రాధే శ్యామ్ సినిమా NFT లాంఛింగ్

Published On: March 7, 2022   |   Posted By:

రాధే శ్యామ్ సినిమా NFT లాంఛింగ్

మార్చ్ 8న రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ NFT లాంఛింగ్.

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ పాన్ ఇండియన్ లవ్ స్టోరీ రాధే శ్యామ్. ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీనిపై అంచనాలు మరింత పెంచేసే పనిలో పడ్డారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ అభిమానుల కోసం మార్చ్ 8న రాధే శ్యామ్ సినిమాకు సంబంధించిన NFT లాంఛింగ్ జరగనుంది. ఈ కలెక్షన్‌లో ప్రభాస్ డిజిటల్ ఆటోగ్రాఫ్, 3డి యానిమేటెడ్ డిజిటల్ ఆర్ట్‌తో పాటు ఎక్స్‌క్లూజివ్ 3డి యానిమేటెడ్ పిక్చర్స్ కూడా ఉండబోతున్నాయి. సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ నడిపిన కారుకు సంబంధించిన 3డి యానిమేటెడ్ NFT కూడా ఇందులో ఉండబోతున్నాయి. వాటిని కొనుక్కోడానికి అభిమానులకు మార్చ్ 8 నుంచి అందుబాటులోకి రానున్నాయి.

అభిమానులకు సినిమా విడుదలకు ముందు ఇంతకంటే పెద్ద బహుమతి మరోటి ఉండదేమో..? ప్రభాస్ లెగసీ కంటిన్యూ చేయడానికి అభిమానులకు డిజిటల్ సేకరణలకు ఇది మంచి అవకాశంగా నిలిచింది. ఈ డిజిటల్ కలెక్షన్‌లో విజేతగా నిలిచిన 100 మంది లక్కీ విన్నర్స్ నేరుగా ప్రభాస్‌ను కలిసే అవకాశం కూడా అందుకోనున్నారు. అంటే ఈ NFTలు ఎవరు ఎక్కువగా కొనుగోలు చేస్తే వాళ్లకు తమకు యిష్టమైన స్టార్‌ను కలిసే అవకాశం మరింత ఎక్కువగా ఉండబోతుంది. అభిమానులు డబ్బుల రూపంలోనే వీటిని కొనుగోలు చేయొచ్చు. క్రిప్టో కరెన్సీతో దీనికి పని లేదు. ఈ సినిమాలో ప్రభాస్ తన కెరీర్‌లోనే మొదటిసారి జ్యోతిష్కుడిగా నటించారు.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించారు. ఇటలీలోని అద్భుతమైన విజువల్స్.. అత్యద్భుతమైన మేకింగ్.. స్పెషల్ ఎఫెక్ట్స్.. హైదరాబాద్, జార్జియాలో తెరకెక్కించిన సన్నివేశాలు సినిమాకు హైలైట్ కానున్నాయి. ప్రభాస్, పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ కూడా సినిమాకు అదనపు ఆకర్షణ. టి సిరీస్, గుల్షన్ కుమార్ సమర్పిస్తున్న రాధే శ్యామ్ సినిమాను యువీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాకు కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ అందించారు. భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. మార్చ్ 11న సినిమా విడుదల కానుంది.