనలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. అందులో సందేహం లేదు. ఇదీ అలాంటిదే. అయితే ట్రీట్మెంట్ కథ. కానీ దానిపై దర్శక,రచయితలు ఎక్కువ కష్టపడలేదు. ప్రేక్షకుడి ఊహకి చాలా సులువుగా అందిపోయే కథ ఇది చివరకు టర్న్ తీసుకుంది. నాలుగైదు సీన్స్ అవ్వగానే ఇంటర్వెల్ ఏంటో తెలిసిపోతుంది. ఇంటర్వెల్ తర్వాత వచ్చే మూడో సన్నివేశంలోనే క్లైమాక్స్ అర్ధమైపొతుంది. ఇలాంటి కథకు ట్రీట్మెంట్ బాగోపోతే వర్కవుట్ కాదు. కానీ దర్శకుడు ఆ దిశగా అలోచించలేదు.  డైలాగులు రాసి నటీనటులతో మెల్లిగా అప్పగించుకుంటూపోయాడు. ఫస్టాఫ్ అంతా ఇంటర్వెల్ కోసం ఎదురుచూస్తూ కూర్చుంటాం. సెకండాఫ్ లో క్లైమాక్స్ లో ఎదురూచూపులు. ఎక్కడైనా, ఎప్పుడైనా డ్రామా సహజంగా క్రియేట్ అయితేనే పండుతుంది. కానీ ప్రతీ పాత్రా బలవంతంగా డ్రామా చేయడంతో విసుగొస్తుంది.

ఏదైమైనా టైటిల్ చూసి లొపలకి వెళ్లాక…ఈ సినిమా ఒక  రొటీన్ డ్రామా గా మార్చేస్తారని ఎవరూ ఊహించరు.  తమకు ఎటువంటి లైఫ్ పార్ట్నర్ కావాలో నిర్ణయించుకోలేక డైలమాలో తికమకగా ఉంటున్నారు కుర్రాళ్ళు. ఆ పాయింట్ ని టచ్ చేసాడు కానీ పూర్తిగా ఆ దిసగా ప్రయాణం పెట్టుకోలేదు. అయినా ‘బాయ్‌ఫ్రెండ్‌ ఫర్ హైర్’ టైటిల్‌లో, ఐడియాలో ఉన్న కొత్తదనం సినిమాలు అసలు లేదని మనకు సినిమా ప్రారంభమైన పది నిముషాల్లోనే అర్దమవుతుందంటే ఎలా ఉందో అర్దం చేసుకోవాలి. అయినా ..అదేం కామెడీనో …అద్దెకు బాయ్ ఫ్రెండ్ అని పోస్ట్ చేయగానే… చాలా మంది అమ్మాయిలు…ఆ  అబ్బాయికి ఫోనులు చేయడం స్టార్ట్ చేస్తారు. తమ సమస్యలు విన్నవించుకుని పరిష్కరించమని అడుగుతూంటారు. ఎంత సినిమాటెక్ అనుకున్నా నమ్మబుద్ది కాదు. దానికి తోడు ఆ సమస్యలు ఏమన్నా కొత్తవా అంటే గతంలో చాలా చాలా తెలుగు సినిమాల్లో చూసేసినవే.  కానీ ఎక్కడా ఇలాంటి సినిమాలకు అవసరమైన సెన్సిబిలీటీస్ ఇందులో కనిపించలేదు. ప్రధాన పాత్రలని కూడా సరిగా తీర్చిదిద్దలేదు.    ఇంటర్వెల్ ముందు నుంచే సినిమా పూర్తిగా పట్టాలు తప్పింది. సీన్ కు తగినట్లుగా క్యారక్టర్స్ తమ బిహేవియర్స్ ని మార్చేసుకుంటాయి. వరసపెట్టి జరిగే ప్రొసీడింగ్స్ కు సరైన కారణం కనపడదు.

టెక్నికల్ గా చూస్తే…

కెమెరా వర్క్ జస్ట్ ఓకే, ఎడిటింగ్ ఇంకా బాగా చెయ్యాల్సింది. చాలా చోట్ల డ్రాగ్ అయ్యింది. ప్రొడక్షన్ డిజైన్ యావరేజ్. ఉన్నంతలో గోపీ సుందర్ మ్యూజిక్ బాగుంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలో కొన్ని విషయం లేని సీన్స్ ని కూడా ఎలివేట్ చేసింది. . నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా వున్నాయి.  కథా రచనలో మెరుపులు లేవు.  ఈ టైటిల్ ఓ వర్గానికే పరిమితం అయ్యేటట్లు ఉంది. కానీ వాళ్లు కూడా వస్తారా అనే సందేహం వచ్చింది.

నటీనటుల్లో …విశ్వంత్ దుడ్డుంపూడి సెన్సిబుల్ నటుడు. తన పాత్రని సెటిల్‌గా చేశాడు. భావోద్వేగాలు చక్కగా పలికాయి.మాళవిక సతీషన్ అందంగా వుంది.   అయితే దర్శకుడు  ఆ పాత్రని ఒకటే మూడ్ లో డిజైన్ చేయడం వలన ఎక్కువ వేరియేషన్స్ చూపించే అవకాశం దక్కలేదు. మిగతా పాత్రలతో ఫన్ పండే అవకాశం వున్నా దర్శకుడు ఆ ఛాన్స్ తీసుకోలేదు.  మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి.

చూడచ్చా

టైటిల్ చూసి టెమ్ట్ అయ్యి వెళ్తే….ఆ బోర్ తట్టుకోవటానికి ఎవరినైనా హైర్ చేసుకోవాలి.

నటీనటులు : విశ్వంత్ దుడ్డుంపూడి, మాళవిక సతీషన్, మధునందన్, రాజా రవీంద్ర, హర్షవర్ధన్, శివనారాయణ, ‘నెల్లూరు’ సుదర్శన్, పూజా రామచంద్రన్ త‌దిత‌రులు
ఛాయాగ్రహణం : బాల సరస్వతి
సంగీతం: గోపి సుందర్
నిర్మాతలు : వేణుమాధవ్ పెద్ది, కె నిరంజన్ రెడ్డి
రచన, దర్శకత్వం : సంతోష్ కంభంపాటి
Runtime: 2h 2m
విడుదల తేదీ: అక్టోబర్ 14, 2022